Tiruvallur Temple Information

తిరువళ్ళూరు- శ్రీ వీర రాఘవుల స్వామి | Sri Veeraraghava Swami Temple- Tiruvallur

Tiruvallur Temple Information  :
తిరువళ్ళూరు, తమిళనాడు రాష్ట్రంలోగల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరువళ్ళూరు జిల్లాకు ప్రధాన పట్టణం. త్రిమూర్తులలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో...వివిధ పేర్లతో కొలువుతీరిన అత్యంత మహిమాన్వితమైన దివ్య క్షేత్రాలకు-‘దివ్యతిరుపతులు’,‘దివ్య దేశములు’ అని పేరు. మొత్తం 108 దివ్య తిరుపతులు వున్నాయి. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ‘తిరువళ్ళూరు- Tiruvallur’లో శ్రీ మహావిష్ణువు ‘శ్రీ వీర రాఘవస్వామి’ పేరుతో శయనరూపం నయన మనోహరంగా కొలువుతీరి పూజలందుకుంటున్నాడు.


ముందుగా తిరువళ్ళురు ఎక్కడ ఉందో చెప్తాను, చెన్నై నుంచి  అరక్కోణం వెళ్ళేదారిలో ఉంది . చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్  పక్కనే ఉన్న లోకల్ స్టేషన్ నుంచి తిరువళ్ళురు  కి డైరెక్ట్ గా వెళ్లి ట్రైన్స్ ఉన్నాయ్ లేదా అరక్కోణం వెళ్ళే ట్రైన్ ఎక్కినా మీరు తిరువళ్ళురు చేరుకోవచ్చు . సుమారు 1 .30 hrs సమయం పడుతుంది .  తిరువళ్ళురు రైల్వే స్టేషన్ లో దిగిన తరువాత కుడివైపు కు వెళ్ళాలి . రైల్వే స్టేషన్ నుంచి గుడికి సుమారు 4 కి.మీ. దూరం ఉంటుంది . గుడి దగ్గరకు వెళ్ళడానికి  బస్సు లు ,ఆటో లు ఉంటాయి . మీరు బస్సు లో కంటే ఆటో వెళ్ళడమే మంచిది మనిషికి 10 /- తీస్కుంటారు .

పూర్వం తిరువళ్ళూరుకు ‘వీక్షారణ్య క్షేత్రం’ అనే పేరు వుండేది. స్వామివారు పూర్వం ‘ఎవ్వళ్’ (ఎక్కడ) పవళించాలని అడుగగా ఇవ్వళ్ (ఇక్కడే) పవళించమని శాలిహోత్రముని చెప్పిన ప్రాంతం కనుక ఈ క్షేత్రానికి ‘ఇవ్వళ్‌ఊర్’ అనే పేరు ఏర్పడినట్టు కథనం. ‘ఇవ్వళ్‌ఊర్’ అనే పేరు ప్రజల వాడుకలో కాలక్రమంలో మార్పుచెంది ‘తిరువళ్ళూర్’ అయినట్టు చెప్పబడుతూ వుంది.
ఈ ఆలయం లోని అధిష్టాన దైవమైన వీరరాఘవ స్వామి ఈ లోకంలోని సకలజీవరాసులకు అలాగే సకల జీవరాశులకు రక్షణ కలిగించేవాడు. అతడి దివ్యమైన పాదాలు సకల జీవులకు తక్షణ రక్షణ కిలిగించడమే కాక అసక్త నుండి అనారోగ్యం నుండి కూడా ఉపశమనం కలిగిచి అరోగ్యవంతమైన జీవితాన్ని కానుకగా ఇస్తాయి. ఇక్కడ ఉన్న వైద్యవీర రాఘవస్వామి కుటుంబ సమస్యలకు పరిష్కారం, వివాహజీవితంలో చిక్కులు విడదీయడం, ఆస్తులు భూముల సమస్యలను పోగొట్టడం వంటివి కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అంతేకాక చాలాకాలంగా సంతాన లేమితో బాధ పడుతున్న దంపతులకు సంతాన భాగ్యాన్ని కలుగజేసాడ్ని విశ్వసిస్తున్నారు. ఇక్కడ శాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతాన వరాన్ని ఇచ్చాడని స్థల పురాణం చెప్తుంది. తమిళంలో తిరు అంటే పవిత్రమైన అని అర్ధం ఈ వుళ్ అంటే ఇవ్వడం అని అర్ధం. కనుక పవిత్రమైన దైవం సంతాన వరాన్ని ఇచ్చిన క్షేత్రం కనుక ఇది తిరువళ్ళూరు అయింది.





స్థలపురాణం అనుసరించి తై అమావాస్య అంటే సంక్రాంతి తరువాత వచ్చే అమ్మావాస్య రోజున మహర్షి తపసుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ముసలి వాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యపు పిండిని ఆహారంగా స్వీకరించి ఆయన నేసిన మూడు గజముల వస్త్రమును ధరించి ఆరోజు రాత్రి ఆయన గృహములో నివసించడానికి చోటు చూపమని అడిగాడు. ఆయన చూపిన గదిలో ఆ రాత్రికి విశ్రమించాడు. 

మరునాడు ఉదయం మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజా కార్యక్రమాలను చేసి ముసలి వాడి వద్దకు వచ్చి చూడగా అక్కడ శేషశైనంలో పవళించి లక్ష్మీ దేవితో నాభికమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణ విగ్రహం కనిపించింది. తరువాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మని మహర్షితో చెప్పగా ఆయన తన మోక్షం మాత్రమే కావాలని అయినా ఇక్కడకు వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య వీరరాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదలని తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలైన తొలగించి అరోగ్యాన్ని ఐశ్వైర్యాన్ని అందించాలని కోరుకున్నాడు. 


అమావాస్య రోజు మాత్రం ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది . శని -ఆదివారం కూడా ఆలయం ఆలయం భక్తులతో రద్దీ బాగానే ఉంటుంది  . దర్శనానికి 1 గంట  లోపే పడుతుంది . మిగత రోజులల్లో ఐతే మీరు అర్చనలు కూడా చేయించుకోవచ్చు .


ఈ ఆలయం లో లక్ష్మి దేవికి ప్రత్యేక సన్నిది కలదు . రాముల వార్కి , శ్రీ కృష్ణు నాకు కూడా ప్రత్యేక సన్నిది కలవు . ఆలయం లో శిల్పకళ ఆకట్టుకుంటుంది



 ఉప్పు మిరియాలు కలిపి ఇలా వేస్తున్నారు ..

శ్రీ వీరరాఘవస్వామి వారిని దర్శించి ఉప్పు, మిరియాలను సమర్పించడంవల్ల వివిధ వ్యాధులు ప్రధానంగా చర్మవ్యాధులు నయమవుతాయని చేపట్టిన పనులు విజయవంతమవుతాయని చెప్తారు.

ఇక్కడ ఉన్న కోనేరు చాల పెద్దది ..


మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి మరిచిపోకండి

11 Comments

  1. తిరువళ్ళూరు విశేషాలు బాగున్నాయండీ..
    నేను చూడాలనుకునే తీర్ధయాత్ర ఇది కూడా.
    నాకొక సందేహం ఇక్కడ ఉప్పు,మిరియాలు ఫోటో పెట్టారు కదా..
    అవి ఎందుకు వుపయోగిస్తారు అక్కడ???

    ReplyDelete
  2. ధన్యవాదాలండి రాజి గారు .. అక్కడ ఉప్పు మిరియాలు పోస్తూ నమస్కారం చేస్తున్నారు అండి .. మరీ ఎందుకు చేస్తున్నారో తెలియదు .. ఎవరైనా వివరస్తారేమో చూద్దాం.

    ReplyDelete
    Replies
    1. పులిపిర్లు పొవడానికి ఉప్పు మిరియలు వేయాలని చెప్తారు.

      Delete
    2. స్వామి వైద్యుడి రూపంలో అంతా తిరిగుతూ అందరికి స్వస్థత ఇస్తాడు. ఇలా తిరిగి తిరిగి అలసటతో శయనిస్తాడు. అతని కాళ్ళు నొప్పులు రాకుండా ఉప్పు మిరియాలతో అతని పాదాలను నొక్కి సేవ చెస్తారు. ఆయుర్వేదం ప్రకారం ఉప్పు మిరీయాలతో నొప్పులు తగ్గుతాయని ప్రతీతి, ఈ సేవ కొసమే అలా ఉప్పు మిరియాలు పాదాల దగ్గర వేసి సేవ చెసుకుంటారు. ఈయన మా ఇంటి దేవుడు కుడా.

      Delete
  3. http://pravasarajyam.com/1/devotional/2012/05/04/veera-raghav-temple-thiruvallur/

    ReplyDelete
  4. తిరువళ్ళూరు వీరరాఘవులు స్వామి ఆలయం గురించిన విషయాలు చక్కగా రాశారు. తెలుగు బ్లాగుల్లో ఈ గుడి గురించి మీరు రాయడం ఎంతో అభినందనీయం. కృతజ్ఞతలు.

    ReplyDelete
  5. Adirindoi Chandram!! Keep up the good work!

    ReplyDelete
  6. Sree Veera raghava swami varu, vruthi ritya vaidyulu. ayina thala bhagana, mandula sanchi pettukoni paadukuni untaru. ratri samayallo ayina sancharam chesi, mokkina vari kashatlu theerchi, arogyam prasadistahru. deenivalla ayinaki padalu noppi vasthayanta. dani kosam uppu miriyalatho kapatam pettevarata, ade reeti ivala ila marindi.

    ReplyDelete
  7. chala baagundhi

    nenu kashmir lo hindu punya kshetralyu chooddamanukuntunnanu
    dayachesi direct cheygalaru anywebsite or other information blog like

    ReplyDelete
Previous Post Next Post