Preface:

I do NOT make money at all from blogging. The primary and in fact the sole reason I blog is to share my spiritual & travel experiences with others so that it helps as a tour guide during their trip to those places.

గురువుగారి ( SRI CHAGANTI KOTESWARAO GARU) అమృతమైన మాటల్ని పూర్తీ ప్రవచనం అంత కాకుండా .. ప్రవచనం మధ్యలో గురువుగారు ఎర్ర సిరాతో గుర్తుపెట్టుకోవాలని చెప్పే మాటల్ని ..ఒక బ్లాగ్ లో పొందుపరచాలని అనిపించి .. ఈ బ్లాగ్ ప్రారంబించాను మీరు ఒకసారి విని మీ అభిప్రాయం చెప్పండి .
http://thegoldenwords.blogspot.in

TELUGU TRAVEL BLOG

ఈ బ్లాగులో మీకు నేను ఒక స్నేహితుడుగా.. డబ్బులు తీసుకోని ఒక గైడ్ ల నేను చూసిన ప్రదేశాలను మీకు వివరిస్తాను :) .. మీకు నచ్చితే ఒక చిన్న కామేంట్ రాయండి ..ఒక్కరికైన షేర్ చేయండి.ఈ బ్లాగ్ రాయడం చేత నేను ఎటువంటి ఆదాయాన్ని సంపాదించడం లేదు.
మీరు నా బ్లాగ్ ఐడి మర్చిపోతే గూగుల్ / యాహూ లో TELUGU TRAVEL BLOG అని టైపు చేసి సెర్చ్ చేయండి.

నిను సేవింపగ

నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై
కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ
చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా!
నా బ్లాగ్ లో ఉన్న ఫోటోలను వికీపీడియా లోకి అవసరం అనుకుంటే మీరు నన్ను అడగకుండానే ఫోటోలను ఉపయోగించుకోవచ్చు
నమస్తే ,
మీకు తేలిసిన దేవాలయాల వివరములు పోస్ట్ చేయండి / కావాల్సిన ఆలయ వివరములను అడగండి . తెలిసిన సభ్యులు మీకు తెలియచేస్తారు .
http://www.facebook.com/TirthYatrainfo

Monday, December 10, 2012

Pithapuram Padagaya

ఓం నమ శివాయ | ఓం నమ శివాయ | ఓం నమ శివాయ | ఓం నమ శివాయ | ఓం నమ శివాయ | ఓం నమ శివాయ

Pithapuram -  East Godavari district -  Andhra Pradesh.
పిఠాపురం  లో ఉన్న ప్రసిద్ద ఆలయాలు  .. పాదగయ , పురుహూతికా అమ్మవారి ఆలయం , కుంతీ మాధవ స్వామి ఆలయం , వేణుగోపాల స్వామి ఆలయం , దత్త పీఠం , దత్తాత్రేయుని ఆలయం..  
మీకు లిస్టు చెప్పగా రండి ఒక్కో ఆలయాన్ని దర్శించుకుందాం .
Kukkuteshwara Swamy temple

 పాదగయ క్షేత్రం లోకి మనం ప్రవేశించగానే .. పరమశివుడు ధ్యానం చేస్తూ మనకు ధర్శినం ఇస్తారు .. నిజంగా శివున్ని చూస్తూ ఉంటే మనసు మనకు తెలియకుండానే స్వామి వారి చిరునవ్వు దగ్గర నిలిచిపోతుంది.





పక్కనే కోనేరు కనిపించడం తో కాళ్ళు కడుక్కుంటూ  పక్కకు చూస్తూ ఉంటే .. గయా సుర వృత్తాతం  (స్థలపురాణం) మనకు కనిపిస్తుంది .  


గయా సుర వృత్తాతం  (స్థలపురాణం) మనకు కనిపిస్తుంది



విష్ణుమూర్తి తన చక్రంతో గయుని శరీరాన్ని మూడు ముక్కలుగా ఖండించాడు. ఆ శరీరంలో శిరస్సు భాగం బీహార్‌లోని గయలో పడినదని దానిని ‘శిరోగయ’ అంటారు. నడుము భాగం ఒరిస్సాలోని జాజిపూర్ పడిందని దానికి ‘నాభిగయ’ అని పేరు వచ్చింది. పాదాలు ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో పడ్డాయని, దానికి ‘పాదగయ’ అనిపేరు వచ్చింది.  


 శిరోగయ = గయ క్షేత్రం – బీహారు రాష్ట్రం; ఫల్గునీ నదీ తీరం; విష్ణు క్షేత్రం; మంగళగౌరీ దేవి శక్తి పీఠం.

నాభిగయ = జాజిపూర్ క్షేత్రం – ఒరిస్సా రాష్ట్రం; యజ్ఞవేదికా స్వరూప బ్రహ్మ; గిరిజాదేవి శక్తి పీఠం
పాదగయ
= పిఠాపుర క్షేత్రం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం; కుక్కుటేశ్వరలింగరూపంలో ఈశ్వరుడు; పురుహూతికా శక్తి పీఠం


పాదగయ క్షేత్రం లో కోనేరులో స్నానం చేయడానికి .. తగిన ఏర్పాట్లు ఉన్నాయ్ .


 శివరాత్రి వంటి పర్వదినాలలో భక్తుల సంఖ్యా  ఈ విధంగానే ఉంటుంది ..  

 పాదగయ క్షేత్రం శివనామస్మరణతో మారు మోగుతుంది 


మనం ఆలయం లోకి ప్రవేశించగానే ఓం నమ:శివాయ అంటూ వినబడుతూ ఉంటే ..


 మనం కూడా మన ప్రమేయం లేకుండానే ఓం నమ:శివాయ అంటూ గొంతుకలుపుతాం 





  ఆలయం చుట్టూ ప్రదక్షణం చేస్తున్నప్పుడు చుట్టూ ఉంటె ఉప దేవాలయాలు మనకు కనిపిస్తాయ్

ఇక్కడ ఏక శిలతో ఉన్న పెద్ద నంది స్వామి వార్ని చూస్తూ ఉంటుంది

ఓం నమ: శివాయ


 ఓం నమ: శివాయ  ఓం నమ: శివాయ  ఓం నమ: శివాయ  ఓం నమ: శివాయ  ఓం నమ: శివాయ


Sri kukkuteswara Swamy Nitya Poojas
Time Pooja Performed
5.30 am to 11.00 a.m Aabhishekam
12.30 pm Maha Niveedhanam
4.30 pm Dharshanam
6.00 pm Dhoophaseva
7.30 pm Nivedhanam, Neerajanam, Mantra pushpam, Darbaruseva, Pavalimpu seva.

స్వామి వారి పక్కనే అమ్మవారు రాజరాజేశ్వరి గా పూజలు అందుకుంటుంది . శ్రీ  ఆది శంకరాచార్యులు  అమ్మవార్ని ప్రతిష్టించారని చేబుతారు . 

Sri Rajarajeswari ammavari Nitya Poojas
Time Pooja Performed
6.00 am Sahasra Kumkumarchana
12.30 pm Maha Nivedhana




శ్రీ పురుహూతికా శక్తి పీఠం 

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతికా శక్తి పీఠం పిఠాపురం నందు కలదు .
పురుహూతికా అమ్మవారి గుడి కుక్కుటేశ్వర స్వామి గుడిలో ఈశాన్యభాగంలో ఉంది.



పురుహూతికా అమ్మవారి గుడి చిన్నదైననూ అష్టాదశ శక్తిపీఠాల శిల్పాలు చెక్కపడి చాలా అందంగా ఉంటుంది. పురుహూతికా విగ్రహం నాలుగు చేతులు కలిగి ఉంటుంది.

 ఆ నాలుగు చేతులలో విత్తనాల [బీజాలు] సంచి , గొడ్డలి [పరశువు], కమలం, మధుపాత్ర ఉంటాయి. 

 ఈ ఆలయం లో మనం ఇంకా కాశి అన్నపూర్ణ , అయ్యప్ప , నవ గ్రహాలు , శ్రీ రాముడు , శ్రీ కృష్ణా , కామాక్షి , ఆది శంకరాచార్యులు , శ్రీ సాయి బాబా , దత్త త్రేయ స్వామి వార్ని దర్శించవచ్చు .





 KUKKUTESWARA SWAMY DEVASTHANAM
PITHAPURAM
EAST GODAVARI DISTRICT
Pin-code : 533450
WebSite : www.kukkuteswaraswamypadagaya.com
Email Id : eopadagaya@gmail.com


eopadagaya@yahoo.in
Phone : 08869 - 252477(For Room Booking and Pooja Details)
Timings : 7:30am - 12:30pm & 4:30pm - 8:30pm
Phone : 08869 - 251445(Office)
Timings : 9.00am - 1:00pm & 4:30pm - 8:30pm

Kunthi Madhava Swami Temple 

కుంతీ మాధవ స్వామి ఆలయం 
  
వృత్తాసురుడిని చంపిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకుందికి ఇంద్రుడు ఐదు వైష్ణవాలయాలు స్థాపించేడు. అవి




  • కాశీ లో బిందు మాధవ స్వామి.
  • ప్రయాగ లో వేణు మాధవ స్వామి.
  • పిఠాపురంలో కుంతి మాధవ స్వామి.
  • తిరుచునాపల్లి లో సుందర మాధవ స్వామి.
  • రామేశ్వరం లో సేతు మాధవ స్వామి. 


Sripada Sri Vallabha Maha Samsthanam

దత్తాత్రేయ స్వామి మొదలుకొని షిర్డీ సాయిబాబా వరకు ఉన్న గురు పరంపర లో, శ్రీ పాద వల్లభ స్వామి అవతారం విశేషం అయినది. పిఠాపురం లో దత్తాత్రేయ అంశగా ఒక పుణ్య దంపతులకి జన్మించి, గురు స్వరూపమై  ఎందరో సామాన్యులను  ఉద్ధరించి,  వేదోక్తమైన జీవనాన్ని - ధర్మాన్ని నిలిపి, జీవుల కర్మలను బాపి, గానుగా పురం లో నివశించిన స్వామి ఆయన. స్వామి జన్మించిన ఇల్లు ఇప్పటి మహా సంస్థానం.






శ్రీపాద  శ్రీవల్లభ మహా సంస్థానం,  వేణుగోపాలస్వామి గుడి వీధి,
పిఠాపురం  - 533450,
తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. 
కార్యాలయం పని వేళలు : ఉదయం 9 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు.
ఫోన్  - (08869) 250300
ఫ్యాక్స్ - (08869) 250900
ఇమెయిల్ : info@sripadasrivallabha.org
వెబ్ సైటు: http://www.sripadasrivallabha.org  

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం 

Venu Gopala Swamy temple

 శ్రీ పాద వల్లభ  మహా సంస్థానానికి పక్కనే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది .

దత్తాత్రేయుని ఆలయం

Sripada Vallabha Anagha Datta Kshethram 






ఈ ఆలయం పిఠాపురం నుంచి కత్తిపూడి వెళ్ళేదారిలో ఉంది (పశువుల సంత ).  ఆలయం చాల చక్కగా కట్టారు. మనం ఆలయం లోకి ప్రవేశించగానే మనస్సుకు ప్రశాంతతా చేకూరుతుంది . ఊరికి  దూరంగా  ఉండటం వాళ్ళ .. చుట్టూ పచ్చటి పోలాలతో  చాలా బాగుంటుంది . మీరు వెళ్ళినప్పుడు వేంటనే  వచ్చేయకుండా వీలైనంత ఎక్కువసేపు  ఆలయం లో ఉండటానికి  ప్రయత్నించండి .  










 
 పిఠాపురం చుట్టుప్రక్కల ఉన్న ప్రసిద్ధ  దేవాలయాలు .
 1. పంచారామక్షేత్రం భీమేశ్వరాలయం - సామర్లకోట ( 13 K.M)


2. శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి -    అన్నవరం ( 23 K.M)


 3. తోలి తిరుపతి ( శ్రీ శృంగార వల్లభ స్వామి) తిరుపతి ( 13 K.M)  (DIVILI )



మిమ్మల్ని తోలి తిరుపతి  తరువాతి పోస్ట్ లో తీస్కుని వెళ్తాను .. :)

4. సీతారాముల గుడి - విరవ ( 9K.M)

నా చిన్నప్పుడే నేను శ్రీరామచంద్రుల పాదముద్రను చూసే అదృష్టం కలిగింది . నేను ఆరవ తరగతిలో ఉండగా జరిగిన శ్రీరామా నవమి నాటి మరోసటి రోజు ఆలయం లో నవమి రాత్రి రాముల వారి దగ్గర ఏర్పాటుచేసిన ఏర్పాట్లు ( ఏమని పిలుస్తారో తెలియదు) . ఒక వస్త్రం పై (మైదాపిండే అనుకుంటా ) పిండి మొత్తం చక్కగా సర్దారు . మరోక  వస్త్రం  రాముల వారని , సీతమ్మ తల్లిని   కొద్దిగా దూరంగా ఎదురేదురగా ఉంచారు .
మరోసటి రోజు ఉదయానికి ఒక వస్త్రం పై మన మోచెయ్యి అంత శ్రీ రాముల వారి పాదం ఉంది . మరొక వస్త్రం పై రాములు వారు సీతమ్మ
డుకున్నట్టు చిన్న గుర్తులు కనిపించాయి . నేను అనుమంతో నిజంగా రాముల వారి పదమేనా అనే డౌట్ గా కొలిచి మరిచుసాను.. బాబోయ్ ఇంత పాదం ఎవరకి ఉండదు . నిజంగా మా రాముల వారిదే ఇది అని అప్పుడే నమ్మనే . ఎప్పుడన్నా దేవుడు లేడు అని ఆలోచన వచ్చినప్పుడు ఆ రోజు దేవుడి పాదాలను చూసావ్ కదరా అని గుర్తుకు తెచ్చుకుంటాను . ఆరోజుల్లో ఇంత మీడియా లేకపోవడం తో కనీసం ఫోటో కూడా తెయలేకపోయారు మావాళ్ళు. కాని ఆలాంటి గుడి ఇప్పుడు 100 స||వ || పూర్తీ చేస్కుని రామదాసు కోసం ఎదురుస్తూ ఉంది .

 


34 comments:

  1. రాజాచంద్ర గారూ,

    అద్భుతముగా ఉందండీ మీ టపా... చివరి కార్తీక సోమవారమునాడు, కుక్కుటేశ్వర స్వామి వారి మరియు పురుహూతికా అమ్మని దర్శించడం.
    ఇలాగే ఇంకా ఇంకా మరిన్ని క్షేత్రాలు మాకు పరిచయం చేయగలరు.

    ReplyDelete
  2. Very beautiful sir. I am longing to visit Pitapuram and you literally made me visit all the places that I wanted to visit. Thank you and regards.

    ReplyDelete
  3. chakka gaa undi raja chandra

    hara hara mahaa deva shambho shankara

    ReplyDelete
    Replies
    1. chela chakkaga chepperu raja garu very usefull to others .....nice information ..keep it up

      Delete
  4. కార్తీకమాసాన శక్తిపీఠదర్శనం చేపించారు ధన్యవాదములు

    ReplyDelete
  5. ఇటీవల నేను కాకినాడ వచ్చినప్పుడు మీరు ప్రదర్శించిన పుణ్య ప్రదేశాలను ప్రత్యక్ష దర్శనం చేసి తరించాను. నేడు మీ బ్లాగ్ ద్వారా మరోసారి ఆ అనుభూతులను స్మరించుకున్నాను. కార్తీక దామోదరుడు మిమ్ములను అనుగ్రహించ ప్రార్ధన.

    ReplyDelete
  6. ఎన్నో రోజులుగా వెళ్ళాలి అనుకుంటున్నా వాయిదా పడుతూనే ఉంది.అన్ని దేవాలయాల గురించి చాల చక్కగా వివరించారు.Thank you.

    ReplyDelete
  7. How fortunate I'm am? I came across this website on Karthika Somavaram day.

    Very nice sir. Kudos to your efforts.
    I'm surely going to visit Pithapuram in my next visit to India.

    God Bless You.

    ReplyDelete
  8. అన్ని వివరాలతో,మంచి ఫోటోలతో చాలా బాగా రాశారండీ.:-)

    ReplyDelete
  9. raja chandra gaaru, we spend our time to visit the places in long distances. but we don't spare our time to visit our nearby areas which are easy to travel and most comfortable. I really thanking you to post such a place like pithapuram.

    ReplyDelete
  10. చాలా వివరంగా రాశారు ధన్యవాదములు! త్వరలోనే దర్శిస్తాను అనుకుంటున్నాను.
    హర హర మహాదేవ శంభో శంకర!

    ReplyDelete
  11. చాల విపులంగా విశదికరించారు.ఆ మహాదేవుడు కృపతో అన్నిచూడటం జరిగింది. కాని ఈ కార్తికమాసంలో మీ బ్లాగ్ ద్వార మరోక్కమారు దర్శనం చేయగలిగాను.
    ఓం నమఃశివాయ


    ReplyDelete
  12. The place is really good in Telugu.

    ReplyDelete
  13. Hello Raja chandra garu, This blog contains use full information.We are Lord Datta devotees.I want to visit pitapuram very soon.But literally i was visited through this blog.You are doing great service for all devotees.Keep it up.God bless you.

    ReplyDelete
  14. పుణ్యక్షేత్రo విశేషాలు బాగా రాస్తారు. ఈ విశేషాలు ముందుగ కనుక్కుని ఆ క్షేత్రం లో అలాగా తిరుగుతార ?

    ReplyDelete
  15. Very Good Information...........
    Pls try to include information about "SWAYAMBHU DATTA" Temple.

    ReplyDelete
  16. I had attended our UTF tchrs meeting at tirupati in april2013. After that we had went on tour Kanchi,mahabalipuram, arunachalam, sripuram extra . Very useful to me in that tour

    ReplyDelete
  17. I had attended our UTF tchrs meeting at tirupati in april2013. After that we had went on tour Kanchi,mahabalipuram, arunachalam, sripuram extra . Very useful to me in that tour

    ReplyDelete