Meenakshi Amman Temple - Madurai

మధుర మీనాక్షి ఆలయం |Meenakshi Amman Temple Madurai, Tamil Nadu, India.  (Meenakshi Sundareswarar Temple or Tiru-aalavaai or Meenakshi Amman Kovil)

 Madurai Temple Information in telugu 

దేశవ్యాప్తంగా ఉన్న అతి పవిత్ర, పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రం లోని రెండో అతి పెద్ద నగరమైన మదురైలో వెలసి ఉంది. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్య రాజుల కాలం నుంచే పూజలందుకుంది. 


 

మీనాక్షి అమ్మవారు మదురైలో వెలిసిన వైనాన్ని చూస్తే.... తను ఇచ్చిన మాటకోసం భూలోకం చేరిన పార్వతి మదురై రాజుకు కుమార్తెగా జన్మించి మీనాక్షి నామధేయంతో పెరిగి పెద్దదైంది.

పరమశివుడు సుందరేశ్వర‌ునిగా భూలోకంలో జన్మించి మదురై వచ్చి మీనాక్షీ అమ్మవారిని వివాహమాడాడడని.. అనంతరం వీరు మదురై రాజ్యాన్ని చాలా ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించారని భక్తులు విశ్వసిస్తారు. ఆ తర్వాత ఇరువురు ఈ ఆలయంలోనే కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. 
మదురై రైల్వే స్టేషన్ ( Madurai Junction) 
------------------------------------------------------- 

ఫోటో చూడగానే అర్ధం అయిందా .. మదురై రైల్వే స్టేషన్ అని . మరో సారి చూడండి రైల్వే స్టేషన్ని అర్ధం అయింది కదా ఎందుకుచూడమన్నానో .. అవును రైల్వే స్టేషన్ పైన గోపురం ఉంది  . అసలే మదురై టెంపుల్ సిటీ కదా మనవాళ్ళు మనం అడుగుపెట్టగానే స్వాగతం పలుకుతున్నట్టు ఉంది .


మీరు ATM లకోసం వేతుకుతారని తెలిసే ఫోటో తీసి రెడీ గా ఉంచాను . రైల్వే స్టేషన్ పక్కనే ATM లు ఉన్నాయ్ .

 వీడు గుడికి తీస్కునివేల్తాడు అనుకుంటే సినిమా థియేటర్ చుపిస్తాన్నాడు ఏమిటి అనుకుంటున్నారా ? రైల్వే స్టేషన్ నుంచి ఎడమవైపుకి కొద్దిదూరం నడవగానే ఈ థియేటర్ కనిపిస్తుంది . అక్కడనుంచి స్ట్రైట్ గా వెళ్తే అమ్మవారి గుడి .

ఈ దారిలో వెళ్ళాలి .. అర్ధం అయింది అండి మీ డౌట్ .. భుజాన సామాన్లు ఉన్నాయ్ .. ఇంకా స్నానం చేయలేదు .. గుడిలోకి వెళ్ళడం ఎలా అనేకదా ? రూమ్స్ కోసం మీరు కంగారు పడనావర్సం లేదు . మీరు ఇక్కడికి రాగానే లుంగితో ఉన్న ఒకరిద్దరు ఈపాటికే మీదగ్గరు వచ్చి రూమ్స్ కావాలా అని అడుగుతారు . మీరు వాళ్లతో వెళ్ళితే మీరు నచ్చింది అనే చేప్పవరకు అన్ని హోటల్స్ తిప్పుతారు . వారు చూపించే హోటల్స్ కూడా బాగానే ఉంటాయ్ . మీకు  సౌకర్యవంతంగా ఉంటుంది అనుకుంటే ఒకే చెప్పండి . లేదు అంటే వేరే హోటల్ తిస్కునివేల్లమనండి . టెంపుల్ చుట్టుప్రక్కల చాల హోటల్స్ ఉన్నాయ్ .

మీరు నేను చెప్పినట్టుగానే నడిచివస్తే ఇదిగో అమ్మవారి వెస్ట్ గోపురం ఉన్నవైపుకి మీరు వస్తారు . ఎంత దూరం ఉంటుంది చెప్పనలేదు .. నడిచేమంటున్నాడు  అనుకుంటున్నారా ? రైల్వే స్టేషన్ నుంచి ఐతే 1/2 కిలో మిటారు  ఉంటుంది


అంతపెద్ద గోపురం చూస్తుంటే లోపకి వెళ్ళాలి అనే విషయాన్నే మర్చిపోతూ .. గోపురం వంక చూస్తూనే ఉంటాం . గోపురం పైన ఉన్న పార్వతిపరేమేశ్వరులకు అక్కడే మనం నమస్కరిస్తాం

WEST TOWER MEENAKSHI AMMAN TEMPLE  MADURAI

నాయక రాజులు చేసిన గొప్ప కార్యాల్లో మధురైలో మీనాక్షి దేవాలయ నిర్మాణం అత్యంత ముఖ్యమైంది. ఇప్పటివరకూ నిర్మించిన పెద్ద ఆలయాల్లో మీనాక్షి ఆలయం ఒకటి. దీన్ని 17వ శతాబ్దం మధ్యలో నిర్మించారు. ఈ నిర్మాణంలో రెండు ఆలయాలుంటాయి. సుందరమైన దేవుడిగా కొలిచే సుందరీశ్వరుని ఆలయం శివునికి, మీనాక్షిగా కొలిచే అమ్మవారి ఆలయాన్ని ఆయన భార్యయైన పార్వతికి అంకితమిచ్చారు. ఎనిమిది ప్రవేశ ద్వారాలతో ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీటిలో ఒక ద్వారం దాదాపు 200 మీటర్ల ఎత్తుంటుంది. ప్రతి ద్వారం మీదా ఉన్న కొన్ని వందల శిల్పాలు పర్యాటకులను ఎంతగానో పరవశింపజేస్తాయి. మీనాక్షి ఆలయ సముదాయంలో దాదాపు 33 మిలియన్ల శిల్పాలున్నట్టు ఆలయ అధికారుల అంచనా.


ఈ ఫోటో ఉదయాన్నే అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నప్పుడు తీసినది .. ఉదయాన్నే ఫ్రీ దర్శనం కోసం లైన్ లో వేచివున్నా  భక్తులను మీరు ఇక్కడ చూడవచ్చు . అమ్మవారి ఆలయం చాలాచాల పెద్దది . సరే అమ్మవారే దర్శనానికి వెళ్దాం రండి . ఇక్కడ మీకు ఒకవిషయం చెప్పాలి . అందరు స్పెషల్ దర్శనం టికెట్ తీస్కోండి . అమ్మవారి దర్శనం నానికి వేరుగా , స్వామి వారి దర్శనానికి  వేరుగా టికెట్స్ ఇస్తారు . స్వామి వారి దర్శనానికి గర్బగుడికి దగ్గరలోనే ఇస్తారు . ముందుగా అమ్మవారి దర్శనానికి టికెట్స్ తిస్కుండి . తిరుపతి గుడిలో అందర్నీ చివరికి ఒకే లైనే లోకి పంపించినట్టు ఉండదు ఇక్కడ . అంతదూరం నుంచి వచ్చిన మనకి దర్శనం బాగా జరగాలి కదా అందుకే .
WAY TO MEENAKSHI AMMAN SHRINEఅమ్మవారి ఆలయం చాలాచాల పెద్దది . సరే అమ్మవారే దర్శనానికి వెళ్దాం రండి . ఇక్కడ మీకు ఒకవిషయం చెప్పాలి . అందరు స్పెషల్ దర్శనం టికెట్ తీస్కోండి . అమ్మవారి దర్శనం నానికి వేరుగా , స్వామి వారి దర్శనానికి  వేరుగా టికెట్స్ ఇస్తారు . స్వామి వారి దర్శనానికి గర్బగుడికి దగ్గరలోనే ఇస్తారు . ముందుగా అమ్మవారి దర్శనానికి టికెట్స్ తిస్కుండి . తిరుపతి గుడిలో అందర్నీ చివరికి ఒకే లైనే లోకి పంపించినట్టు ఉండదు ఇక్కడ . అంతదూరం నుంచి వచ్చిన మనకి దర్శనం బాగా జరగాలి కదా అందుకే .
WAY TO MADURA MEENAKSHI AMMAN SANNIDHI

మదురై అమ్మవారి ఆలయం లో ముందుగా మీనాక్షి దర్శనం చేస్కుని , తరువాతనే సుందరేశ్వర స్వామిని సేవించడం సంప్రదాయం, అందుచేత  తూర్పు విధి నున్న అష్టశక్తి మండపం ద్వారాన్నే గుళ్ళో ప్రవేశించాలి . అష్టశక్తి మండపం ఏమిటి అనుకుంటున్నారా ? మీరు ఇప్పుడు ఉన్నది అష్టశక్తి మండపం లోనే .. ఒకసారి పైన చూడండి సరిగానే కనిపించడం లేదా అలా అంటారనే మరో ఫోటో క్రిందకుడా పెట్టాను .. ఈ మండపం పైన అష్టశక్తుల బొమ్మలు చెక్కడం వల్ల ఈ మండపానికి అష్టశక్తి మండపం అని పేరు వచ్చింది .. మీకు పక్కనే స్వర్ణకమల తటాకం కూడా కనిపిస్తుంది చూస్తున్నారా ? ఆ అదే స్వర్ణకమల తటాకం
ASHTASHAKTI MANDAPAM , MEENAKSHI TEMPLE,

స్వర్ణకమల తటాకం :
స్వర్ణకమల తటాకం గురించి ఇతిహాసం ఏమిటంటే దేవేంద్రుడు తన పాప పరిహారం కోసం ఈ తటాకంలో స్నానమాడి అందులోని స్వర్ణ కమలాలతో శివుని పూజించాడట .

GOLDEN LOTUS TANK, MEENAKSHI AMMAN TEMPLE MADURAI

ఈ తటాకానికి చుట్టుతా విశాలమైన తాళ్వారములున్నాయి  ఉత్తర తల్వారమ్  స్తంభాలమీద మూడవ తమిళ సంఘం కవీశ్వరులు 24 మందివి చిత్రాలున్నాయి . ఈ తాళ్వారంలోనే మరో రెండు స్తంభాల పైన మరో రెండు చిత్రాలున్నాయి . కదంబ వనంలో ముఖ్యక్షేత్రాన్ని కనిపెట్టిన ధనంజయంది , రెండవ పటం : నగరాన్నీ ఆలయాన్ని నిర్నించిన కులక్షేఖర పాండ్యన్ .
GOLDEN LOTUS TANK, AMMAN TEMPLE

తూర్పు తాళ్వారం నుంచి చూస్తే , మీనాక్షి సుందరేశ్వరుల గర్భాగుదిమీద ఉన్న స్వర్ణ గోపురాలు కనిపిస్తాయి. దక్షిణ తార్వరపు గోడకు తాపిన పాలరాతి ఫలకాలమీద తిరుక్కురళ్ చరణాలు చెక్కబడి ఉన్నాయి .

అన్ని సరిగ్గా కనిపించలేదు అంటున్నారా ? వెళ్ళినప్పుడు చూడండి జ్ఞాపకం పెట్టుకుని .
ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే .. మనం చూడబోయే మండపాల పేర్లు .. మీనాక్షి నాయకన్ , ముదలి పెళ్లె మండపం . మనకి లైన్ లో ముందుకు వేళ్ళలో ఈ చిత్రాలను చూడాలో తెలియదు .. లైన్ లో వెళ్తూ పైకి క్రిందకు చూస్తూనే ముందుకు సాగుతాం .

చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉన్నాయో ..

గణపతి , మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి చిత్రాలు వావ్ .. దర్శనం అయ్యాక ఒకసారి చిత్రాలను చూడ్డానికి రావాలని ఉంది కదూ .. చక్కగ  పాటలు పాడటం వచ్చినవారు చక్కగ ఒకపాట పాడుతుంటే .. జై గణపతి , జై గణపతి అంటూ ముందుకు వెళ్ళవచ్చు ..


ఇక మీనాక్షి అమ్మవారు మదురైలో వెలిసిన వైనాన్ని చూస్తే.... తను ఇచ్చిన మాటకోసం భూలోకం చేరిన పార్వతి మదురై రాజుకు కుమార్తెగా జన్మించి మీనాక్షి నామధేయంతో పెరిగి పెద్దదైంది. పరమశివుడు సుందరేశ్వర‌ునిగా భూలోకంలో జన్మించి మదురై వచ్చి మీనాక్షీ అమ్మవారిని వివాహమాడాడడని.. అనంతరం వీరు మదురై రాజ్యాన్ని చాలా ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించారని భక్తులు విశ్వసిస్తారు. ఆ తర్వాత ఇరువురు ఈ ఆలయంలోనే కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి.  ఇప్పుడు అమ్మను చూడ్డానికి లోపలకి వెళ్దాం ..
మీనాక్షి .. చేపలవంటి నేత్రములగల  తల్లి.

MEENAKSHI AMMAN SANNIDHI


అమ్మ కన్నుల్ని చేపలతోనే పోల్చడానిక్కూడ ఒ విశేషం ఉంది. లోకంలో ఉన్న మిగిలిన అన్ని ప్రాణులూ తమ పిల్లలకి పాలనియ్యడం ద్వారానే పెంచగలుగుతాయి. చేపజాతి మాత్రం అలా కాదు. తన పిల్లల్ని తానొక్కమారు అలా చూస్తే చాలు పిల్లల కడుపులు నిండుతాయి. దీన్ని బట్టి తెలిసేదేమంటే, అమ్మ మీన +అక్షి- చేపలవంటి కన్నులు కలది కాబట్టి మనం అమ్మని దర్శించినప్పుడు అమ్మ కన్నుల్లో మన కళ్లని అలా ఒకసారి ప్రసరింపచేసి చూస్తే చాలు అమ్మ కనుదృష్టి మన మీద పడి మన కుటుంబాలన్నీ చక్కగా పోషింపబడతాయని. అమ్మకి ‘మీనాక్షి’ అనే పేరు ఇందుకే వచ్చింది. 

అమ్మవారి దర్శనం అయ్యక .. స్వామి వారి దర్శించడానికి వెళ్ళే దారిలో మనకు గణపతి దర్శనం ఇస్తారు ..

ముక్కురుణి  వినాయకర్  :
ఎనిమిది అడుగుల ఎత్తుగల ఈ వినాయకర్ మహా విగ్రహం .. తిరుమల నాయకుడు వండియార్ తెప్పకుళమ్ తవ్వేటప్పుడు దొరికింది .

తెప్పకుళమ్ అంటే కోనేరు .. కొద్దిగా వివరంగా చెప్పు అంటున్నారా ? సరే
మీనాక్షి అమ్మవారి ఆలయనిర్మాణానికి కావాల్సిన మట్టి ని సేకరించడానికి .. అమ్మవారి ఆలయానికి సుమారు 2కిలోమీటర్లు దూరం లో మట్టిని తవ్వడం స్టార్ట్ చేసారు . ఈ మట్టిని అమ్మవారి ఆలయం తో పాటు రాజా వారి భవన నిర్మాణానికి కూడా ఉపయోగించారు .
MUKKURINI VINAYAGAR SANNIDHI

ఆ మట్టిని త్రవ్వుతున్నప్పుడే స్వామి వారు దర్శనం ఇచ్చారు . అప్పుడు స్వామి వార్ని మీనాక్షి అమ్మవారి ఆలయం లో ప్రతిష్టించారు .

తెప్పకుళమ్ కోసం చెప్పుకున్నాం కనుకా ఒకసారి తెప్పకుళమ్ చూసివద్దాం ..తమిళనాడు లో ఉన్న కోనేరులలో ఈ కోనేరు పెద్దది .. 305 మీటర్ల పోడవు , 290 మీటర్ల వెడల్పు ఉంటుంది . మీనాక్షి అమ్మవారి ఆలయం ఎంత ఉంటుందో ఈ కోనేరు కూడా అంతే ఉంటుంది

Vandiyur Mariamman Teppakulam

ఈ ఫోటో లో చూస్తున్నారా ? మనవాళ్ళు ఎంత సైజు లో కనిపిస్తున్నారో . చెప్పగా చాల పెద్దది అని .. రాజు గారు చుట్టూరు గోడకట్టించి కోనేరుగా మర్చరన్నమాట .

ఈ కోనేరును మరియమ్మన్ కోనేరు ( Vandiyur Mariamman Teppakulam ) అనిపిలుస్తారు .. ఈ కోనేరు ఎదురుగా మరియమ్మన్ ఆలయం శివాలయం కూడా ఉంటుంది .

Vandiyur Mariamman Temple is located in east of the temple city Madurai, TamilNadu, India. It is dedicated to Mariamman, the Hindu Goddess of rain. it is situated near to river Vaigai at a distance of about 3 km from the Meenakshi Amman Temple. Temple has its huge pond Vandiyur Mariamman Teppakulam. Although Mariammam Shrine is the prime shrine, temple has pechiammam and vinayagar beside the pipal tree. Two dwarapalakis located on the entrance of Mariammam shrin

Jan/Feb నెలలో 10 రోజుల పాటు తెప్పోస్తావం  చేస్తారు . ఇక్కడికి పెద్దేత్తున చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా జనం చూడ్డానికి వస్తారు ..

 ఈ కోనేరు మొత్తం నీటితో నింపుతారు . బోటింగ్ కూడా ఉంటుంది .


రాత్రి వేళలో ఐతే చాల బాగుంటుంది .. చుట్టూ లైటింగ్ తో డెకరేట్ చేస్తారు

అక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం .. రాజా వారి భవనం నుంచి .. ఈ కోనేరు మద్యలో ఉన్న టెంపుల్ వరకు .. టెంపుల్ నుంచి మీనాక్షి అమ్మవారి టెంపుల్ వరకు స్వరంగం ఉందని . శత్రువులనుంచి తప్పించుకోవడానికి రాజు గారు వీలుగా స్వరంగం కూడా తవ్వించారాంట .

ఏవండి .. ఇక్కడకి వచ్చేయండి .. మనం మీనాక్షి అమ్మవారి ఆలయం లో ఉన్నాం ఇప్పుడు .. :)
గణపతి దర్శనం  అయ్యాక మనం ఈ ధారిలో స్వామి వారి దర్శనానికి వెళ్తాం ..


మీనాక్షి అమ్మవారి ఆలయం లో ఎటు చూసినా శిల్పకళ సంపద కనిపిస్తూనే ఉంటుంది.. ఇప్పుడు మనం ఉన్న మండపం పేరు కంబత్తడి మండపం .
KAMBATHADI MANDAPAM SOUTH - MEENKASHI AMMAN TEMPLE

మనం ఇప్పుడు ఉన్నది  తూర్పు మండపం లో .. ఎడమవైపు చిత్రం చూస్తున్నారా ?

ఈ చిత్రం లో మీరు  విష్ణుమూర్తి  తనచేల్లెలు మీనాక్షి అమ్మవారు  సుందరేశ్వరునకు ఇచ్చి వివాహం చేయడం మీరు చూడవచ్చు .  మదురై లోనే వారి వివాహం జరిగింది .
KAMBATHADI MANDAPAM EAST - MEENKASHI AMMAN TEMPLE 


రాతికే జీవంపోసినట్టు ఉంటుంది మనవాళ్ళు చెక్కిన శిల్పాలు . నేను చెప్పడం ఎందుకు మీరే చూస్తున్నారుగా ..
KAMBATHADI MANDAPAM EAST - MEENKASHI AMMAN TEMPLE 

అందరు ఒక్కసారి ..  ఓం నమః శివాయ .. ఓం నమః శివాయ.. ఓం నమః శివాయ అనండి .. స్వామి వారి గర్భగుడి దగ్గరకు వచ్చాం ఇప్పుడు . స్వామి వారి దర్శనం టికెట్స్ ఇక్కడే ఇస్తారు . 50/- టికెట్ తీస్కుంటే మీరు గర్భగుడిలోకి వెళ్ళవచ్చు . స్వామి వారి దర్శనం టికెట్స్ ఇక్కడే ఇస్తారు . 50/- టికెట్ తీస్కుంటే మీరు గర్భగుడిలోకి వెళ్ళవచ్చు . దర్శనం అయింది కదా ప్రసాదం ఎక్కడిస్తారో చెప్తే .. వెళ్లి తెచ్చుకుంటాం అంటున్నారా ? ప్రక్కనే ఇస్తారు ..
SUNDARESHARA SANNIDHI - MEENAKSHI AMMAN TEMPLE- MADURAI


అప్పుడే వెళ్ళిపోవడానికి లేదండి .  ఇప్పుడు మనం అందరం .. ఆ రండి నటరాజాస్వామి ని కూడా దర్శనం చేస్కుందాం .. నటరాజ్ స్వామి దర్శనం తో పాటు .. మీరు వావ్ .. అనే శిల్పకళను కూడా చూడబోతున్నారు ఇప్పుడు .
The "Aayiram Kaal Mandapam" or Thousand Pillar Hall 

చెప్పడం మరిచాను ఎంట్రన్స్ టికెట్ తిస్కున్నారు కదా .. సరే వచ్చేయండి పర్వాలేదు ఐతే .

MEENAKSHI AMMAN TEMPLE - MINIATURE OF RATHA

మీరు కళ్ళార్పకుండా చూస్తూనే ఉండండి ..


అక్కడే నటరాజాస్వామి ఉన్నది .. రండి .. త్వరగా

ఓం నమః శివాయ .. ఓం నమః శివాయ.. ఓం నమః శివాయ
THOUSAND PILLAR MANDAPAM - NATARAJA SANNIDHI 

మనవాళ్ళ పెయింటింగ్స్ చూడండి  .. 

THOUSAND PILLAR STORIES OF LORD SHIVA IN PAINTINGS

మీరు లోపలకి అడుగుపెట్టగానే .. పైన  చిత్రాలు కనిపిస్తాయ్.. అవి అరవై తమిళ సంవత్సరాలను సూచిస్తుంది


ఇక్కడ మీరు చూసితీరవలసిన విగ్రహాలు : మన్మధుడు, రతీదేవి , అర్జునుడు , మోహిని , కలిపురుషుడు , వీణ చేతపట్టిన పడతి


ఇక్కడ ప్రాచీన వస్తు సముదాయం , అపూర్వ విగ్రహాలు.. వాటిని చూస్తూ ఉంటె వర్ణించడం ఏలా .. మీరు కూడా ఫీల్ అవడమే బెస్ట్ వర్ణిచడం కష్టం

మీనాక్షి అమ్మవారి వివాహగట్టం ..మీరు మధురై అమ్మవారి గుడిలో THOUSAND PILLAR MANDAPAM - NATARAJA SANNIDHI కి వెళ్ళినప్పుడు .. లోపలకి అడుగుపెట్టగానే ఎదురుగా నటరాజ్ దర్శనం ఇస్తారు . మీరు అడుగు పెట్టిన వెంటనే కుడివైపుకి లేదా ఎడమ వైపుకి వెళ్ళండి అలా చివరకి వెళ్ళండి .. అక్కడ గోడ తప్ప ఏమి లేదు అనుకోవద్దు . ఆ చివరన స్థంబం ఉంది కదా .. ఒక సారి మీ చెవి స్థంబం పైన పెట్టి స్థంబం పై కొట్టండి .. ఒక్కో ప్లేస్ లో ఒక్కో స్థంబం వినిపిస్తుంది . వావ్ సూపర్ అనుకుంటూ ..మళ్ళి వినండి .చూస్తున్నారా ? .. ఈ మండపాన్నే వెయ్యి స్తంభాల మండపం అంటారు . . మండపం లో ఉన్న ఉన్నవి 985 స్తంభాలు .. వాటి అమరికలో చిత్రమేమిటంటే .. ఏ కోణం నుంచి చూసినా అవన్నే ఒకే ఒక్క వరుసగా కనిపిస్తాయి .

మీరు చూస్తూనే ఉంటే ఎలా .. చాలామంది చూడాలిగా రండి ఇంకా :)

మీలో నాకు నచ్చేది అదే .. పిలవగానే వస్తారు . ఇప్పుడు మనం ఉత్తర గోపురం దగ్గర ఉన్నాం . ఇక్కడే ఏముంది అనుకుంటున్నారా ? ఇక్కడ గేటు లోపల స్తంభాలు కనిపిస్తున్నాయా ? వాటిని సంగీత స్తంభాలు అని పిలుస్తారు . ఇవి మొత్తం 5 ఉన్నాయ్ .. ఒకే రాతితో చెక్కబడిన 22 చిన్న స్తంభాలు ఉన్నాయ్ .. వీటిని తట్టితే స్వరాలూ పలుకుతాయి .. నాకు తెలుసు మీరు తాకడానికి ట్రై చేస్తారు అని .. అందుకే వాల్లెర్పాటులో  లో వారు ఉన్నది . మీకో నిజం తెలుసా నేను ట్రై చేశాను ... :) కాని సంగీతం రాలేదు :( అక్కడ ఉన్న ఒకాయన చెప్పాడు అందరు తాకడం వాళ్ళ ఇప్పుడు అవి సరిగా పనిచేయడం లేదు అని చెప్పాడు .

మనం బయలుదేరుదామా ఇంకా ... ఒకసారి ఆలయం చుట్టూ తిరిగి గోపురాలని చూసిరండి ..నాకు గుర్తూంది  అండి.. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం టైమింగ్స్ కోసం చెప్పలేదు .. మీకు చివర్లో చెప్తే బాగా జ్ఞాపకం ఉంటుంది అని చెప్పలేదు :)
Madurai Meenakshi amman Temple Opening time: 

5.00 A.M. to 12.30 P.M. and 
4.00 P.M. to 9.30 P.M


మదురై వరకు వచ్చాం కదా దగ్గర్లో ఉన్న ఆలయాలు .. చెప్తే వెళ్లి వస్తాం అని అడగబోతున్నారా ? సరే

మదురై నుంచి ... ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు  (అఱుపడై వీడుగళ్) లలో
 http://rajachandraphotos.blogspot.in/2012/07/tiruttani.html
 

తిరుప్పరంకుండ్రం(Tirupparankundram)  - 20km ,

పళముదిర్చొళై Palamudircholai - 20km , 

పళని
Palani - 120km 


రామేశ్వరం - 180km  
ఈ లింక్ చూడండి ..  http://www.view360.in/virtualtour/madurai/ 
keywords : madurai temple inforamtion in telugu , telugu lo madurai yatra , madurai alaya vishesalu , madurai tour , telugu lo temple information . telugu travel blog , www.templeinformation.in

మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Comments

 1. Its Very beautiful... Thanks for sharing the lovely pictures of Madurai Amman Kovil..

  ReplyDelete
  Replies
  1. Ayya meru chala baga madurai chupincharu. miku vena vela danyavadamulu. oka chinna manave, swarangam ane vrasaru, adhe sorangam ane vrayande. mee sarvademullu arakuvalley

   Delete
  2. చాల మంచి సమాచారము అందించారు. నెనరులు.

   Delete
 2. ఫోటోలన్నీ మీరే తీశారా చాలా బాగున్నాయి. లోపలంతా మనం ఫోటోలు తీసుకోవచ్చా
  psmlakshmi

  ReplyDelete
  Replies
  1. photos tiskovacchandi.. kaani ticket tiskovali..

   Delete
 3. photos chala bagunnayi andi. very nice.!

  Phaniram.k

  ReplyDelete
 4. Malli nenu Madurai lo chdavukunna rojulu gurthuku techharu.. malli ammavari gudini darsanam cheyincharu... mee naa abhinandanalu..

  ReplyDelete
 5. Thankyou rajachandra for providing very valuable information.

  పూర్తి సమాచారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు

  ReplyDelete
 6. Hi,

  Thanks you very much and it has lot of information.

  ReplyDelete
 7. మరీ ఇంత బాగా చేయిపట్టి నడిపించుకుంటూ తీసుకెళ్ళి, వివరిస్తూ మా టికెట్టు డబ్బు మిగిల్చినందుకు రొంబ నండ్రి :)
  ఫోటోలు చాలా బాగున్నాయి.

  ReplyDelete
 8. Thank You Somuch. Memu madurai vellinappudu kuda intha clear ga observe cheyaledu .Ver Nice.

  Sailaja

  ReplyDelete
 9. looks good.good work Pradeep

  ReplyDelete
 10. chala chala bagundi

  ReplyDelete
 11. Very nice trip for people like me who never visited the temple!

  ReplyDelete
 12. Really good work Maayyaa.......:)
  keep going on..!!

  ReplyDelete
 13. This comment has been removed by the author.

  ReplyDelete
 14. Good work Raja chandra.. thanks for ur post !!

  --

  Deepti

  ReplyDelete
 15. This comment has been removed by the author.

  ReplyDelete
 16. chala manchi samacharam ....dhanyavadhalu :)

  ReplyDelete
 17. amazing informative blog.. keep it up dude..

  ReplyDelete
 18. dhanyavadhalu nice information

  ReplyDelete
 19. గుడి చుసి వచ్చినట్టు ఉంది . బాగా వర్ణించి చెప్పారు . మీ దగ్గర నుండి ఇంక ఇలాంటివి రావాలని కోరుకుంటూ మీ నవీన్

  ReplyDelete
 20. good and useful information.........thanks a lot i like it ....prasad

  ReplyDelete
 21. sir super ga vundi sir iam full satisfaction

  ReplyDelete
 22. nijamga meru chala amnchi information icharu chala dhanyavadamulu mana guruvu gari vala memu inta adrushtaniki nochukunnam chala thanks

  ReplyDelete
 23. very very good work. thanks for providing such a detailed trip. Thank you

  ReplyDelete
 24. Very Nice. Useful to those who wish to visit the temple.

  ReplyDelete
 25. that's why i visited 2 times. very beautiful and thank you.

  ReplyDelete
 26. many many thanks for information about one of the 7 wonders of India

  ReplyDelete
 27. meeru chesena sevalaku dhanyavadamulu

  ReplyDelete
 28. Pratyakshanga chusinattuga chepparu.....

  ReplyDelete
 29. SRI RAJACHANDRA GAARU., MIIRU ENTO VIVARAMUGAA DEVAALAYAMULA GURINCHINA POORTI VISHESHAALU TELUPUTUNNAARU. MIIKU MAA DHANYAVAADAMULU.

  ReplyDelete
 30. ధన్యవాదాలు రామచంద్ర.

  ReplyDelete
 31. పూర్తి సమాచారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు గుడి చుసి వచ్చినట్టు ఉంది . బాగా వర్ణించి చెప్పారు . మీ దగ్గర నుండి ఇంక ఇలాంటివి రావాలని కోరుకుంటూ మీ శంకర్

  ReplyDelete
 32. Malli nenu Madurai lo chdavukunna rojulu gurthuku techharu.thank u

  ReplyDelete
 33. i am getting feeling to go to madurai.. righ now.. very nice and old temples in the world.. i think.....Gopala krishna Murthy Kota

  ReplyDelete
 34. సమాచారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు

  ReplyDelete
 35. Madhura Meenakshamma darsanam cheyinchinanduku meeku na Dhanyavadalu.

  ReplyDelete
 36. Very useful and good information in Telugu. Thanks. I would like to visit all important temples in Tamilnadu. Can you provide me travel route, which will help to travel from one place to another in an orderly manner without wasting time and money. Advise from elders and seniors like you will be asset to us.Guide us.

  ReplyDelete
 37. రాజ చంద్ర గారు,

  సూపర్.
  చిన్న కరెక్షన్. రైల్వే స్టేషన్ నుంచి గుడి కి వెళ్ళటానికి ... మొదట స్టేషన్ బయటకు రాగానే కుడి వైపుకు తిరిగి మొదట వచ్చే ఎడమ వైపు వీధి లోకి తిరగాలి .

  మరియు గుడి లో మొత్తం శిల్పాల సంఖ్య 18,000. కులశేఖర పాండియన్ కాలం లో మొదలెట్టబడిన ఈ గుడి చివరకు తిరుమల నాయకర్ హయాం లో పూర్తి కావించబడింది. బాగా అభివృద్ధి లో కి వచ్చినది విశ్వనాథ నాయకర్ ( మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక సినిమా కూడా చేసారు... శివాజీ గణేసన్ అండ్ కృష్ణం రాజు గారు కృష్ణదేవరాయలు లా) హయం లో.
  మీరు చాల మంచి మరియు గొప్ప పని చేస్తున్నారు.... హాట్స్ ఆఫ్ to యు .

  ReplyDelete
 38. మదుర మీనాక్షి దర్శనానికి వెళ్ళడానికి మదురై జంక్షన్ దిగాలా మన్మదురై దిగాలా.
  ఎందుకంటే ఎక్సప్రెస్ రైళ్ళు మన్మదురై స్టాపు మాత్రమే చూపుతున్నాయి,,
  మార్గ దర్శనం చేయగలరు.

  ReplyDelete
 39. This is nice and interesting post. The way the blog is represented with pictures of the places you traveled is really mesmerizing. Thank you for sharing this blog.
  Visit for us -
  Car Hire
  Car Booking
  Taxi Rental
  Taxi Hire
  Car Hire
  Cab Hire

  ReplyDelete
 40. I really like it. It’s very helpful for everyone. Very Amazing and Interesting blog. Thanks for sharing...
  Best taxi service in Delhi
  Cab service in Delhi

  ReplyDelete

Post a Comment