Tuesday, June 3, 2014

Amarnadh Yatra Information


అమర్‌నాథ్‌ యాత్ర - Amarnadh Yatra


అమర్నాద్ యాత్ర విశేషాలు
అమర్నాద్  "అమరనాధుడంటే" రామరణములు లేని వాడు అని అర్ధం .  హిందువులకు ఇది ఒక ప్రసిద్ధ తీర్థయాత్రా క్షేత్రం మరియు అత్యంత ప్రమాదకరమైన యాత్ర కూడా . చుట్టూ మంచు ఎత్తైన కొండలు , ఎటుచూసినా మంచుతో కప్పబడి ఉన్న కోండలు , మంచు కరగడం చేత కొండలు స్నానం ఆడుతున్నాయ అనే భావం కలిగించేలా ఉండే సౌందర్య దృశ్యం . కరిగి వస్తున్నా మంచును తన వడిలోకి చేర్చుకుని వయ్యారంగా వంపులు తిరుగుతూ ప్రవహించే సింధు నది . ఆ నదిలోంచి వచ్చే శబ్దాలు పై నుంచి మనకు కనిపిస్తున్నా మానసికంగా మాత్రం ఆ సింధు నదిలోనే ఆడుతూ పడుతూ ఉంటాం .. ఎప్పటి నుంచి ఉన్నాయో పెద్దపేద్దా చెట్లు .. ఇక్కడ శివయ్య లేకపోతే నేను ఇంత సాహసం చేసి వచ్చేవాడిన ... ఇంత ప్రకృతి అందాలను చూడగలిగే వాణ్న అని పించక మానదు .
స్థల పురాణం
అమరనాధుడంటే జననమరణాలు లేని వాడు అని అర్ధం. ఒకనాడు పార్వతీ దేవి ఈశ్వరుడితో నాధా నాకు మీరు కంఠంలో వేసుకునే పుర్రెలమాల గురించి వినాలని ఉంది అని అడిగింది. ఈశ్వరుడు పార్వతీ ! నీవు జన్మించినప్పు డంతా నేను ఈ పుర్రెల మాలలో అదనంగా ఒక పుర్రెను చేర్చి ధరిస్తుంటాను అని బదులిచ్చాడు. పార్వతీ దేవి నాధా ! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. నీవు మాత్రం అలగే శాశ్వతుడిగా ఉంటున్నవు ఇది ఎలా సాధ్యం అని అడిగింది. ఈశ్వరుడు పార్వతీ ఇది పరమ రహస్యమైనది కనుక ప్రాణి కోటి లేని ప్రదేశంలో నీకు చెప్పలి అని చెప్పి ఎవరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతకి చివరకు ఈశ్వరుడు అమరనాధ్‌ గుహను ఎంచుకున్నాడు. పహల్‌ గాం వద్ద నందిని ఉండమని వదిలి పెట్టి, చందన్‌ వారి వద్ద చంద్రుడిని వదిలి వెళ్లాడు. షిషాంగ్‌ సరోవర తీరాన తన వద్ద ఉన్న పాములను వదిలి పెట్టాడు. మహాగుణ పర్వతం వద్ద తన కుమారుడైన గణేషుడిని వదిలాడు. తరువాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను వాటి స్థానాలలో వదిలి పార్వతీదేవితో అమర్‌నాథ్‌ గుహలోపలికి వెళ్లాడు. తరువాత కాలాగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రాణులను దూరంగా పంపాడు. ఇక తన అమరత్వ రహస్యం చెప్పడానికి ఉపక్రమించాడు.వంటిలో ఓపిక   ఉండగానే యాత్రలు చెయ్యాలి అనే మాట .. వయసు పైబడిన తరువాత అమర్నాద్ వచ్చే భక్తులకు గుర్తోచ్చి తీరుతుంది . వంటిలో ఓపికున్నప్పుడు అమరనాధుడు గుర్తుకు రావాలి .. ఆయన అనుగ్రహం కూడా ఉండాలిగా !

పర్వతాల పై మంచుపడి ఆ మంచుపై సూర్యకిరణాలు పడటం చేత వచ్చే తెల్లటి కాంతి లోనే శివయ్య దర్శనం ఇస్తూ ఉంటాడు .


ఈ యాత్ర సహస యాత్ర ని చెప్పడానికి కారణం . సరైన రావణ సౌకర్యం లేకపోవడం . నిజానికి ఈ అమర్నాద్ యాత్ర జూలై లో ప్రారంభమై - ఆగష్టు లో ముగుస్తుంది . 45 రోజులు మాత్రమే అమర్నాద్ యాత్ర ఉంటుంది . ఆ తరువాత ఈ ప్రాంతం మంచుతూ కప్పబడిపోతుంది . తిరిగి జులై లోనే ప్రారంభం అవుతుంది . ఈ ప్రాంతం లో ఎవరు నివసించారు . ప్రయాణం అంత ఇరుకు రోడ్లపై నే సాగుతుంది . ఫొటోస్ చూస్తున్నారుగా .. !! 


 ఏ మాత్రం కాస్త అజాగ్రత్త ఉన్న అంతే సంగతులు .. ఇక్కడ గుర్రాలు తప్ప మరే ఇతర వాహనాలు ఉండవు . మీరు హెలికాప్టర్ పై వచ్చిన సరే 6 కిలోమీటర్లు ముందే హెలికాప్టర్ ఆపివేస్తారు . అక్కడ నుంచి గుర్రాలకు వేరేగా డబ్బులు ఇచ్చి ప్రయాణం కొనసాగించాలి .గుర్రాలపై ప్రయాణం అంత సులువు కాదు . మనం ఎక్కినా 5 - 10 నిమిషాల్లోనే  ఒళ్ళంతా కదిలిపోవడం చేత ఇంకా ఎంత దూరం అని అడగకుండా ఉండలేము . చుట్టూ కొండలు ఎత్తైన ప్రదేశం లో మనం .. ఎంత లోతుందో తేలియని లోయలు .. వేగంగా ప్రవహిస్తూన్న సింధు నది . గుర్రం అటు ఇటు కదలడం కాస్త అటు పక్కకి ఇటు ప్రక్కకి కదులుతూంటే .. శివ శివా అని మనకు తెలియకుండానే శివనామస్మరణ చేస్తాం .  


అర్ధం అయింది . ఎలా వేళ్ళలో చెప్పకుండా గుర్రం ఎక్కించి బయపెడుతున్నాడు ఏమిటి .. అనేగా ? .. సరే

అమర్నాద్ గుహ శ్రీనగర్ ( జమ్మూ మరియు కాశ్మీర్  ) కు 141 కిలోమీటర్ల దూరంలో 3,888 m (12,756 ft) ఎత్తులో ఉంది .
JAMMU - PAHALGAM - HOLY CAVE
 జమ్ము నుండి పహల్ గాం చేరి అమరనాథ్ చేరే మార్గం ఒకటి , పహల్ గాం నుంచి గుహ కు చేరే లోపు మనం
Chandanwari - Pissu Top - Sheshnag - Panchtarni 
 కూడా చూస్తూ వెళ్తాం . 
జమ్ము నుండి పహల్ గాం చేరి అమరనాథ్ చేరే మార్గం ఒకటి. జమ్ము నుండి 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం చేరడానికి టాక్సీ లేక బస్సులలో చేరుకోవచ్చు. ఈ ఏర్పాటు కొరకు రఘునాధన్ వీధిలో ఉన్న " టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ , జమ్ము & కాశ్మీర్ ' వద్దకు వెళ్ళాలి. ఈ ఏర్పాటు చేసుకోవడానికి తెల్లవారు చాలా ఉదయాన మాత్రమే వెళ్ళాలి.

*  శ్రీ నగరుకు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం ఆకాశాన్ని అంటే కొండ చరియలు నదులు ఉపనదులు ప్రవహిస్తున్న సుందర ప్రదేశం. ఇక్కడ యాత్రికులు బసచేయడానికి వసతి గృహాలు లభ్యం ఔతాయి. పహల్ గాం కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాత్రికుల శిరంలో ప్రభుత్వేతర సంస్థలు యాత్రికులకు ఉచిత భోజన సదుపాయం కలిగిస్తుంటాయి.

* చంద్రవారి ఇది పహల్ గాం  నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. పహల్ గాం నుండి చంద్రవారి వరకు మిని బస్సులు లభ్యం ఔతాయి. లిడ్డర్ నతీ తీరం వెంట ఈ బసు మార్గసం ఉంటుంది కనుక ఈ మార్గంలో పయనించే సమయంలో అతి సుందరమైన ప్రదేశాలాను చూసే అవకాశం లభిస్తుంది. దారి వెంట అక్కడక్కడా యాత్రికుల కొరకు ఆహారశాలలు ఉంటాయి.


శేషాంగ్ ఏడుపర్వతశిఖరాలు కలిగిన పర్వత ప్రాంతం. ఈ ఏడు శిఖరాలు ఆదిశేషుడి ఏడు పడగలకు గుర్తుగా భావించబడుతుంది. ఇది అమరనాధ్ యాత్రలో రెండవ రోజు మజిలీ. శేషాంగ్ గురించి ప్రేమ మరియు పగతోకూడిన పురాణ కధనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చలి మంటలు రగిలిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నహిమాలయాల ప్రశాంత వాతావరణం మనసుకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక్కడ ఘనీభవించిన మంచు మధ్య ఉన్న శేషాంగ్  సరసులో ఒక సారి స్నానం ఆచరించినట్లైతే జీవితానికి సరికొత్త అర్ధం స్పురించిన అనుభూతి స్పురిస్తుంది.

శేషాంగ్ నుండి యాత్రీకులు మహాగుణా మార్గంలో పయనించి సముద్రమట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న "పాంచ్ తర్ణి " చేరుకుంటారు. 


సముద్రమట్టానికి 12,000 ఎత్తులో ఉన్న ఇక్కడి లోయలలో పచ్చిక మైదానాలు ఉన్నాయి. యాత్రీకులకు ఇక్కడ ఉన్ని వస్త్రాలు ధరించడం తప్పని సరి. ఇక్కడ కొందరు యత్రీకులు ఆక్సిజన్ కొరతతో బాధపడుతుంటారు. కొంత మంది వాంతి వచ్చే అనుభూతికి లోను ఔతారు. ఎండు ఫలాలు, వగరు తీపి పదార్ధాలు వంటి వాటిని తిని ఈ సమస్యలను అధిగమించాలి. ఏది ఏమైనా సమీపంలో ఉన్న వైద్యుని సంప్రదించడం ఉత్తమం. మహాగుణ మార్గంలో అనేక ఉపనదులు, జలపాతాలు, సెలయేళ్ళు పుష్పించిన మొక్కలు ఉండడం కారణంగా ఈ మార్గంలో పయనించడం మనోహరంగా ఉంటుంది. భైరవపర్వత పాదంలో ఉన్న పాంచ్ తర్ణి వద్ద పరమ శివుడి తల మీద నుండి ప్రవహిస్తున్న ఐదు నదులు ప్రవహిస్తుంటాయి. యాత్రీకులు పాంచ్ తర్ణి వద్ద మూడవరోజు మజిలీ చేస్తారు.పంచ్ తర్ణి నుండి అమరనాథ్ గుహలు చేరుకునే మార్గంలో యాత్రీకులు అమరావతీ పంచ్ తర్ణి .
సంగమప్రాంతాన్ని చూడ వచ్చు. గుహాలయంలో ప్రవేశించే ముందు కొంతస్మంది యాత్రీకులు అమరావతీ నదిలో స్నానం చేస్తారు. యాత్రీకులు పరమశుడిని, పార్వతిని, గణేషుడిని దర్శించుకుని సాయంత్రానికి పంచ్ తర్ణి చేరుకోవచ్చు.

* యాత్రీకులు జమ్ము నుండి రహదారి మార్గంలో శ్రీనగర్ చేరుకుని అక్కడి నుండి సోనామార్గ్ ద్వారా "బాల్ తల్" చేరుకుని అక్కడ నుండి అమరనాధ్ చేరుకోవచ్చు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల కొండ మార్గం నిటారుగా ఉంటుంది కనుక శరీర దారుఢ్యం ఉన్న వారు మాత్రమే ఈ మార్గంలో పయనించగలరు. ఇక్కడి నుండి యాత్రీకుల ప్రయాణానికి పోనీస్ లేక డోలీ (పాలకీలు) లభిస్తాయి.. అమరనాథ్ చేరుకోవడానికి ఇది చాలా దగ్గరి మార్గం కనుక "బాలా తల్ " అమరనాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.
ప్రయాణం సాగుతున్నంతా సేపు .. కొండల్లోంచి వచ్చే చల్లటి గాలి .. ఉన్నట్టు ఉండి మన గుర్రం పడిపోతుందేమో అనే భయం .. కొండల అంచుల్లో ప్రయాణం .. చుట్టూ చూస్తే అబ్బ ఎంత బాగుంది .. ఆహ చాలు ఈ జన్మకి నేను చూడగలిగాను చూస్తున్నాను అనే ఆనందం .. క్రింద చూస్తే ఎంత లోతుందో తేలియదు .. పడితేనా ! అసలు క్రిందకి చూడాలంటేనే బయం వేస్తుంటే ..చుట్టూ ఎతె్తైన కొండలు.. కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు.. పైకి వెళు్తన్న కొద్దీ ఆక్సీజన్‌ అందనంత ప్రమాదకరమైన వాతావరణం. మైనస్‌ డీగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి.. ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా అంతే సంగతులు.. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళు్తంది.. ఒకే ఒక్క మంత్రం అంతటి దుర్భర వాతావరణాన్ని సైతం సానుకూలంగా మారుస్తుంది.. అదే పంచాక్షరి.... ఒకటే మంత్రం .. ఒకడే దిక్కు .. ఆ శివయ్యే .. నీమీదే భారం వేసి .. నీ దర్శనం కోసమే వస్తున్నమయ్యా అనుకుంటూ ముందుకి కదలడమే .. ప్రకృతిని ఆస్వాదిస్తూ .. భయాన్ని జయిస్తూ.. .. * జమ్ము - పహల్ గాం- అమరనథ్ :- జమ్ము - చందన్ వాలి- పిస్సుటాప్- సేషాంగ్- పాంచ్ పర్ణి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* జమ్ము -బాల్ తళ్ :- జమ్ము- బాల్ తల్- దొమలి- బరరి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* హెలికాఫ్టర్ బుక్ చేసి అమర్నాథ్ చేరుకో వచ్చు.
* వాయు మార్గంలో చంఢీగఢ్ నుండి జమ్ముకాశ్మీరు వరకు విమాన సర్వీసులు ఉన్నాయి.
* జమ్ము-కాశ్మీర్ శీతల రాజధాని అయిన జమ్ము భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసంచానించబడి ఉంటుంది కనుక రైలు మార్గంలో జమ్ముకు చేరుకుని అక్కడి నుండి అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.
* రహదారి మార్గంలో జమ్ము - కాశ్మిర్ చక్కగా భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసందానించబడి ఉంటుంది కనుక బస్సులు, మరియు కార్లలో ఇక్కడకు చేరుకుని అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.


ఉపయుక్తమైన విషయాలు 

* చందన్ వాలి, శేషాంగ్,  పాంచ్ తర్ణి లలో హ్రభుత్వం చేత నడుపబడుతున్న డిపారాట్ మెంటల్ స్టోర్స్ లలో కావలసిన వంటకు కావలసిన సామాను లభ్యం ఔతుంది. అలాగే కట్టెలు గ్యాస్ కేనులు కూడా ఈ ఊరిలో దుకాణాలలో లభ్యం ఔతాయి. మార్గమధ్యంలో అనేక టీ స్టాల్స్ మరియు హోటల్స్ ఉన్నాయి కనుక అక్కడ టీ, కాఫీలతో పాటు అల్పాహారం వంటివి లభిస్తాయి. అయినప్పటికీ యాత్రీకులు తమ వెంట అత్యవసర సమయాలలో ఉపశమనం పొందడానికి తమతో టిన్ ఫొడ్స్, టాఫీలు, బిస్ కట్స్ తీసుకు వెళ్ళడం మంచిది. 


* యాత్రీకులు "శ్రి ఆమర్నాథ్ జి ష్రైన్ భోర్ద్ ఫర్ ది యాత్ర " వద్ద నమోదు పత్రం తీసుకున్నట్లతే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్ లక్ష రూపాయలు నగదు లభిస్తుంది. 


* యాత్రా సమయంలో మార్గమధ్యంలో ఏకాంతమైన గుడిసెలు, గుడారాలు యాత్రీకులకు అద్దేకు లభిస్తాయి.
* యాత్రీకులు ఒక మాసానికి ముందు తమ పేరును నమోదు చేసుకున్నట్లైతే యాత్ర సులువుగా సౌకర్యంగా చేయడానికి వీలు ఔతుంది.

యాత్రీకులు చేయవలసినవి * యాత్రను నమోదు చేసుకునే సమయంలో వైద్యపరిశీలన నిర్వహించి సముద్రమట్ట్శానికి  14,000 అడుగుల ఎత్తులో కొండచెరియలను ఎక్కేసమయంలో శరీరం తట్టుకోగలదా శోధిస్తారు. వైద్యుల ద్రువీకరణ పత్రాలను యాత్రీకులు వెంట తీసుకుని వెళ్ళాలి. అలాగే రోజుకు 4-5 కిలోమీటర్లు నడక వ్యాయామం మరియు ప్రాణాయామం వంటి వ్యాయామం కనీసం ఒక మాసానాకి ముందు ఆరంభించి శరీరాన్ని యాత్రకు సిద్ధం చేసుకోవాలి.

* యాత్రీకులు "ఎస్ ఏ ఏ బి" వద్ద నమోదు చేసుకోవడం తప్పనిసరి.

* ఎత్తైన పర్వతసానువులలో చలిగాలుల మధ్య ప్రయాణం చేయాలి కనుక యాత్రీకులు ఉన్ని దుస్తులు, చిన్న గొడుగు, విండ్ చీటర్, రైన్ కోటు, స్లీపింగ్ బ్యాగ్, వాటర్ ప్రూఫ్ షూలు, టార్చి, చేతి కర్ర, మంకీ క్యాప్, గ్లోవ్స్, జాకెట్, ఉలెన్ సాక్స్ మరియు ట్రౌజర్లు తమ వెంట తీసుకు వెళ్ళాలి.

* స్త్రీలకు చీరెలు యాత్రకు అనుకూలం కావు కనుక చుడిదార్, ప్యాంట్ షర్ట్ లేక ట్రాక్ సూట్ తీసుకు వెళ్ళడం మంచిది. 

* కఠినమైన కొండ మార్గం మీద జాగ్రత్తతో నడక సాగించాలి.

* పోనీ వాలా, కూలీలు, దండివాలాలు నమోదు చేసుకున్న వారా అని జాగ్రత్తగా పరిశీలించండి. నమోదు చేసుకున్న వారు బాల్ తల్, పాంచ్ తర్ణి, పహల్ గాం వద్ద లభిస్తారు.

* పోనీ వాలాలు, కూలీలు మీ వెంట వస్తున్నారా అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వారు మీ నుండి తప్పి పోయినట్లైతే అత్యవసరమైన సమయాలలో మీకు కావలసిన వస్తువులు మీకు లభ్యం కావడం కష్టం కనుక సమస్యకు ఎదుర్కోవలసి ఉంటుంది కనుక జాగ్రత్త వహించండి.

* యాత్రీకులు బాల్ తల్ , పహల్ గాం నుండి బయలుదేరే సమయంలో మీ దుస్తులు మరియు ఆహారపదార్ధాలను వాటర్ ప్రూఫ్ బ్యాగులలో బధ్రపచి అవి తడిసి పోకుండా కాపాడుకోండి. 

* యాత్రీకులు తమకు కావలసిన సామానులు వసతి గృహాలకు అవసరమిన ధనాన్ని దగ్గర ఉంచుకోవాలి.

* మీ గురించిన సకల వివరాలను వ్రాసుకున్న ఐడెండిటీ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోడి. అయవసర సమయాలలో అది ఉపకరిస్తుంది. 

* మీరు రోజూ తీసుకోవలసిన మందులను సాదారణ కావలసిన మందులను వెంట తీసుకు వెళ్ళండి.

* ప్రయ్ణం చేసే సమయంలో వేగించిన పప్పులు, టాఫీలు, చాక్ లెట్స్ మొదలైనవి మీ వెంట మోసుకు వెళ్ళండి.

* కోల్డ్ క్రీం, మరియు వ్యాజ్ లిన్, స్పష్టంగా చూడడానికి కావలసిన కళ్ళద్దాలు వెంట తీసుకు వెళ్ళండి. అవి తడి, పొడి వాతావరణంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ఉపకరిస్తుంది.

* కొండ ఎక్కుతూ మధ్యలో విశ్రాంతి తీసుకునే సమయంలో మీకు మీమీరే స్వతంత్రించి మీ శక్తికి మించి దూరంగా వెళ్ళ కండి.

* నిదానమైన స్థిరమైన నడకతో యాత్రను సాగించండి. వేగమైన నడక వలన త్వరగా అలసి పోతారు. 

* మీ తోటి యాత్రీకులకు కావలసిన సాయం చేస్తూ ప్రశాంతంగా యాత్రను సాగించండి.

* నిర్వాహకుల సలహాలను శ్రద్ధగా పాటించండి. 

* నీరు, గాలి, వాయువు, భూమి, ఆకాశం ఈశ్వరుడి స్వరూపం కనుక పరిసరాలను కలుషితం చేయకుండా యాత్రను సాగించండి. ఫ్లాశ్టిక్ సామానులు పూర్తిగా నిషిద్ధమని గ్రహించండి.

* మలమూత్ర విసర్జనకు " శ్రీఅమర్నాథ్ ష్రైన్ బోర్డ్ " ఏర్పాటు చేసిన బాత్ రూములను ఉపయోగించండి. బహిరంగప్రదేశాలలో చేయకండి. అమర్‌నాథ్‌ యాత్రని చేసి వచ్చినట్లైతే మృత్యువుని కాస్త దగ్గర నుంచి చూసి వచ్చినట్లే . శివుని పై భారం వేసి ఓం నమః శివాయ అంటూ వెళ్తున్నవార్కి యమపాసలు ఏమి చేయగలావ్ ? 


యాత్రీకులు చేయకూడనివి


* హెచ్చరిక ఫలకం మరియు హెచ్చరిక చిహ్నం ఉన్న ప్రదేశాలలో నిలబడకండి.

* సిగరెట్లు, మదూపానం చేయకండి. 

* నిటారుగా ఉండే కొండ చరియలలో నడవడానికి స్లిప్పర్స్ ఉపయోగించడం ప్రమాదకరం కనుక లేసులు కలిగిన షూలను వాడండి.

* పరిసరాలను కలుషితం చేసే సామానులు వాడకండి. 

* అమరనాథుని తాకకండి, ఆయన మీద పూజాద్రవ్యాలను విసరకండి, సాంబ్రాణి కడ్డీలను వెలిగించకండి.

* కూలీలకు, పోనీలకు, దండీలకు, వంటసామానులకు, కట్టెలకు, వసతిగృహాలకు నిర్ణయించిన దానికంటే అధికం చెల్లించకండి. 

* నిర్ణయించిన రుసుము కంటే అధికమైన ధనం హెలికాఫ్టర్లకు చెల్లించకండి. 
* రాత్రి వేళలో గుహాలయంలో ఉండకండి. అలా చేస్తే అక్సిజన్ కొరత వలన ఆరోగ్య సమస్యలు తలెత్త వచ్చు.


వేరోక కథనం
పురాతన ఇతిహాసాలలో మరొక కధ కూడా ప్రచారంలో ఉంది. కాశ్మీరు లోయలలో ఉన్న పెద్దసరసును కశ్యప మహర్షి అనేక నదులుగా ఉపనదులుగా ప్రవహిపజేశాడు. ఆ రోజులలో అక్కడకు వచ్చిన భృగుమహర్షి మొదటిసారిగా ఈ గుహను దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అతడి నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్తు శివుడు నివసిస్తున్న ఈ గుహాలయం ప్రజల యాత్రాకేంద్రంగా మారింది. ప్రస్తుతకాలంలో ఈ గుహను ప్రజలు తెలుసుకోవడానికి కారణమైన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. బూటా మాలిక్‌ అనే గొర్రెల కాపరికి ఒక రోజు ఒక సన్యాసి ఒక సంచి నిండా బొగ్గులను ఇచ్చాడు. బూటా మాలిక్‌ వాటిని తీసుకుని ఇంటికి వచ్చి చూడగా సన్యాసి ఇచ్చిన బొగ్గులు బంగారు నాణేలుగా మారాయి. బూటా మాలిక్‌ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వెళ్లి చూసే సమయానికి అతడికి అక్కడ సన్యాసి కనిపించ లేదు కాని అక్కడ ఒక మంచు లింగం కనిపించింది. ఇలా ఈ గుహాలయం తిరిగి కనిపెట్టబడి మంచు లింగం ఆకారంలో ఉన్న పరమశివుడు పురాణ కాలం తరువాత ప్రస్తుతకాలంలో ప్రజలకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తున్నాడు.

 

Application form for Registration 
 http://www.shriamarnathjishrine.com/Yatra%202014/Yatra%202014%20Misc%20Docs/Application%20form%20For%20Registration.pdf
source :
http://www.shriamarnathjishrine.com/
http://sujathathummapudi.blogspot.in/2012/05/blog-post_30.html
http://kovela.blogspot.in/2010/07/blog-post_14.html
http://www.bhumika.org/archives/1918


Monday, June 2, 2014

Kamakhya Temple Information

కామాఖ్యదేవి  శక్తిపీఠం- అస్సాం
- Kamakhya Temple

మీకు తెలుసా..?
“కామాఖ్యదేవి” శక్తిపీఠం ఎక్కడ వుందో..? ఆ దేవి “నిజరూపం” ఎలా వుంటుందో ..?  
ఇదిగో..!! ఇక్కడ .. చదివి .. చూడండి ..!!
ముందుగా – నా మాట !!


 నేను, ఈ “కామాఖ్యాదేవీ” శక్తిపీఠ వర్ణనను “అతి పవిత్రంగా”, “స్వచ్చమైన మనస్సు”తో, “త్రికరణ శుధ్ధి”గా, ఆ “తల్లి” పై గల “మాతృభావం”తో,సాద్యమైనంత వరకు “అసభ్యపదజాలం” లేకుండా రాయటం జరిగింది.ఈ “పీఠవర్ణన” నా అతి తక్కువ “భావ”పటిమకు, “భాష పరిజ్ణానం”కు మించినది. నా శక్తికి మించిన దైనా కూడా,దీనిని “3 రోజుల్లో” సవివిరంగా మీ ముందుంచటానికి నేను చాలా సాహసమే చేశాను. దయచేసి “స్త్రీ మూర్తు”లైన తల్లులందరు,నన్ను తమ బిడ్డగా భావించి, నా “భావ దోషాలను” పెద్ద మనసుతో “క్షమించగల”రని భావిస్తున్నాను..! 


ఇక చదవండి.. !! చూడండి.. !!
శ్రీ “కామాఖ్యదేవి” శక్తిపీఠం భారతదేశంలో,“అసోమ్” (అస్సాం) రాష్ట్రంలో “గువాహతి” (గౌహతి) నగర పశ్చిమ భాగంలో, “నీలాచల”(కామగిరి) కొండలలో నెలకొని వున్నది. ఇది “పది మహావిద్య”ల (కాళి,తార,కామాఖ్య,భువనేశ్వరీ,భైరవి,
చిన్నమస్త,ధూమావతి,భగలాముఖి,మాతంగి,కమల) “తాంత్రిక” దేవాలయాల సముదాయం.!! అయితే వాటిలో “త్రిపురసుందరి, మాతంగి, కమలా” దేవతలు ప్రధాన ఆలయం లోపల, మిగిలిన దేవతలు “ఏడు” దేవాలయాలలో వుంటారు. 

ప్రాచీన సంస్కృత గ్రంధమైన “కాళికా పురాణం”లో ఈ కామాఖ్యదేవిని శివుని “చిన్నభార్య”గా,ముక్తిప్రదాయిని గా మరియు “సకల మనోభీష్టదాయని”గా వర్ణించబడింది.ఈ పురాణం ప్రకారం,”సతీదేవి”ఈ ప్రదేశాన్ని, శివుని కోసం తన “ప్రణయతృప్తి రహస్యస్థలంగా” ఉపయోగించినట్లు పేర్కొనబడినది మరియు శివుడు సతీదేవి శవంతో తాండవ నృత్యం చేసినపుడు, ఈ ప్రదేశం లోనే ఆమె “యోని” పడినట్లు కూడా చెపుతారు.  

 అయితే ఈ‌ రెండు పరస్పర విరుధ్ధ అభిప్రాయాలను,“దేవిభాగవతం లోని “108 శక్తి పీఠ” ప్రదేశాల “జాబితా” ధృవ పరచటం లేదు. 


దక్ష యజ్ణానంతరం, శోకతప్తుడైన శివుని చూసి విష్ణువు, ఆయన శోకం పోగొట్టటానికి తన“సుదర్శనచక్రం”తో సతిదేవి “మానవ శరీరం”ని విచ్ఛేదనం చేసినప్పుడు, సతీదేవి“రహస్యాంగమ్”(Private Part) “రెండు” ప్రదేశాలలో పడిందని, “మొదటి” భాగం -“బాహ్యజననాంగాలు” (Outer Parts) అస్సాం రాష్ట్రంలోని “గువా”హాతి (గౌహతి) లో“కామాఖ్యదేవి ఆలయం”వద్ద,“రెండో”భాగం -” గర్భాశయం”(Inner Parts)నేపాల్ దేశంలోని కాట్మాండ్ పట్టణంలో “భాగమతి”నది వడ్డున శ్రీ “పశుపతినాథ్ దేవాలయ” ప్రదేశ ప్రాంతంలో పడిందని ఇతిహాస కధనం..!  ఈ కామాఖ్యాదేవి దేవాలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. ప్రస్తుత దేవాలయం క్రీ.శ. 1564-63 సమయంలో “కోచ్ వంశపు” గొప్ప యోధుడు “Chilarai” ద్వారా 1565 లో నిర్మించబడింది. అసలు “కామాపుర” ఆలయం “రెండవ సహస్రాబ్ది” మధ్యలో ధ్వంసమైంది.


అసలు“కామాపుర”(కామాఖ్య)దేవాలయం పదహారవ శతాబ్ద ప్రారంభంలో“Moslem దండయాత్ర”లో ధ్వంసం చేయబడింది.ప్రస్తుత ఆలయం “కూచ్ బీహార్ రాజు నరనారాయణ” చేత 1565 లో పునర్నిర్మించబడింది.ఈ‌ ఆలయంలో ప్రార్థనా కార్యక్రమాల (స్థానిక అర్చకత్వం) కోసం,కోచ్ రాజు “గారోస్ జాతి” పూజారులను విదేశాల నుండి రప్పించినట్లు తెలుస్తున్నది.మొదట్లో ఈపూజారులు కామాఖ్యాదేవికి “పందుల”ను బలి ఇచ్చే సంప్రదాయంగా వుండేది.


ఐదవ శతాబ్దానికి ముందు”నరకుడు” అనే ఒక సాహసికుడు“మిథిలా”నగరం నుండి పురాతన అస్సాంలో తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు.అతడు,తనని ఈ ”యోని-దేవత” సంరక్షకుడుగా ప్రకటించుకున్నాడు. బహుశా ఈ పరిణామ క్రమంలోనే,తన సామ్రాజ్య “ఫ్రాక్-జ్యోతిషాపుర” పేరును “కామాపుర”గా మార్పుచేసి వుండవచ్చని చరిత్రకారుల భావన.  


“నరకుడు”జయించిన ఈ ప్రాంతవాసులు “కిరాతక” జాతికి చెందిన ప్రజలు.వారు బహుదేహదారుఢ్యులు, అజ్ఞానులు మరియు బొడి తలలతో,” బంగారువర్ణ” చర్మం కలిగి వుండేవారు.వారికి “మద్య,మాంసాలు” ఆహారపు అలవాట్లుగా వుండేవి.బహుశా ఈ “కామాపురా”దేవి వారికి గాని లేదా వారిలోని కొన్ని“ఉప తెగ”జాతులకు చెందిన “కులదేవత” అయి ఉండవచ్చు.
 

ఈ “కామఖ్యాదేవి” ఆలయం మూడు పెద్ద మండపాలను కలిగిన ఒక సముదాయం.దీని“పశ్చిమదిశ”మండపం “దీర్ఘ చతురస్రాకారం”కలిగి వుంటుంది. దీనిని సాధారణ భక్తులెవరూ వారి ప్రార్ధనలకు ఉపయోగించరు. ఈ మండప గోడలపై, కూచ్ బీహార్ రాజు శ్రీ “నరనారాయణ” చెక్కిన చిత్రాలు, సంబంధిత శాసనాలు,ఇతర దేవతా చిత్రాలను కలిగి వుంటుంది.ఇక “మధ్య” మండపం “చతురస్రాకారం”లో, చిన్న దేవివిగ్రహం వున్న కూడలి.ఈ మధ్య మండపంలో నుండే “గుహ రూపం”లో వున్న కామాఖ్యాదేవి “గర్భగుడి” లోనికి దారివుంది.  ఈ సముదాయంలోని ఇతర ఆలయాల “గర్భగుడులు” కూడా ఇదేవిధంగా వుంటాయి. 


ఇక,అత్యంత పవిత్రమైన కామాఖ్యాదేవీ ఆలయ “గర్భగుడి” నేలమట్టమునకు దిగువుకు వుండి,సహజ నీటి(spring waters) ప్రవాహం” గల ఒక “గుహ”లో ఉంది.  ఇరుకైన ఈ గుహలో క్రిందికి నిటారుగా వున్నమెట్ల మార్గంతో ఒక “మర్మ(చీకటి)గది” ఉన్నది.ఈ గదిలో గల “శిలా(రాయి)భాగం” –రెండు “పిరుదులు”ను పోలి, సుమారు “10 అంగుళాల”లోతు చీలిక గలిగి,నిరంతరం “నీటిప్రవాహ(యోనిద్రవ)”ధారతో, “స్త్రీ జననాంగ( మంత్ర యోని)” ఆకారంలో,“పట్టు”వస్త్రం,“పుష్పాల”తో అలంకరింపబడి శ్రీ “కామాఖ్యాదేవి”గా మనకు దర్శనమిస్తుంది. 

ఈ కామాఖ్య దేవతకు జరిగే అతి ముఖ్యమైన పండుగ పేరు “అంబువాసి (అమితే) (సంతానోత్పత్తి)పండుగ”.ఇది మూడు రోజుల పండుగ. ఇది మాత కామాఖ్య భక్తులకు గొప్ప“తాంత్రిక ఉత్సవం”. “దశ మహావిద్యా,కామాఖ్య సంప్రదాయం” ప్రకారం, ఈ రోజుల్లో దేవి “రుతుస్రావం”కు లోనవుతుంది.

 ఈ సమయంలో (జూలై నెల) గర్భగుడిలోని “సహజనీరు(ఋతు శ్రవం)” “ఎరుపురంగు”(ఐరన్ ఆక్సైడ్)ను పోలి వుంటుంది. ఈ సమయంలో ఆలయం “మూడు రోజులు” పాటు మూసివేయబడుతుంది. తర్వాత “నాల్గవ రోజు”న ఈ గొప్ప“అంబువాసి” పండుగ ప్రారంభమవుతుంది. ఈ మూడు రోజులూ దేవి “ఋతుక్రమ బాధ”లో వున్నట్లు భావించి, ఇక్కడి ప్రజలు ఎవరూ “పొలం” పనులు వేటినీ చెయ్యరు.
 
ఈ‌ పండుగే కాకుండా, ఆలయ పూజారులు ఈ ఆలయంలో రోజూ సాధారణ పూజా కార్యక్రమాలు,మరియు ఉత్సవాలు కూడా జరుపుతుంటారు. ఈ దేవికి “జంతుబలి” అతి సామాన్యమైన విషయం. కానీ అన్ని“ఆడ జంతువు”లకు మాత్రం మినహాయింపు ఇస్తారు.అలానే ప్రతి సంవత్సరం కూడా శ్రీ దుర్గాదేవి పూజను,“ సెప్టెంబర్ –అక్టోబర్ నెలలో “నవరాత్రులను” ఘనంగా జరుపుకుంటారు.
శుభం భూయాత్ !!

Daily Events

5:30 AM Snana of the Pithasthana.
6:00 AM Nitya puja.
8:00 AM Temple door open for devotees.
1:00 PM Temple door closed for cooked offerings to the goddess followed by distribution among the devotees.
2:30 PM Temple door reopens for the devotees.
5:30 PM Aarati of Goddess followed by closing of the temple door for the night.

How to Reach Kamakhya temple:

The Kamakhya temple is situated at the center of the city. Buses and cabs runs almost all the time right from the morning to the night. The kamakhya temple is about 20 km from the airport. It is about 6 km from the railway station. From the airport as well as from the railway station cars are easily available for rent. So, devotees can hire cars for a trip to kamakhya temple. There are two well maintained staircase from the bottom of the hill to the Kamakhya temple made up of stones is also there, which can also be used to climb to the Kamakhya temple. 


Address:
Kamakhya Temple 
Kamakhya Mandir Rd,
Kamakhya, Guwahati, Assam 781010

Phone:0361 273 4654

@ Phani Prasad Yellajosyula