rajachandra

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tamilandu Temple Information Part - 2

Tamilandu Temple Information Part - 2
తమిళనాడు టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం .. ఒకేసారి అన్ని ప్రధాన ఆలయాలు దర్శించేలా మనం చేస్తున్నా ప్రయాణం రేండవ పోస్ట్ కి స్వాగతం .
మనం అరుణాచలం లో ఉన్నాం కదా ! ఇప్పుడు అరుణాచలం నుంచి తిరిగి చెన్నై వచ్చి వేరే ఆలయాలు చూసేలా ప్లాన్ చేస్కోవచ్చు  , అరుణాచలం నుంచి బస్సు / కార్లలో దగ్గర్లో ఉన్న ఇతర ప్లేస్ లను కూడా కవర్ చేస్తూ యాత్ర కొనసాగించడం మరో ప్లాన్ ..
 మీరు తమిళనాడు టూర్ ( తమిళనాడు టెంపుల్ ఇన్ఫర్మేషన్ ) మొదటి పోస్ట్ చూడకపోతే ఈ లింక్ క్లిక్ చేయండి : 

http://rajachandraphotos.blogspot.in/2014/09/tamilnadu-tour-part-1.html

కనీసం ఈ బ్లాగ్ ద్వార అయిన ఒకసారి అన్ని చూసి వచ్చేద్దాం .. ఏమంటారు ?
మీకు ఇప్పుడు నాతో పాటు రండి .. మీరు విడీగా వెళ్ళినప్పుడు మీ ప్లాన్ ప్రకారం వెళ్ళండి .
అరుణాచలం నుంచి మనం పుదుచ్చేరి లేదా పాండిచెర్రి (Pondicherry), ప్రయాణం అవుదాం .  గూగుల్ వాడు చెప్తున్నట్టుగా 105 km . 2hrs జర్నీ .


5. Pondicherry



తమిళంలో 'పుదు - చ్చేరి' అంటే 'క్రొత్త - ఊరు' అని అర్ధం. దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం దీనిని ఫ్రెంచివారు "Poudichéry" అని పిలిచారు. ఎప్పుడో పొరబాటున ఆంగ్లంలో 'u' బదులు 'n' అని వ్రాయడం వల్ల దీనిని ఆంగ్లంలో 'పాండిచేరి' అని పిలువడం మొదలయ్యింది. తరువాత అదే ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఆంగ్లంలో అధికారికంగా 'పుదుచ్చేరి' అని పేరు మార్చే ప్రయత్నం జరుగుతున్నది.


Matri_Mandir
పుదుచ్చేరి  బీచ్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం 


పుదుచ్చేరికి చెందిన కొందరు ప్రముఖులు:

  • అరవింద మహర్షి: ఈయన స్మృత్యర్ధం నిర్మించిన అరవిందాశ్రమం ఆరొవిల్లిలో ఒక ప్రధాన పర్యటనా కేంద్రం, తాత్విక అధ్యయనా స్థానం.

Aurobindo Ashram


Puducherry_Park_Monument

Aurobindo_Ashram
 అంతేనండి ఇక్కడ ఇంకా ఏమేమి దొరుకుతాయో ఈ పోస్ట్ లో చెప్పబడవు :)
భోజనాలు చేసి మీరు బస్సు లో ఎక్కితే .. మనం రహస్యాన్ని తెల్సుకునే ప్రయత్నం చేద్దాం ..
ఏమిటి రహస్యం సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా ?
అదేనండి మనం ఇప్పుడు చిదంబరం వేల్లబోతున్నాం .. చిదంబర రహస్యం తెల్సుకుందాం .. రండి రండి త్వరగా బస్సు లు ఎక్కండి .. మాస్టారు మీరు ఆ షాప్ ల వంక చూడకుండా బస్సు ఎక్కండి :)

6.  CHIDAMBARAM TEMPLE INFORMATION

పుదుచ్చేరికి చిదంబరం 60 కిలోమీటర్లు దూరం లో ఉంది . గూగుల్ మ్యాప్ కూడా ఇస్తా చూడండి . ఈ గూగుల్ మ్యాప్ ఇవ్వడానికి కారణం మీరు ఇతర ప్లేస్ లను కూడా చూడవచ్చుగా 



పరమ శివుడు శివతాండవం చేస్తూ నటరాజు గా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల సముదాయంలో ఉన్నది. శైవులకు దేవాలయం లేదా తమిళం లో కోయిల్‌ అంటే చిదంబరం ఉన్న ఈ నటరాజ దేవాలయం. చిదంబరం -- చిత్ - స్పృహ + అంబరం - ఆకాశం - అంటే శివుడు తాండవమాడే స్థలం అని అర్థం.

ఈ దేవాలయానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ తొమ్మిదిలో 4 పెద్ద గాలి గోపురాలు( తూర్పు, పశ్చిమ , ఉత్తర, దక్షిణ దిక్కులలో). ఈ నాలుగు గాలి గోపురాలు చాల పురాతనమైనవి. తూర్పు గాలి గోపురము మీద 108 ముద్రలతో భరత నాట్యం చేస్తున్న శిల్పాలు చెక్కబడ్డాయి. 
ఆలయ సముదాయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ ఆలయ సముదాయములోనే ఒక పెద్ద తటాకము (శివ గంగ) మరియు చిన్న ఇళ్ళు ఉన్నాయి. ఇవి కాక ఐదు సభలు లేదా వేదికలు ఉన్నాయి. అవి - గర్భగుడిగా వెలుగొందుతున్న చిత్సబై, చిత్సబైకి ఎదురుగానే ఉన్న నిత్యపూజలు జరిగే కనకసబై, గర్భగుడికి ఎదురుగానే శివుడు 'కాళి' తో నాట్యమాడినట్లుగా చెప్పబడుతున్న నృత్యసబై లేదా నాట్యసబై - ఇది శక్తి స్వరూపం, భగవంతుడి ఆధిపత్యాన్ని చాటి చెప్పిన ప్రాంతం, రాజ్యసబై లేదా 1000 స్తంభాల మంటపం (నిజానికి ఉన్నది 999 స్తంభాలే, భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు ఆయనే 1000వ స్తంభం) మరియు పంచమూర్తులు కొలువైన దేవసబై (పంచ - ఐదు, మూర్తులు - భగవంతుడి విగ్రహాలు. ఆ ఐదు ఏవంటే గణేశుడు - విఘ్నాలు తొలగించే స్వామి, తన భార్య 'శివానందనాయకి'తో కూడి కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే సోమస్కందర్ స్వామి, మురుగా స్వామి మరియు భక్తముఖ్యుడు, ప్రధాన భక్తుడు ఐన చండికేశ్వరర్). 



చిదంబర రహస్యం

 

చిదంబరంలో శివుడు నిరాకారుడిగా కొలువబడుతున్నాడు. స్వామి తన దేవేరి శక్తి లేదా శివగామితో అనంతంగా తన దివ్యమైన 'ఆనంద తాండవం' చేస్తుంటారని ప్రతీతి. దీన్ని గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆ స్థలాన్ని ఒక తెర కప్పి ఉంచుతుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు 'విల్వ' (బిల్వ) పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ, లోపలి వైపు జ్ఞానాన్నీ ముక్తినీ సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది. దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా తానే దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ - శివ - భగవంతుడు, అహం - నేను/మేము, భవ - మన స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ.
అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు.

పంచభూతలింగక్షేత్రములు- Panchabhuta Kshetralu
 1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము(Arunachalam): అగ్ని లింగం
2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం(Jambukeswaram): జల లింగం
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం(Chidambaram): ఆకాశ లింగం
4. ఏకాంబరేశ్వరుడు - కంచి(Kanchipuram): పృధ్వీ లింగం
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి(Sri kalahasti): వాయు లింగం

 మరో విశేషం ఏమిటంటే .. తమిళనాడు లోని దేవాలయాల అన్నింటికంటే చిదంబరం లోని స్వామి కి హారతి చివర్లో ఇస్తారంటా  .. తప్పకుండా చూడవల్సిన హారతి . చాల అద్బుతంగా ఉంటుంది . 

 7. Vaitheeswaran Temple or Pullirukkuvelur


 చిదంబరం నుంచి వైతీస్వరన్ టెంపుల్ వేల్లబోతున్నాం . 
Shiva is worshipped as Vaitheeswaran or the "God of healing" and it is believed that prayers to Vaitheeswaran can cure diseases. It is one of the nine Navagraha (nine planets) temples associated with the planet Mars (Angaraka). The village is also known for palm leaf astrology called Naadi astrology in Tamil. It is located 7 kilometers from Sirkazhi, 235 kilometers from Chennai, 27 km from Chidambaram, 110 km from Thanjavur and 16 km from Mayiladuthurai.

 అదండీ అర్ధం అయింది కదా .. నాడీ జ్యోతీశ్యం ఇక్కడ ప్రసిద్ది . 5000/- వరకు ఛార్జ్ చేస్తారు . మీకు అందులో ఈ జన్మ కోసం కావాలా ? లాస్ట్ జన్మ , నెక్స్ట్ జన్మ .. ఇందులో వేటికోసం కావాలో అడిగి దానికి తగ్గట్టుగా చెప్తారు . నమ్మకం బట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతకు మించి నేను రాయడం లేదు . 
కుంబకోణం చుట్టుప్రక్కల నవగ్రహ టెంపుల్స్ ఉన్నాయి . ఒక్కో గ్రహానికి ఒక్కో టెంపుల్ ఉండటం ఇక్కడ విశేషం . ఈ టెంపుల్ కి చాల పెద్ద చరిత్ర ఉంది .. రామాయణ కాలం నుంచి ఈ ఆలయానికి సంబంధం ఉంది . 
ఇంగ్లీష్ వికీపీడియా నుంచి కాపీ పేస్టు చేస్తున్నా చూడండి . 
During the Ramayana period, Rama, Lakshmana and Saptarishi have worshipped the deity in this place. It is believed that Rama and his brother Lakshmana cremated the vulture king Jatayu who was killed by Ravana when he tried to prevent the abduction of Sita) at this place. There is a pond at this temple called Jatayu kundam (pot of Jatayu having holy ash of Vibhuti). One of the nine planets, Angaraka (Mars), suffered from leprosy and was cured by Vaidhyanathaswamy and from then on it is treated as one of the Navagraha Temples for planet Angaraka.Parvati, the consort of Shiva, asked her son, Subramanya to appear with one face from his regular appearance of six faces. When he did so, she was pleased and presented him with vel (a weapon) to slay the demons. Subramanya overcame the asura Surapadman (a demon) and in the war, his army was severely injured. Shiva came out as the healer Vaitheeswaran and cured the wounds.Like Panneer ilai Vibhuthi of Tiruchendur Temple, The "Tiruchaandu Urundai" (called in Tamil) which is covered with Vibhuti of deity heals various incurable diseases. It can be procured at the temple. 

మీకు  నవ గ్రహ టెంపుల్స్ వివరాలు  ఇస్తున్నాను .. 
Surya (The Sun) - Suriyanar Koil
3 Kms. from Aduthurai which is on the 
Kumbakonam- Mayiladuthurai Road
Chandra ( The Moon) - Thingaloor
1.5 Kms. from Thirupayhanam 
which is on the Kumbakonam-Thiruvayyaru Road
Angaraka ( Sewai )
The MarsVaitheeswarankoil
4 Kms. from Mayiladuthurai 
on the Chidambaram Road
Budan ( The mercury) - Trivenkadu
10 Kms. SouthEast of Sirkali
Guru ( The Vyazhan) (Jupiter) - Alangudi
About 15 Kms. from Kumbakonam 
on the way to NeedaMangalam
Sukran (Velli) (The Venus) - Kanjanoor 
An interior village on the
Mayiladuthurai - Kathiramangalam Road
Sani ( The Saturn) - Thirunallar
On the way to 
Peralam- Karaikkal. 5 Kms from karaikkal
Raghu - Thirunageswaram
About 7 Kms from 
Kumbakonam-Karaikkal Road
Kethu - Keezhaperumpallam
Near PoomPuhar
Mayiladuthurai- Poompuhar road

తమిళనాడు లో గల నవ గ్రహ టెంపుల్స్ వివరములు :

మీరు నవ గ్రహ టెంపుల్స్ ని చూసి .. కుంబకోణం లో ఉండండి . అక్కడ నుంచి మనం స్వామిమలై  కి వెళ్దాం . 
ఈ పోస్ట్ మీకు నచ్చితే . ఇతరులకి కూడా షేర్ చేయండి . 
ఓం నమః శివాయ

Comments

  1. Hi Raja Chandra, this information was really helpful. Thanks a lot. More to come from you. God bless you !

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. Book Your best Europe Tour with Stunning Croatia's best tour services...

    ReplyDelete

Post a Comment