Gudimallam Temple Information

ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉంది. ఇది క్రీస్తుపూర్వం 1వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు. 1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు.



గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత కలదు.ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము మరియు ముఖమండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భగృహములో ప్రతిష్టించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. 




లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యెక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప)ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం.  ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకుఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.



ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయట పడ్డాయి. చోళ,పల్లవ,గంగపల్లవ,రాయల కాలంలో నిత్యం ధూప,దీప,నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరికి గురయ్యాయి. ఆర్కియాలజీ వెబ్‌సైట్‌లో ఇంత ప్రముఖమైన శివలింగం గురించి కనీస సమాచారం లేదు. గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సాధించిన మార్పు ఏమీ లేదు.




గతంలో ఎపుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది. ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్‌ ఎట్‌ గుడిమల్లం’ ‘డెవలప్‌ మెంట్‌ ఆఫ్‌ ఎర్లీ శైవ ఆర్ట్‌ అండ్‌ అర్కిటెక్చర్‌ ‘ అనే రెండు పుస్తకాలు ,మరి కొన్ని శిల్ప,కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు. ఇపుడిపుడే ఈ ఆలయం మార్కెట్‌ దేముడి మాయలో పడబోతుంది. కోట్లరూపాయల హెరిటేజ్‌ ప్రాజెక్టులో ఇదీ భాగం అయింది. అంబికా సోనీ ఇటీవలే ఇక్కడ అంగపూజలు జరిపారు. ఒక ఎంపీ ఇక్కడ గెస్ట్‌హౌస్‌ కట్టే ప్లాన్‌లో ఉన్నారు.




క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. ఈ ఆలయమునకు సంబంధించిన మరికొంత సమాచారము చంద్రగిరి కోటలో గల మ్యూజియంలో లభ్యమవుతున్నది.



ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగినాణాలపై ఈ లింగమును పోలిన బొమ్మలు ఉన్నాయి. ఈ నాణాలు క్రీ.పూ. 3వ శతాబ్ధానికి చెందినవిగా గుర్తించబడ్డాయి.

Source : http://te.wikipedia.org/

11 Comments

  1. visit for more places : http://manatelugusamacharam.com/category/stories/

    ReplyDelete
  2. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

    సంభాషణ అంతరాయానికి మన్నించగలరు, మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

    సాయి రామ్ సేవక బృందం,
    తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
    సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
    * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

    ReplyDelete
  3. ఈ గుడి మల్లం ను నేను 2003 లొ తిరుపతి లో చదువుకుంటున్న రోజుల్లో దర్శించటం జరిగింది . ఇప్పటికీ తిరుపతి వెళితే ఇక్కడకు వెళ్ళకుండా ఉండము. చాలా తక్కువ మందికి ఈ గుడి చరిత్ర తెలుసు. నేను తరువాతా ఇంకా తెలుసుకోవతానికి ప్రయంత్నించినా మీరన్నట్లు ఈ గుడి చరిత్ర చాల తక్కువగా దొరుకుతుంది. ఒకప్పుడు దీనిని గుడి పల్లం అనేవారని, కాలనుక్రమం గా గుడి మల్లం అయిందనీ అంటారు
    మీకు తీరిక దొరికినప్పుడు అక్కడకు దగ్గరలోనే ఉన్న
    1. జీవకోన
    2. దుర్గ సముద్రం (సరస్వతి అమ్మవారు ప్రతిష్ఠించిన లింగం) గురించి కూడా వివరించగలరు.

    నిజంగా చాలా ఆందం గా ఉంది. ఆరుణాచలం గురించి, పిఠాపురం గురించి చదువుతున్నప్పుడు నిజంగా అక్కడే ఉన్న అనుభూతి కలిగింది. మీకు నా పాదాభివందనములు. నాకు గురు కటాక్షం ఉండబట్టే మీ సైటు ను దర్శించగలిగానని ముమ్మాటికీ నమ్ముతున్నాను.

    ReplyDelete
  4. One Day Tirupati Tour Package From Chennai in shadhanasricabs.We offer different Tirupati Packages.Book Tirupati holiday packages in shadhanasricabs .

    One Day Tirupati Tour Package From Chennai

    ReplyDelete
  5. Out of the many sacred places tirupathi is famous for, this is a hidden gem. A lot of people don't know about this place and this place remains hidden from the charts. This place should get more recognition from the government as well as the authorities in tirupathi. Travelguru Coupons

    ReplyDelete
  6. fantastic an significant. asmshodhana...
    this is akadevopaasanaa simbol...

    ReplyDelete
  7. మీ వలన మేము ఎంతో నేర్చుకుంటున్నాం గురువు గారు మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు అందిచాలని తమరిని వేడుకుంటున్నాను

    ReplyDelete
  8. Nice information. Thanks for sharing content and such nice information for me. I hope you will share some more content about. Please keep sharing!.
    best tour packages from Trichy

    ReplyDelete
  9. Get your ex love back by Pandit Vijay Varma top ex love back consulting services in New Jersey.
    Astrologer in New Jersey

    ReplyDelete
  10. The most popular Indian Astrologer Pandit Sairam Ji in California serves his followers across the globe.
    Astrologer in California

    ReplyDelete
Previous Post Next Post