Kadiri Narasimha Swamy Temple Information

 శ్రీమత్ ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము,
కదిరి (పట్టణము), అనంతపురము జిల్లా
ఖాద్రీక్షేత్ర స్థలపురాణం
Kadiri Narasimha Swamy Temple Information  

* * * * * * * * * * * * * * * * * * * * 



కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుపతిలో వేంచేశియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము తర్వాత అతి ప్రాచినమైనదిగా శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం వాసికెక్కినది. హిరణ్యకశ్యపుని సంహరించిన అనంతరము ఉగ్రస్వరూపులైన శ్రీనరసింహస్వామి వారిని కదిరి పట్టణగల “స్తోత్రాద్రి” పర్వతము వద్ద ముక్కోటి దేవతలు, భక్తప్రహ్లాదుడు శాంతింపచెసిరి. అందువలననే ఈ క్షేత్రమున ప్రహ్లాద సమేత నృశింహస్వామి దేవాలయము వెలశినది. స్థలపురాణ ప్రకారం కదిరి పట్టణమునకు అపేరు వచుటకు అనేక గాధలు వున్నవి.




“ఖా” అనగా విష్ణు పాదమనియు “అద్రి” అనగా పర్వతము అనియు అర్థము ఈ ప్రాంతములో స్వామి వారు పాదము మోపినందున ఈ పట్టణమును “ఖాద్రీ” (కదిరి) అని పిలువబడుచున్నది. ఒరిస్సా రాష్ట్రములోని పూరీపట్టణ ములో వెలశియున్న కొయ్య జగన్నాధునివోలె ఈ క్షేత్రమున నరసింహస్వామి వారు చండ్రవృక్ష (ఖదిరి వృక్షము) కొమ్మపై చాలకాలము వెలశియుండినారని ప్రతీతి.




స్వామి వారు స్వప్నమున అదేశించిన విధముగ విజయనగర రాజైన వీరబుక్కరాయలు 1274-1275 సంవత్సరములలో ఖదిరి వృక్షము క్రింద పుట్టలో యున్న సాలగ్రామములును బయటకు తీసి ఈ దేవాలయములో ప్రతిష్ఠించినారు. ఈ సాలగ్రామములు కాలగతిలో అదృశ్యమైనందున 1545లో విజయనగర రాజు అయిన అచ్యుత దేవరాయలు శ్రీవారి స్వప్న అదేశముల మేరకు ప్రస్తుతము ఈ క్షేత్రమున అష్టబాహులతో హిరణ్యకశ్యపుని సంహరించు చందమున యున్నరాతివిగ్రహముగా విరాజిల్లుతున్న మూలవర్లను స్తోత్రాద్రి పర్వత గృహల నుండి (స్వామి వారి అదేశములమేరకు) తీసుకొని వచ్చి ఈ దేవాలయమున ప్రతిష్ఠించిరి. శ్రీనృశింహ స్వామి వారె శ్రీ భృగు మహర్షికి ఆర్చనార్ధం వసంతవల్లభుల విగ్రహములను ఒక పేటికలోయుంచి ప్రసాదించిన అవిగ్రహములను స్వామి వారి స్వప్న అదెశముల మేరకు భృగుతీర్ధము నుండి బయలుకు తీసిన వసంతవల్లభుల ఉత్సవ విగ్రహములను, స్వామి వారి ప్రస్తుత మూలవిరాట్టును అత్యంతవైభవముగా, రాజసం ఉట్టిపడురీతిన ఆడంబరముగా వసంతఋతువులో ఈ దేవాలయములో ప్రతిష్ఠించినందున ఉత్సవవిగ్రహములను వసంతవల్లభులుగా నామంతరము చెందినారు. ఈ పట్టణము ఖదిరి వృక్షములతో నిండిన కికారణ్యమైనందున అప్పటి పాళెగారు ఈ వృక్షములను శుభ్రంచేయించి ఇచ్చట ఈ దేవాలయమును నిర్మించినారని ప్రతీతి


బ్రహ్మండ పురాణములలో ఖాద్రిస్థలపురాణము ఎంతో విపులంగా చర్చింపబడియున్నది. కదిరి పరిసరప్రాంతములన్నియు పౌరాణిక గాధాలతో ముడిపడియున్నవి. వేదవ్యాస మహర్షి వారు తన శిష్యులు ఉనికిని రాక్షసులకు తెలియకుండా వారికి విద్యాబుద్దులు ఇచ్చట నేర్పించినందున ఇది కేదారణ్యమైనది. అర్జునుడు తపస్సు చేశిన మద్దిలేరు (అర్జున నది) ఈ ప్రాంతములో శ్వేతపుష్కరిణి, భృగుతీర్ధము, శేష తీర్ధము, కుంతితీర్థము, లక్ష్మీతీర్ధము, గంగాతీర్ధము, గరుడతీర్ధము, భావనాశిని తీర్ధములను తాకుతూ ప్రవహించుచూ ఈ నది విరాజిల్లుతున్నది.




ఈ దేవాలయములో మొదట పశ్చిమ చాళుక్యులు 985-1076సం|| మధ్య దుర్గాదేవి దేవాలయమును క్రిష్ణవర్ణ శిలలుపై అతి సుందరముగా చెక్కిన శిల్పములతో నిర్మింపగా విజయనగర రాజు వీరబుక్కరాయులు 1274-1275 మధ్యలో స్వప్నమున నృశింహస్వామివారు ఆదేశించిన విధంగా స్వామి వారి సాలగ్రములను ఖదిరి వృక్షం క్రిందయున్న పుట్టలో నుంచి బయటకు తీసి దుర్గాదేవి దేవాలయమునకు దక్షణమున అమ్మవారి దేవాలయము వోలె సుందరశిల్పములతో ఈ నృసింహక్షేత్రమును నిర్మించి, ఇందులో ప్రతిష్టించెను ద్వారాపాలకులు, గరుడర్యాములను, అనేకమండపములను నిర్మించెను. 1953లో దుర్గదేవి విగ్రహముకు బదులు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించడమైనది. దుర్గదేవి మూలవిగ్రహమును ఇప్పటికి అమ్మవారి దేవాలయములో చుడవచ్చును.


 
1391లో నరశింహదాసరి, లక్ష్మణదాసరి అనేభక్తులు చాల ఎతై న దీపపు రాతి స్థంభములును దేవాలయం లోపల బయట పెట్టినారు.1509లో శ్రీకృష్ణదేవరాయ మహారాజు సింహ ప్రతిమలతో యున్న మండపం (రంగమండపం)ను, ఆళ్వార్లు సన్నిదర్లును నిర్మించెను.


1545లో అచ్యుత దేవారాయ ప్రభువు తూర్పరాజ గోపురం, వినాయక, క్రిష్ణమందిరములు, రాఘవేంద్రబృందవనాలను నిర్మించినారు. 1569లో శ్రీ తిరుమలరాయల మండపాలు పుష్కరిణులను నిర్మించినారు. ఈ దేవాలయములో విజయనగర రాజుల శిలాశాసనములున్నవి. ఛత్రపతి శివాజి మహరాజు ఈ దేవాలయం వెలుపల మహిషాసుర మర్ధిని దేవాలయాన్ని 1642-1644 మధ్యలో నిర్మించారు.


ఈ పౌరాణిక ప్రాధ్యాన్యము మరియు పురాతత్వ విలువకల్గిన ఈ గొప్పదేవాలయములో ప్రతి అంగుళం ఎంతో ప్రాధన్యత పురాతన చరిత్ర కల్గియున్నది. దక్షణ భారతంలో కెల్లాఎక్కవ బరువుకల్గి, శృంగార చెక్కడములతోయున్న చెక్కరథం తేరుబజారులోయున్నది. దేవాలయము తూర్పు, దక్షణ పడమర రాజగోపురలను విజయనగర రాజులు, చిన్నమ్మ, కొక్కంటి పాలెదార్లు నిర్మించినారు. కదిరి గ్రామం ఒకప్పడు మైసురు రాజ్యములో యుండినదని తెలియుచున్నది.




శిలాశానముల ప్రకారం ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్య కాలములో అభివృద్ది పరుచబడినది. ఈ శాసనాల ప్రకారం బుక్కరాయలు ఈ దేవాలయమును 1274 లోనిర్మించినారునియు మరియొక శాసనం ప్రకారం శ్రీరంగం దేవాలయలయన్ని జీర్ణోద్దారణ చేశిన కెంపెన్న ఒడయరు వద్ద పనిచేసిన అధికారైన కొపన్న ఈ దేవాలయనికి బంగారు అభరణముల నొసిగినారు. 1451, 1529 సంవత్సరములలో తాడిపత్రి పాళెదారు వేయికాళ్ళ మండపమును మరియు కొఠాయి మండపములను నిర్మించినారు.


కదిరి మల్లెపూలకు మరియు కనకాంబరాలు (కుంకుమ పూలు)కు ప్రసిద్దిగాంచిది. కదిరి కుంకుమ అంధ్ర మరియు కర్ణాటక నందు విరివిగా అమ్మబడుతుంది. 
ఆలయ విశిష్టత
ads
ఎక్కడా లేని ఈ కదిరి నరసింహుని ఆలయ ప్రత్యేకత ఏమంటే.............. .ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామి ని కొలుస్తుంటారు. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడ వస్తుంటారు. ఇక్కడి ఇంకో విశేష మేమంటే, కదిరి పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలో మీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రి మాను ఉన్నది. ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి, 1100 ఊడలతో ఉన్నది. దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడ స్థానం సంపాదించు కున్నది. కదిరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కటారు పల్లె లో యోగి వేమన సమాధి కూడ వున్నది. ఇది కూడ పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
ఎక్కడున్నది ఈ క్షేత్రము ?
అనంతపురం జిల్లాలో ఉన్న కదిరి లోఈ ఆలయం ఉన్నది. ఇది పాకాల-- ధర్మవరం రైల్వే మార్గం లో ఉన్నది. కదిరి లో స్టేషన్ కూడ ఉన్నది. అదే విధంగా బస్సు సౌకర్యంకూడ బాగా ఉన్నది.
ads



link:  http://www.templeinformation.in/2014/08/kadiri-narasimha-swamy-temple.html

1 Comments

Previous Post Next Post