Kanchipuram Temple Information | Kachipuram Details in Telugu

నేను కాంచీపురం 5 సార్లు వెళ్ళిన అన్ని దేవాలయాన్ని చూడలేకపోయాను . మొదటిసారి వేల్లినప్పుడైతే ఏకామ్రేశ్వర స్వామి ని కూడా చూడలేదు . మనవాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారికి వస్తారు కొందరికి ఐతే అదికూడా వీలుపడదు . మరి వారు అన్ని దేవాలయాలను దర్శనం చేస్కునే వెళ్తున్నారా ? కొంచెం పెద్ద పోస్ట్ అయిన పర్వాలేదు నాకు తెల్సిన ఆలయాల కోసం రాద్దామని ఈ చిన్నప్రయత్నం చేశాను . ఈ పోస్ట్ చదివి కంచి వెళ్ళినప్పుడు అన్ని దేవాలయాలను దర్శించుకుని క్షేమంగారండి .. 
Kanchipuram Temple Information

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా | పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః | |


కంచి (kanchi)మన వాళ్ళందరికి సుపరిచితమే, తిరుపతి వచ్చిన వాళ్ళు కంచి కూడా వచ్చి కామాక్షి అమ్మవార్ని దర్శించుకుంటారు . మనం బస్సు దిగినవెంటనే ఆటో వాళ్ళు ఆలయాల లిస్ట్ చేతపట్టుకుని మనకి స్వాగతం పలుకుతారు . వార్కొ 150 ఇస్తే కంచి లో ఉన్న కామక్షి ఆలయం(kamakshi temple) ,  ఏకామ్రేశ్వర  ఆలయం , వామన మూర్తి ఆలయం , వరద రాజ స్వామి ఆలయం (బంగారు బల్లి )చూపిస్తారు . అక్కడితో  మన కంచి యాత్ర మిగిసినట్టే . 
.గుర్రం బండి వాళ్ళు  కూడా ఉంటారు  (80 /-).. నిజానికి  వరద రాజ స్వామి ఆలయం తప్ప మిగిలినవి 1కి.మి. లోపు దూరంలోనే  ఉంటాయ్ . ఆసక్తి ఉన్నవాళ్ళు మిగిలిన  నేను రాసేవి  చదవండి .  ఫొటొ లు చూసి వేళ్ళే ఆలవాటు ఉన్నవాళ్ళు ఆపనిలో ఉండండి :)


కాంచీపురం(kanchipuram), కంచి(kanchi), లేదా కాంజీపురం:
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా |
పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః | |
 భారతదేశంలో గల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి. కంచి మోక్షవిద్యకు మూలపీఠం,అద్వైతవిద్యకు ఆధారస్ధానం . ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠవైభవంతో కంచి నగశోభ మరింత దేదీప్యమానమయింది. కాంచి అనగా మొలనూలు. వడ్డణాం. మొత్తం భారతభూమికి ఇది నాభిస్థానం . అతి ప్రధానమైన శక్తిక్షేత్రం, పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు విదేహాముక్తి నందిన పుణ్యస్ధలం.


శ్రీ కామాక్షి అమ్మవారిగుడి (Kamakshi Temple) :
కంచి లో అమ్మవారి గుడి బస్సు స్టాండ్ కి దగ్గరలోనే కలదు . అక్కడ ఉన్న ఎవరిని అడిగిన చెప్తారు. ఒక్కోసారి బస్సు అమ్మవారి గుడికి దగ్గరలోనే ఆపుతాడు. "కా" అంటే "లక్ష్మి",  "మా" అంటే "సరస్వతి", "అక్షి"   అంటే "కన్ను".   కామాక్షి దేవి  అంటే లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవి ని కన్నులుగా కలది. ఈ దేవాలయంలో  శ్రీకామాక్షిదేవి గాయత్రి మండపంలో పద్మాసనంలో కొలువుదీరి ఉన్నారు.


అమ్మవారి గుడిలోకి అడుగు పేట్టిన  వేంటనే మనకి సాదారణంగ  ఏనుగు స్వాగతం పలుకుతుంది.
 ఆలయ ప్రవేశానికి టికెట్ ఏమి లేదు.  మీరు ఆలయంలోకి వేళ్ళేముందు అమ్మవారి వాహనన్ని ఒకసారి చూసి వేళ్ళండి . ఒక కాలు పైకి ఎత్తి యుద్దానికి సిద్దంగా ఉన్నాను అని అమ్మవార్కి చెప్తున్నట్టు కనిపిస్తుంది .


అమ్మవారి గుడి లోపల తీసిన ఫోటో ఇది .. మీరు  లైన్ లో దర్శనం కోసం వెళ్తున్న వార్ని చూసారా ? 

అమ్మవారి గర్బగుడి దగ్గరవుతున్న సమయం లో వరుస రెండుగా విడిపొతుంది . మీరు లోపలి వరసలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. అక్కడ ఉన్న వాళ్ళని  బ్రతిమిలాడితే అనుమతి  ఇస్తారు .. ఖాళీగ ఉంటే  ఎ సమస్య లేదు . మీరు అమ్మవారి దర్శనం అయిన తరువాత వెనక్కి వచ్చి మేట్లు ఏక్కితే మీరు అమ్మవారి ఉత్సావ ముర్తులు ఉన్నచోటికి వస్తారు  ,.. ఆక్కడ నుంచి అమ్మవారు చాల చక్కగ కనిపిస్తారు .. మీరు ఎంతసేపైన  చూడవచ్చు . ఆక్కడ మీరు కాసేపు కుర్చునే వీలు ఉంటుంది ..మీరు క్రిందకు దిగిన వేంటనే ఆదిశంకరుల దర్శనం  చేస్కోనవచ్చును . మీరు కాస్త గమనిస్తే ఆదిశంకరుల ఆలయం పక్కన (మీకు కుడిచేతివైపు అరుగు మీద - కాస్త పైకి ఏక్కితె) ఆది శంకరుల చరిత్ర బొమ్మలతో వివరించి ఉంటుంది . మీరు గుడిలో కాశి విశాలాక్షి అమ్మవార్ని కూడా చూడవచ్చు .





బయటకి వచ్చిన తరువాత  వేనకవైపు ఉన్న కోనేరు -వేపచెట్టు - అమ్మవారి గుడి - పెద్ద మండపం  చూడవచ్చు.

శ్రీ వామనమూర్తి దేవాలయము : (ఉలగళందప్పెరుమాళ్)   ( Vamanamurthy Temple )               


కంచి లో అమ్మవారి ఆలయం కి అతి సమిపంలోనే వామనమూర్తి గుడి ఉంది (ఆలయానికి ఎదురుగ నడిచి కుడిచేతివైపుకు తిరగాలి.) . ఆలయంలో లోపల  చికటిగ ఉంటుంది. మనం జాగ్రత్త చూడలి వామనముర్తి ఆకాశం  వైపు ఒకకాలు పేట్టి మరోకాలితో బలిచక్రవర్తి తలపై వేసిన వామన మూర్తిని మనం దర్శించవచ్చు.దర్శనానికి టికెట్ ఏమిలేదు.
 ఆదిశేషునికి ప్రత్యేకమైన సన్నిధి కలదు.
రామనాధ స్వామి ఆలయం : Ramanadha Swamy Temple
తిరిగి అమ్మవారి ఆలయనికి చేరుకుని అమ్మవారి ఆలయానికి కుడిచేతివైపు  నడిస్తె మనకి మైన్ రొడ్డు వస్తుంది .
...మళ్ళి మనం ఏడమచేతివైపు కి నడిస్తే   శంకర మఠం  దాటిన తరువాత  ఏకాంబరేశ్వర దేవాలయం కనిపిస్తుంది . ఏకాంబరేశ్వర దేవాలయం ఎదురుగ రామనాధ స్వామి ఆలయం కనిపిస్తుంది.   రామేశ్వరం  వేళ్ళకుండానే   ఇక్కడే మీరు శివయ్య గార్ని దర్శించుకోవచ్చు  .




ఏకామ్రేశ్వర దేవాలయం:Ekamreswara Temple
ఇక్కడ మీకు కనిపిస్తున్న గాలిగోపురం ఎత్తు 192 అడుగులు 

పంచభూతలింగక్షేత్రము లలో  కంచి లో పృధ్వీ లింగం  ఉంది. ఈ పంచభూత లింగములు వరుసగా 

1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము(Arunachalam): అగ్ని లింగం
2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం(Jambukeswaram): జల లింగం
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం(Chidambaram): ఆకాశ లింగం
4. ఏకాంబరేశ్వరుడు - కంచి(Kanchipuram): పృధ్వీ లింగం
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి(Sri kalahasti): వాయు లింగం 

మీకు అరుణాచలం పోస్ట్ లో కూడా చేప్పాను..


మీకు పార్వతి దేవి శివుని కన్నులు మూయడం , అందువల్ల  జరిగిన పరిణామలు వళ్ళ పర్వతి దేవి తపస్సుకు బయలు దేరడం , ముందుగా కాశి లో తప్పస్సు చేయడం , అక్కడనుంచి కంచి వచ్చి  మామిడ చెట్టు క్రింద సైకిత లింగం చేసి పూజలు చేస్తూ ఉండటం,పరమశివుడు  అమ్మవార్ని పరిక్షింపదలచడం తత్ఫలితంగా  కంపనది పోంగడం పార్వతి దేవి ఇసుకతొ చేసిన లింగ కోట్టుకుని పొకుండా  ఆలింగనం చేస్కోవడం ..  శివుడు సంతొషించి అనుగ్రహించడం అమ్మవారు అక్కడనుంచి అరుణాచలం వెళ్లి అరుణాచలం  లో  ఆర్దనారీశ్వరులుగా ఏకమవడం మీకు తెలుసు కద .

గోపురం వెనకాల నుంచి తీసాను .. చూసారా ఎంత పెద్దది ఉందో.. మనవాళ్ళు గ్రేట్ కదా .. 
మనం  గాలిగోపురం వద్దకు వెళ్ళగానే మనం ఈ చిత్రాన్ని చూడవచ్చు ..


  ఆలయం వేనకవైపు అమ్మవారు తపస్సు చేసిన మామిడ చేట్టు మనం చూడవచ్చు. ఏకాంబరేశ్వరాలయం అని పిలుస్తున్నాం కదా నిజానికి  ఏకాంబరేశ్వరాలయం కాదు  ఏకామ్రేశ్వర దేవాలయం  . ఏకామ్ర .ఆమ్ర=మామిడి ;అంబర=వస్త్రం ,ఆకాశం అని నానార్థాలు.ఏకామ్రేశ్వరస్వామి ఆంటే  మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం.ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు .
 ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాసశ్థ్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . 

ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు.ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో,దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు.   



మీరు చూస్తున్నారు గా .. ఇక్కడే అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం ఇదే .

 ఈ మామిడి వృక్షం క్రింద పార్వతిపరమేశ్వరులు, పార్వతిదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు.

 మీకు కంపనది చూపిస్తాను ఇప్పుడు .. కంపనది అంటే మన గోదారి లా ఉంటుంది అనుకోకండి ...

 వీడు ఫోటో తేడాగా పెట్టాడు అనుకుంటున్నారా ? లేదు నేను అక్కడ వాలని కంపనది ఎక్కడ ఉంది అంటే అదిగో అని చూపించారు .. కోనేరుల ఉంది లోపల .. ఇప్పుడు నీరు ఎం లేదు అక్కడ .. మీరు వెళ్ళినప్పుడు నీరు ఉంటె చూసిరండి .మనం గాలిగోపురం దాటిన తరువాత క్రింద ఫోటో కనిపిస్తుంది చూడండి.. ఈ ఆలయానకి మధ్యలో మనకి కంపనది కనిపిస్తుంది .

ఏకామ్రేశ్వర దేవాలయం

గాలిపురం దాటినా తురువాత ఆలయం కనిపిస్తుంది .. చూసారా ఎంత పెద్ద ఆలయం ఉందో.. మీరు రామేశ్వరం చూసిఉంటే మీకు ఆలయం లోపలకి వెళ్ళిన తరువాత తప్పకుండ రామేశ్వరం గుర్తుకువస్తుంది. పెద్ద కోనేరు కూడా మనం చూడవచ్చు ఇక్కడ 

 

మధ్యాహ్నం భోజనం కుడా (అన్నదానం) ఉంది .. కాకపోతే తక్కువ మంది కి పెడతారు (50).. ఆ టైం లో మీరు అక్కడ ఉంటె ప్రసాదం స్వీకరించి రండి .

 కంచి కామకోటి పీఠం  - Kamakoti pitham

సాక్షాత్తు ఆదిశంకరచార్యుల వారే పిఠాదిపతిగా  ఉన్న పీఠం కంచి పీఠం ..కాంచిపురం లో ఆలయాలు అన్ని తిరిగివచ్చి కంచిమఠం లో పీఠాదిపతులను  దర్శించుకున్న తరువాత  ఒక రేండు గంటల పాటు శంకరేంద్ర సరస్వతి వారి బృందావనం దగ్గర లో గడపడం అంటే నాకు చాల ఇష్ఠం . మీరు మధ్యాహ్నం 12-1  సమయంలో వేల్లితే పీఠాది పతుల  చేసే పూజమీరు చూడవచ్చు .పూజ అయిన తరువాత పీఠదిపతులు మనకి దర్శనం ఇస్తారు .   కంచి మఠం లో మనం పీఠాదిపతుల ఇద్దరిని(Sri Jayendra Saraswati &Sri Sankara Vijayendra Saraswati ) దర్శించవచ్చు.

 శ్రీ విజయేంద్ర  సరస్వతి(Sri Sankara Vijayendra Saraswati) వారు ఇక్కడే మనకు దర్శనం ఇస్తారు .. 

 The 7Oth Pontiff His Holiness Sri Sankara Vijayendra Saraswati Swamigal

 మీరు మఠం లో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి(The 68th Pontiff His Holiness Sri Chandrasekharendra Saraswati Swamigal ) వారి బృందావనం కూడ ఛూడవచ్చు .

 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి తేజస్సు ఇప్పడికి మనం ఇక్కడ  చూడవచ్చు .. మీరు ప్రత్యక్షంగ ఏప్పుడు చూడకపోయిన ఇక్కడ చూస్తే మనకు ఆలోటు తీరుతుంది.

 మీరు అక్కడ ఉన్న స్వామీ వారి ఫోటో లు కూడా చూడవచ్చు .

కంచి మఠం వారి అన్నదాన సత్రం :
కంచి మఠం దగ్గరలోనే అన్నదాన సత్రం ఉంది . ఎక్కడ అంటే మీరు ఏకామ్రేశ్వర ఆలయానికి వెళ్లారు కదా .. అక్కడకి దగ్గరలోనే ఉంటుంది . పెట్రోల్ బంక్ పక్కనే అంటే మీకు ఈజీ గా అర్ధం అవుతుంది . కంచి వెళ్లి బయట ఎక్కడో భోజనం చేయడం కంటే ఇక్కడ ప్రసాద్దాన్ని స్వీకరించడం ఉత్తమం అని నా అభిప్రాయం .


చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఫోటోలను మీరు ఇక్కడ చూడవచ్చు .

 

మీరు ఈ ఫోటో చూసి లోపలికి వేళ్తరేమో  .. పక్కనే ఒక బుల్డింగ్ కనిపిస్తుంది చూడండి.. అదే సత్రం.. బయట తమిళం లో బోర్డు ఉంటుంది ...
*మీరు పూజ చూసిన తరువాత ఇక్కడికి వచ్చి భోజనం చేసి మఠానికి వెళ్తే మీరు పీఠాదిపతులను దర్శించిన మీరు అక్కడే విశ్రాంతి తిస్కోవచ్చు . ఆ టైం లో ఏ దేవాలయం తెరిచి ఉండదు . మీకు చూపించడానికే కామాక్షి అమ్మవారి ఆలయం దగ్గర ఈ ఫోటో తీసాను.
  

కుమరకోట్టము - శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి ఆలయము 

Kumarakottamu ( Murugan Temple)

  ఈ ఆలయం ఆటో వాళ్ళ లిస్టు లో ఉండదు . కంచి మఠం నుంచి దగ్గరలోనే ఉంటుంది . అక్కడ ఉన్న వార్ని కుమరకోట్టము అని అడిగితె వాళ్ళకి అర్ధం అవుతుంది . ఈ  ఆలయ శివాచార్యులు శ్రీ కచ్చియప్ప శివాచార్యులవారిచే తమిళ భాషలో కందపురాణాము రచించారు . ఈ  కందపురాణాము కావ్య ఆవిష్కరణ సమయమున పండితులమధ్య సభామండపంలో శ్రీ కుమారస్వామి బాలకుని రూపంలో ప్రత్యక్షమై కందపురాణాము ఆవిష్కారించడం జరిగింది అంట. 


ఈ ఆలయ గోపురం పక్కనే ఆనాటి జరిగిన సంఘనట చిత్రీకరించి ఉంటుంది . మీరు చూడవచ్చు.  సుబ్రహ్మణ్య ఆలయం లోపల తీసిన ఫోటో ఇది.

శ్రీ కుమారస్వామి బాలకుని రూపంలో ప్రత్యక్షమై కందపురాణాము ఆవిష్కారించిన  మండపం ఇదే 




శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము - Kachchapeswara Temple

శ్రీ కుమారస్వామి ఆలయమునుకు దగ్గరలోనే శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము  ఉంది . మీరు గుడి బయటకు వచ్చిన తరువాత కుడివైపుకు నడిస్తే ఈ ఆలయ గోపురం కనిపిస్తుంది . ఈ ఆలయం గుడి ఆటో వాళ్ళు చూపించారు . చాల పెద్ద ఆలయం ఇది . బహుశా అందుకే ఈ ఆలయం ఆటో వాళ్ళ లిస్టు లో కనిపించదు మనకు .

ఈ ఆలయం కోసం చెప్పమంటారా .. ఈ ఆలయం లోనే శ్రీ మహా విష్ణువు పరమశివుణ్ణి తాబేలు రూపంలో పూజించినట్లు పురాణము. అందుచేత  కచ్ఛపేశ్వరుడు అనిపేరువచ్చింది. కచ్చ అంటే తాబేలు అని అర్ధం.

సరే లోపల చూద్దాం రండి :

 రెండు ఫోటో లు తీస్తేనే కాని కవర్ చేయలేకపోయాను ... ముందే చెప్పను కదా చాల పెద్ద ఆలయం అని .

 ఇక్కడ ఉన్న కోనేటిలో స్నానం చేస్తే రోగాలు నివృతి అవుతాయని చెప్తారు . చాల మంది స్నానం చేస్తారు కూడా . ఈ ఆలయం లో మనం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి , శక్తి గణపతి , దుర్గా ,సరస్వతి , సూర్యునికి ప్రత్యేక సన్నిది ఉంది .

ఈ ఆలయం లో పెద్ద రావి చెట్టు ఉంది. రావి చెట్టు క్రింద నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి.
 చూసారా ? చెప్పాకద చాల పెద్దది అని ... 

  రావి చెట్టు పక్కనే ఒక శివాలయం ఉంది పేరు తెలియదు నాకు .. ఆ ఆలయం పైన దక్షిణామూర్తి ఉంటె క్లిక్ అని పించాను.. మీరే చూడండి ఇప్పుడు .

 

ఇక్కడ నుంచి బస్సు స్టాండ్ దగ్గరగానే ఉంటుంది . మీకు ముందే చెప్పాను కదా.. అమ్మవారి ఆలయానికి అన్ని ఆలయాలు 1 k .m దూరం లోనే ఉంటే అని. సరే రండి ఇప్పుడు కైలాస నాద్ ఆలయానికి వెళ్దాం.

శ్రీ కైలాస నాధుని ఆలయము - Kailasanadha Temple 

శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము నుంచి సుమారు 2km దూరం లో కైలాస నాధుని ఆలయము ఉంది . ఆలయం పక్కనుంచే దారి ఉంది .. నారదుడు శివలింగాన్ని ప్రతిష్ఠించడాని చేప్తారు.. ఈ ఆలయం చాల పురాతనమైనది మనకు కనిపిస్తుంది. ఆలయం బయట పార్క్  లాగ కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగ ఉంటుంది. శివును చుట్టు ప్రదిక్షణం చెస్తే జన్మరాహిత్యము కలుగుతుందని భక్తుల నమ్మకము .   

 ఫోటోలో చూపించాను చూడండి అల వెళ్తే కైలాసనాధుని ఆలయం దగ్గరకు వెళ్తారు ... 

 ఈ ఫొటోస్ అక్కడ తీసినవే ..


 చూసారా ఆలయాన్ని ... మనకు కంచి అనగానే గుర్తుకు వచ్చేది బంగారు బల్లి కదా ..... వాటిని చూపించలేదు ఏమిటి అనుకుంటున్నారా ? బంగారు బల్లి వెండి బల్లి రెండు వరదరాజ స్వామి గుడిలో ఉంటాయ్ .. మీరు ఇక్కడ నుంచి  కచ్ఛపేశ్వరుని ఆలయము దగ్గరకు వస్తే ఆటో లు ఉంటాయ్.. ఇక్కడనుంచి సుమారుగా3  km ఉంటుంది .. మీరు అక్కడే బంగారు బల్లి ని చూడగలరు .. సరే ఇప్పడికే లేట్ అయింది కదా వెళ్దామా మరి ?

శ్రీ వరదరాజస్వామి  ఆలయము - Varadaraja Swamy Temple

కంచి లో ప్రతి ఆలయ గోపురం ఇలానే ఉంటాయ్ ..అందులో ఏకామ్రేశ్వరస్వామి ఆలయంలో మనం చూసిన గాలిపురం తరువాత ఈ ఆలయ గోపురమే పెద్దది .. వాడుకలో కోయిల్  - తిరుమల - పెరుమాళ్ కోయిల్ అని పిలబడు 108 వైష్ణవ దివ్య క్షేత్రములలో  మూడవ స్థానమును ఈ వరదరాజస్వామి వారిదే . కోయిల్ అంటే శ్రీ రంగం శ్రీ రంగనాధ ఆలయము , తిరుమల అంటే నేను చేప్పాల ? పెరుమాళ్ కోయిల్ అంటే వరదరాజస్వామి వారి ఆలయము .

బ్రహ్మదేవుడు చేసిన యాగంలో యాగ గుండము నుంచి శ్రీ మన్నారాయణుడు శ్రీ వరదరాజ స్వామి రూపంలో అవిర్భావించినట్లు స్థలపురాణము .







అవును మీకు బల్లి కధ తెలుసా ? 
కంచి లో బంగారు వెండి బల్లి  

ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారున్ని, అతని తండ్రి దేవతార్చనకు నీళ్ళు తీసుకొని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దానికి కోపించి కుమారున్ని బల్లిగా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి, అతన్ని ముట్టుకొంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు. 

ఇక్కడ అమ్మవారు పేరు పేరుందేవి ..

మహావిష్ణువు నిజస్వరూపాన్ని చూస్తున్నామ అన్నట్టుగా .. ఈ ఆలయం లో మనకు దర్శనం ఇస్తారు .. అదో గొప్ప అనుభూతు నేను ఇక్కడ మీకు చెప్పడం కష్టం . స్వామివార్ని చుసినతరువాత మనం బల్లి దగ్గరకు వెళ్తాం . బల్లి ని చూడటానికి టికెట్ తీస్కోవాలి ..
ఆలయం లోపలి తీసిన ఫోటో ఇది .. 

మీకు ఇక్కడ కోనేరు కనిపిస్తుందా ? దీనిని ఆనంద పుష్కరిణి అంటారు .

 

ఈ ఆనంద పుష్కరిణి లో వరదుని ప్రాచీన మూలవిగ్రహాన్ని 40 సంవత్సరములకు ఒకసారి తీసి వెలుపలకు తీసి 40 రోజులు భక్తుల దర్శనార్ధం ఉంచుతారు . 2019 జూన్ నెలలో మరల స్వామి వార్ని బయటకు తీసుకుని వస్తారంట.. ఎవరెవరు వస్తారో చెప్పండి .. మనం అప్పుడు వరద రాజ స్వామి సన్నిదిలో కలుద్దాం :) 

 శ్రీ వైకుంఠనాధుని ఆలయము 

శ్రీ కాంచీ క్షేత్రము నందలి ప్రాచీన విష్ణు మందిరములలో 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రములలో ముఖ్యమైనది పల్లవుల కాలమునాటి ప్రాచీన దేవాలయము శ్రీ వైకుంఠనాదాలయము . అందమైన శిల్పములతో ఆలయం అంతటా  శిల్పాల మయం.




























కంచి బస్సు స్టాండ్ సమీపంలో ఈ ఆలయం కలదు . వైకుంట పెరుమాళ్ అని అడిగితే  అంటే వాళ్ళకి అర్ధం అవుతుంది  .  అక్కడనుంచి అమ్మవారి గుడి  కూడా దగ్గరే .


* కంచి నుంచి శ్రీపురం(golden temple) వెళ్ళడానికి బస్సు లు కలవు . కంచి నుంచి 2 -3 గంటల ప్రయాణం 

*కంచి నుంచి తిరుపతి 3 -4 గంటల ప్రయాణం.  వెళ్ళడానికి బస్సు లు కలవు,

రూమ్స్ కావల్సినవాళ్లు ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి  .. అమ్మవారి గుడిపక్కనే ఉంది :
SRI VANCHINATHAN TRUST 
SRI KANCHI KAMAKOTI PEETAM
YATRI NIWAS
044-2723115, 9994346996

****మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి మరిచిపోకండి****

121 Comments

  1. రాజా చంద్ర గారూ మీ టపా వలన మళ్ళీ ఇంకోకసారి
    కంచి దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందండీ..
    బాగున్నాయి కంచి విశేషాలు,ఫోటోలు.

    ReplyDelete
    Replies
    1. రాజి గారు ధన్యవాదములు

      Delete
    2. sir, very good information. thank you somuch

      Delete
  2. Raja Garu good work it will be helpfull for me if I get a chance to visit kanchi. Thanks a lot god bless you. Venkat

    ReplyDelete
    Replies
    1. Venkat గారు ధన్యవాదములు

      Delete
  3. Lavanya KasibhatlaMarch 8, 2012 at 11:37 AM

    i am not sure if i should say this but i envy you and i wish i was in your place

    ReplyDelete
    Replies
    1. Lavanya గారు ధన్యవాదములు

      Delete
  4. క్షేత్రదర్శన విశేషాలు photosతో సహా చక్కగా పొందుపరుస్తున్నారు. చాలా బాగుంది మీ ప్రయత్నం.

    ReplyDelete
    Replies
    1. మోహన్ కిషోర్ గారు ధన్యవాదములు

      Delete
  5. రాజా చంద్రగారు,, దగ్గరుండి.. చెయ్యిపట్టుకుని... అన్నీ వివరంగా చూపిస్తున్నారా అన్నంత అందంగా.. ఆనందంగా ... సవివరంగా... సచిత్రంగా కంచి చూపించారు... చాలా సంతోషం... మీ కృషి అభినందనీయం... మీ ఇతర పోస్ట్ లు చూసి మరల ప్రస్తావిస్తాను.. అంతవరకు ఈ కథ కంచికి వెళ్ళినా మనం ఇంటికి వెళ్ళం....

    ReplyDelete
    Replies
    1. హనుమంత రావు గారు చాల సంతోషండి మీకు నా బ్లాగు నచ్చినందుకు. నేను మీ కాశియాత్ర విశేషాలను చదివాను అండి. నేను కాశి వేళ్ళెటప్పుడు మీ బ్లాగు నా బాగ ఉపయోగపడుతుంది.

      Delete
    2. హనుమంత రావు గారు చాల సంతోమండి. మీకు నా బ్లాగు నచ్చినందుకు. సరే అండి నా మీగత పోస్ట్ లను కూడ చూసి చెప్పండి.

      Delete
  6. రాజా చంద్రగారు,, దగ్గరుండి.. చెయ్యిపట్టుకుని... అన్నీ వివరంగా చూపిస్తున్నారా అన్నంత అందంగా.. ఆనందంగా ... సవివరంగా... సచిత్రంగా కంచి చూపించారు... చాలా సంతోషం... మీ కృషి అభినందనీయం... మీ ఇతర పోస్ట్ లు చూసి మరల ప్రస్తావిస్తాను.. అంతవరకు ఈ కథ కంచికి వెళ్ళినా మనం ఇంటికి వెళ్ళం....

    ReplyDelete
  7. Hello sir

    eppudo twenty years back choosa malli aa darshana bhagyam kalpincharu
    Dhanyavadamulu
    Sri

    ReplyDelete
  8. Devotional trip presented very nice...!

    ReplyDelete
  9. Hi Raja Chandra
    Excellent work. I wish u good luck for ur further posts.
    :)

    ReplyDelete
  10. Hello Raja gaaru,
    We are planning to visit Kanchi and your post is very very useful for us..:-) Excellent pics and good narration..:-) Thanks..:-)

    ReplyDelete
  11. మీ వ్యాసం వర్డ్ లో పేస్ట్ చేసి, ప్రింట్ తీసుకుని పట్టుకు వెళ్తున్నాను. 33 పేజీలు వచ్చింది :)
    ఇంత వివరంగా రాసినందుకు కృతఙ్ఞుడను.

    ReplyDelete
  12. చాలా ఆలస్యంగా మీ టపా చదివాను. కంచి విశేషాలు సవివరంగా చెప్పారు. ధన్యవాదాలు. మేం కంచి మూడు పర్యాయాలు వెళ్ళాం. ఈ నెలలోనే, అంటే తే 27.6.2012 దీన మూడోసారి వెళ్ళి వచ్చాము. ఈ సారి పీఠాధిపతుల దర్శన భాగ్యం లభించింది. కంచిలో మనకు ఆటో వాళ్ళు చూపించే నాలుగు దేవాలయాలనే చూసాం, ఈ మూడు సార్లూనూ. చూడ తగినవీ, మిక్కిలి ప్రాచీనమయినవీ, ప్రశస్తమయినవీ ఆలయాలు కంచిలో మేమూ అందరిలాగే మిస్ అవుతున్నామని తెలిసి చాలా విచారించాము. మీ టపా ఈ నెల మొదటి వారంలో చూడడం తటస్థించినా, మీరు పేర్కొన్న ఆలయాలన్నీ చూసి ఉండే వారం కదా అనిపించింది. ఈ సారి తప్పక చూస్తాం. మంచి వివరాలు ఫొటోలతో అందించి నందుకు మీకు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. Jogarao garu .. ee sari vellinappudu chusirandi.. Thank you andi.

      Delete
  13. Nenu ippadidaka chudaledu meeru cheppina places.. kani chudalanipistondi.. ento baga chepparu.. chubincharu.. nijanga Hatsoff!!!! Inta time teesukuni, inta vivaranga cheppadam chala great andi.. Thanks chepthe saripodu..

    ReplyDelete
  14. Thank You sir Rajachandra garu.
    Ee Saari Kanchi vedithe meeru cheppinattu choodavalasinde.

    CA Srinivas KVS
    Vijayawada

    ReplyDelete
    Replies
    1. Srinivas garu Tappkunda chusirandi.. Thank you andi

      Delete
  15. Interesting.. keep adding posts!

    ReplyDelete
  16. Raja Garu,
    chala bagundandi..Thanks for sharing
    Regards,
    phaniram.K

    ReplyDelete
  17. thanks a lot for sharing information

    ReplyDelete
  18. thnks alot for sharing information

    ReplyDelete
  19. chala bagundi thanks for sharing.............




    ReplyDelete
  20. Raja Chandra Garu,
    Wonderful services you are rendering to the bakthikoti through this BLOG. Nicely designed and well covered classified information. It is also very much useful to the regular visitors.Thanks for taking me mentally to all the temples in kanchipuram. I am here with attaching a google Map' link
    https://maps.google.co.in/maps?hl=en&ie=UTF-8&q=kanchipuram+temples&fb=1&gl=in&hq=temples&hnear=0x3a52c2f7e0c7f12d:0xde5f8682b1cb2a4d,Kanchipuram,+Tamil+Nadu&ei=gULDUMffN4_QrQfPt4D4AQ&ved=0CK8BELYD


    ReplyDelete
    Replies
    1. Sivaprole Bala Tripura Sundari Sadanam Garu Thank You andi..

      Delete
  21. Your info is so effective.i too visiting Tiruvannamalai and Kanchi.Can u provide will there be direct buses from Arunachalam to kanchi.

    ReplyDelete
    Replies
    1. Namaste andi.. Naku sariga teliyadandi.. ee sari vellinappudu telusukuni miku teliyaparustanu

      Delete
  22. Chandra garu,

    Chala adbhutam ga undandi mee blog. nenu kanchi vellalani eppatinicho anukuntunnanu, kani inka ammavari daya kalugaledu. kani aa ammavaru meelo undi ippudu manasikamga darsanam chese bhagyam kalpinchindi.

    chala thanks andi.

    ReplyDelete
    Replies
    1. Devi Garu Thank you andi... Miru tvaralone ammavari darsnam cheyalani Korukuntunanu

      Delete
  23. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  24. intha goppa ga Kanchhepura viseshalanu goppatananni maku teliyachesinanduku ,,meku runa padi vuntanu ..tappakunda kancheepuranni akkada unna annni kovelalani marokkasari darshinchukune bagyam ivvalani bhagavathundi korukuntanna ....hara hara shankara...

    ReplyDelete
    Replies
    1. Bharadwaj Garu chala santosham andi.. miru tvaralone velli ammavari darsnam cheskovalani korukuntunanu

      Delete
  25. ayya.. photo lu annee kanapadatledu.. konchem dayachesi annee photolu blog lo display ayyela chudandi..

    thanks

    ReplyDelete
  26. Dear Sir, Very nice collection of photos. Are you visited Srisailam ? If so, please share its photos and send to my mail ID : bmr1234@gmail.com. Regards : Maruthi Ram, Vizag

    ReplyDelete
  27. Namaste andi Sai garu nenu Srisailam vellaledandi inka..

    ReplyDelete
  28. మీ ప్రయత్నం అమోఘం..............

    ReplyDelete
  29. chala chala bagundi.nenu 2019 lo kaustaanu mimmmalni.

    ReplyDelete
  30. chala baagundi..
    very use ful information..
    Keep it up sir...

    ReplyDelete
  31. excellent job.... thank u so much...

    ReplyDelete
  32. chala chakkaga vivarincharu memu kanchi velithe me blog baga upayogapaduthumdi danyavadamulu

    ReplyDelete
  33. chala chakkaga vivarincharu...

    ReplyDelete
  34. చాలా బాగుంది.

    ReplyDelete
  35. రాజు చంద్ర గారు కంచి విషేషాలు చాలా వివరంగా చెప్పారండీ
    కంచి చూసినంత ఆనందం కలిగిందంటే నమ్మండి!
    FaceBook లో మీ Blog link చూసి ఇలా మీ బ్లాగు దర్శించుకోవడం జరిగింది
    any way మళ్ళి మళ్ళి Thanks చెపుతూ ఇంకోమారు తిరుపతి..మరియు..తిరుత్తరిణి గురించి తెలుసుకొంటాను
    శ్రమతీసుకొని మాతో share చెసుకొన్నందుకు కృతజ్ఞతలతో___/\___

    ReplyDelete
  36. అబ్భా...చదువుతుంటే గుండె ఝల్లు మంది ఒక్కక్షణం పద్మిని గారు!!!
    నిజమే నమ్మిన వారిని చెయి వదలనివదలని కన్నయ్య మన సాయికన్నా
    రెండుసార్లు ప్రమాదాన్ని కాపాడి తన (సాయినాధ) అక్కున చేర్చుకొన్న
    మీరు ఎంత ధన్యులో చెప్పలేను
    సదా ఆ స్వామి కృప మీకు మరియు
    మనకందరికీ ఆశీస్సులుగా ఉండాలని ఆ సాయినాథుని కోరుతు సెలవ్ మరి __/\__


    ReplyDelete
  37. sorry ekkado post cheyaboyi meeku post chesaanu kshaminchandi

    ReplyDelete
  38. raja chandra ji, thanx a lot. detailed route & explaing how to darshan gods corectly. i'm also a traveller for Piligrimage, i wanna share some other locations among india & nepal to u. plz mail me how can i share pix & matter with u. thanx a lot
    urs emmess reddy

    ReplyDelete
  39. శ్రీ రాజాచంద్రగారికి నమస్కారములు. మీరు దేవాలయముల వివరములు ఎంతో బాగా తెలియజేస్తున్నందులకు మీ నా ధన్యవాదములు తెలుపుతున్నాను.

    ReplyDelete
  40. ma papa peru sreekaanchi andi.daani artahnni chala baga vivrincharu

    ReplyDelete
  41. 2010 lo nenu kanchi vellanu kaani anni temples chudalekapoyanu.........kaani mee valla mottam kanchi temples anni malli okasari chusanu...avunu kanchi lo chitraguptuni temple undaali daani gurinchi yemi rayaledu ? ..........thq..raja chandra gaaru...

    ReplyDelete
  42. ఆర్య భవదీయుడు కాంచీపురం బాల్యం నుండి ఒక పాతిక సార్లు వెళ్ళాను కాని మీరు ఇచ్చిన వివరాలు చూసి మాకు చాల ఆనందాన్ని కలిగించాయీ ధన్యోస్మి ఇట్లు బాలసుబ్రమణ్యం పెరుగు

    ReplyDelete
  43. Thank you very much for giving valuble information.actually i want to go kanchi but i have no idea.so,this is very useful to me.Thanks alot.

    ReplyDelete
  44. కంచి దర్శనం చేయించినందుకు చాలా సంతోశం సర్ !

    ReplyDelete
  45. కంచి దర్శనం చేయించినందుకు చాలా సంతోశం సర్ !

    ReplyDelete
  46. Rajachandra garu,
    Great effort and good job in giving a detailed info in regards Kanchi and its surrounding temples. I appreciate your effort and help to all the Hindus who are planning to visit Kanchi.

    God bless you with good health and longevity.

    Regards
    Ravi Kalepu

    ReplyDelete
  47. raja chandra garu kanchi gurunchi super ga chepparu inni gudulu chusi makosam chakkaga photos teesi em pedutunnaru nizamga mimmalni maku ivannee chupinchadaniki puttinchademo anipistondi thank u ma bava america lo unnadu mee gurunchi cheppanu chusi chala happy feel ayyadu ala mee peru marmogipotondi chusara

    ReplyDelete
  48. బాబు రాజాచంద్ర కంచి వేల్లినప్పతికంటే నీ పోస్ట్ లోనే ఎక్కువ ఆనందం పొందానయ్య

    ReplyDelete
  49. sir.photos and description both r very gud. we have learnt a lot about KANCHI.without seeing it.
    nxt time wenever we go we need not have to ask anyone. with ur descriptio we can directly visit them... THANK U .

    ReplyDelete
  50. రాజ....... తపకుండ కంచి వెళ్తాను... కంచి వెళ్తే నువ్వే గుర్తుకువస్తావు

    ReplyDelete
  51. chandrasekhara saraswathi swamy vari tejassu ippatiki brundavanam lo chudochhu annaru kada ela?

    ReplyDelete
  52. Rajagaru~meeku dhanyavaadamulu,,,,aa thalli krupa deeveynalu manandaripaina menduga vundaalani aasisthu~mee prayathnaaniki chaala vandanaalu,Almighty bless you <3

    ReplyDelete
  53. This comment has been removed by the author.

    ReplyDelete
  54. Thank you so much for sharing the valuable information.

    ReplyDelete
  55. Thank you so much for sharing wonderfull information sir

    ReplyDelete
  56. Thank you for your information”

    ReplyDelete
  57. Raja Chandra Gaaru Meeru Chala Baagaa Temples Gurinchi Explain Chestunnaru Sir, Naaku chala Santhoshamga Undi sir Meeku chala Dhanyavadamulu

    ReplyDelete
  58. Thanks for giving valuable information.., very thanksfull

    ReplyDelete
  59. Please do not think I am silly. It would have y helped everyone if you had given information about Kanchi silk sarees and where to buy them

    ReplyDelete
  60. Awesome raja Garu nice job Manchi chesaru Manchi jarguthadi thank you all is well

    ReplyDelete
  61. Sir,
    Nenu 3,4 saarlu kanchiki Ammavaru, swamy, varadarajaswamy devalayalaku vellanu kaani purthigaa theliyadu.. chaala thanks...

    ReplyDelete
  62. nijam ga sir chala bagundi mee post.. i liku .

    ReplyDelete
  63. చాలా వివరాలు అందించారు మీకు ధన్యవాదాలు

    ReplyDelete
  64. Recently we visited kanchipuram, but we missed so many temples, after reading your article we are planning to go Kanchipuram once again RajaChandra garu.

    ReplyDelete
  65. Hello, Your Article is so impressive and very informative. Thanks for sharing great Information. I am now a regular visitor to your website and commenting it. Great Job Keep It Up!
     Bharat Taxi
    For car rental services Contact-+91 9696-000-999

    ReplyDelete
  66. చాలా చాలా సంతోషం సర్.. చాలా వివరంగా తెలియచేసారు ధన్యవాదాలు.. మా కుటుంబంతో కలిసి ఈ నెలలో ప్రయాణం ఏర్పాటు చేసుకున్నాను.. వివరాలు కోసం వెతుకుతున్న సందర్భంలో ,, కామాక్షి అమ్మే చూపించినట్లు ,, మీ అనుభవ సారాంశం.. ఇక నిర్భయంగా ,, నిస్సంకోచంగా ,, దర్శనానికి సిద్ధం కావచ్చు.. మరొకసారి మనఃపూర్వక ధన్యవాదాలు..

    ReplyDelete
  67. if any-one needs Cheap pickup and drop service like
    Pickup and drop in lucknow

    ReplyDelete
  68. Nice article, thanks for this informative post. Plan your vacation to India with Treasure Trip India. It will provide Golden Triangle India tour packages at an affordable cost.

    ReplyDelete
  69. I really like it. It’s very helpful for everyone. Very Amazing and Interesting blog. Thanks for sharing...
    Best taxi service in Jaipur

    ReplyDelete
  70. Great and Informative Content thanks For Sharing with us
    Cab Service in Jodhpur

    ReplyDelete
  71. This comment has been removed by the author.

    ReplyDelete
  72. Such a amazing blog, thanks for sharing very useful content....
    Taxi Service in Jaipur

    ReplyDelete
  73. Such a great blog, thanks for sharing very useful content....
    Taxi Service in Jodhpur

    ReplyDelete
  74. We are the one of the best taxi service in Jodhpur. You can hire ac etios at lowest fair at just rs: 2200.

    ReplyDelete
  75. Are you planning a group outing, family trip, or corporate event ? Make your journey memorable and hassle-free by hiring a Tempo Traveller from TEMPO TRAVELLER INDIA. We offer a fleet of well-maintained vehicles to cater to all your travel needs.
    Tempo Traveller in Gurgaon
    Tempo Traveller in Ghaziabad
    Tempo Traveller in Noida
    tempo Traveller in Faridabad

    ReplyDelete
Previous Post Next Post