Ghatika Siddeswaram Temple Information

ఘుటిక సిద్దేశ్వరం - Ghatika Siddeswaram - Nellore :



Ghatika Siddeswaram Temple Information :
శ్రీ ఘుటిక సిద్దేశ్వరం క్షేత్రం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరికి దగ్గరలో వుంది. సిద్ధులు తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి దీనికి సిద్దేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇప్పటికీ కొండపైన గుహల్లో కొంతమంది సాధువులు తపస్సు చేస్తుంటారని చెబుతారు.



చుట్టూ నల్లమల కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం... సెల్‌ సిగ్నల్స్‌ వుండవు... మోటారు కార్ల శబ్ధాలు వుండవు...
నెల్లూరుకు సుమారు 115 కిలోమీటర్ల దూరంలో, భైరవ కోన నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో వుంది ఈ క్షేత్రం. భైరవకోన దర్శించినవారు ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చు.  




నెల్లూరు నుండి ఉదయగిరి మీదుగా, సీతారంపురం మార్గంలో గల పోలంగారి పల్లె దగ్గర బస్సు ఆగుతుంది. అక్కడి నుండి సిద్దేశ్వరం చేరుకోవడానికి ఎటువంటి రవాణా సౌకర్యాలు వుండవు. సుమారు 15 కిలోమీటర్లు అడవి మార్గంలో మట్టిరోడ్డుపై మన స్వంత వాహనంలో వెళ్ళాలి. లేదా పోలంగారి పల్లె నుండి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి.
 

ఇక్కడి స్వామి శివుడు సిద్దేశ్వరునిగా, అమ్మవారు ఇష్టకామేశ్వరిగా కొలువై వున్నారు.
పూర్వం ఈ క్షేత్రంలో అగస్త్య మహర్షి తపస్సు చేసినట్లు చరిత్ర చెబుతుంది. అగస్ట్య మహర్షి తపస్సు చేసినట్లుగా ఇక్కడ మహర్షి కూర్చున్న ప్రదేశాన్ని శ్రీ అగస్త్య పీఠముగా పిలుస్తారు.


z

శిథిలావస్థలో వున్న ఈ క్షేత్రాన్ని ‘కాశీనాయన’ పునరుద్ధరించారు. అంతేకాకుండా శ్రీ కాశీనాయన ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాశీనాయన భక్తులు ఎంతో ఆప్యాయతతో మనల్ని పలకరిస్తారు.



ఘుటిక సిద్దేశ్వరం  దర్శించడానికి వచ్చిన చాలామంది సాయంత్రానికే తిరుగు ప్రయాణమౌతారు. ఘుటిక సిద్దేశ్వరం లో వుండాలనుకుంటే కాశీనాయన సత్రంలో బసచేయవచ్చు. మంచి గదులు గలవు. ఇంకొక విశేషమేమంటే కోనేరు ఎండిపోయి కన్పిస్తుంది...కానీ అదే కోనేరు నుంచి అన్నదానానికి, స్వామి వారి అన్ని సేవలకు నీళ్ళను ఆ కోనేరు నుండే తీసుకుంటారు.  


భక్తులు, పర్యాటక ప్రేమికులు అందరూ తప్పక దర్శించవలసిన ప్రదేశం ఈ ‘ఘుటిక సిద్దేశ్వరం’.
కార్తీక పౌర్ణమికి, శివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.  




శ్రీ ఘుటిక సిద్దేశ్వరం  స్వామి క్షేత్రంములో దర్శించవలసిన ప్రదేశాలు :
 


 ఇక్కడ శ్రీస్వామి వారి నిత్యాన్నదానం కోసం చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చే రైతులు తమ తమ పొలాల్లో చేతికి వచ్చే మొదటి పంటలో కొంత శ్రీ స్వామి వారికి అందజేయడం జరుగుతుంది. 


దానితోనే నిత్యాన్నదానం నిరాటంకంగా కొనసాగుతుంది. అరణ్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టిన భగవాన్‌ శ్రీ కాశీనాయన గారి పాదాలకు నమస్కరిస్తూ...
@ రవికిరణ్‌ దామర్ల

2 Comments

Previous Post Next Post