పార్థ సారథి దేవాలయం చెన్నైలోని ట్రిప్లికేనులో కలదు. సంస్కృత భాషలో పార్థసారధి అంటే పార్థుడు = అర్జునుడు యొక్క సారథి = రథాన్ని నడిపినవాడు అని అర్థం అంటే శ్రీ కృష్ణుడు.
బీచ్ కి దగ్గరలోనే కలదు .Triplicane రైల్ స్టేషన్ లో దిగితే చాల దగ్గర . లేదా బస్సు లో ఐతే క్రికెట్ స్టేడియం దాటినా తరువాత 2వ స్టాప్ .. అక్కడ దిగితే మీకు ఈ ఎంట్రన్సు కనిపిస్తుంది .
ఆళ్వారులచేత పాడబడిన 108 దివ్య స్థలములలో " తిరువళ్ళిక్కేణి" కూడా ఒక దివ్య స్థలము . ఈ పుణ్యక్షేత్రాన్ని " బౄహదారణ్య " క్షేత్రం అనే పేరుతో పిలుస్తుండే వారు .ఈ దేవాలయము 1000 సంవత్సరములకు ముందే నిర్మిచబడింది . దేవాలయమందున్న శిలలేఖములవలన ఈ క్షేత్రమును నందివర్మ అనే పల్లవరాజు (779 - 830 ) మరియు విజయనగర రాజైన వేంకటపతి మహారాజు (1586 - 1616 ) మొదలైన మహారాజుల పాలనలో ఉండేదని తెలుస్తుంది . ఈ దివ్య మందిరము యొక్క మూలవిరాట్టు శ్రీ పార్ధ సారధి స్వామి యొక్క నిలువెత్తు విగ్రహము దర్శనం ఇచ్చును . స్వామి వారు ఎడమ భాగము నందు "పాంచజన్య శంఖము " కనిపించును . దక్షిణ భాగమున శ్రీ చక్రము కాకుండా హస్తము పదము వైపు చూపించెను. స్వామి వారు తూర్పు దిక్కున చూస్తున్నట్లు దర్శన మిచ్చును .స్వామి వారి భార్య రుక్మిణి ,అన్న బలరాముడు, తమ్ముడు సత్యకి కుమారుడు ప్రద్యుమ్నుడు , మనుమడు అనిరుద్ధుడు మొదలుగువారి సమేతంగా పార్ధ సారది దర్శన మిచ్చును . ఈయన మరో పేరు " వెంకట కృష్ణ "
ఇక్కడో విషయం చెప్పాలి మీకు .. మీకు తిరుపతి తెలుసా ? ద్వారక తిరుమల కాదండి . మరొక తిరుపతి ఉంది. సామర్లకోట దగ్గర లోనే తిరుపతి (దివిలి నుంచి 2కి.మీ.) ఉంది . అక్కడ కూడా స్వామి వారు . కుడి చేతిలో శంఖము , ఎడమ చేతిలో చక్రము పట్టుకుని మనకు దర్శనము ఇస్తారు . అక్కడ స్థల పురాణం ప్రకారం ధౄవునికి స్వామి వారు అక్కడే దర్శనం ఇచ్చారంట . స్వామి వారు ధౄవున్ని చూస్తూ నవ్విన నవ్వు మనకి చాల స్వష్టంగా కనిపిస్తుంది.
మహాభారత యుద్ధము నందు ధ్రమసంస్తపనము చేయుటకై మహారధి భీష్ముని బాణాలు పార్ధసారధి యొక్క కపాలమున గుచ్చుకున్నవి కనిపించును . ఉత్సవమూర్తి నందు ఈ గుర్తులు కనిపించవు .ఈ ఆలయం లో తెలుగు ఎక్కువగా కనిపించును ..
శ్రీ విష్ణు సవాస్రనామ స్తోత్రము |
పై ఫోటో లో తెలుగు పేర్లు చూసారా ? మీకు క్రింద కనిపిస్తున్నది స్థలపురాణం నేను పైన రాసింది అంత ఈ బోర్డు చూసే
కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది
* ఈ దేవాలయ ప్రాంగణములో ఉన్న అనుబంధ గుళ్ళు
* వేదవల్లి గుడి
* రంగనాథ స్వామి గుడి
* శ్రీరాముని గుడి
* వరదరాజస్వామి గుడి
* నరసింహ స్వామి దేవాలయం
* ఆండాళ్ళమ్మ గుడి
* అంజనేయ స్వామి దేవాలయం
* అళ్వార్ల సన్నిధి
* రామానుజాచార్యుల సన్నిధి
* భృగు మహర్షి గుడి
ఆలయం వెలుపల కేనేరు కలదు .. చాల సువిశాలంగా ఉంది .
మీరు ఈ ఆలయం లో వేదవల్లి గుడి,రంగనాథ స్వామి గుడి, శ్రీరాముని గుడి, వరదరాజస్వామి గుడి, నరసింహ స్వామి దేవాలయం, ఆండాళ్ళమ్మ గుడి , అంజనేయ స్వామి దేవాలయం , అళ్వార్ల సన్నిధి, రామానుజాచార్యుల సన్నిధి, భృగు మహర్షి గుడి కలవు .
* అమరనాథ్ యాత్ర విశేషాలు
http://sujathathummapudi.blogspot.in/2012/05/blog-post_30.html
* అమరనాథ్ యాత్ర విశేషాలు
http://sujathathummapudi.blogspot.in/2012/05/blog-post_30.html
you are a great person. I donot have words to praise you sir.
ReplyDeletegovind
స్వామి వారు ఎడమ భాగము నందు "పాంచజన్య శంఖము " కనిపించును . దక్షిణ భాగమున శ్రీ చక్రము కాకుండా హస్తము పదము వైపు చూపించెను.-
ReplyDeleteకుడి చేతిలో శంఖం వుంది. ఎడం చేయి పాదాన్ని చూపుతోంది.
chalaa manchi viseshalu vrasaru.intresting.
ReplyDeleteనా బ్లాగుదర్శనం చేసినందుకు కృతజ్ఞతలు.
ReplyDeleteraja, very nice&useful feed back to piligrams&travellers.keep it up.
ReplyDeletevery good
ReplyDeleteమంచి ప్రాంత, పుణ్య స్థలాలను మీరు పరిచయము చేస్తున్నారు,
ReplyDeleteరాజాచంద్రగారూ!
"కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల
మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు.
చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది"
Nice objervation@
కాదంబరి (konamanini.blaag)
;
రాజా చంద్ర గారు, మీ బ్లాగ్ గురించి ఈ రోజిలా తెలుసుకోగలగడం భలే సంతోషాన్నిస్తోంది. మీలానే ప్రయాణాలను ఇష్టపడే మరొక ప్రాణిని కనుక, మీరెంత శ్రమకోర్చి ఈ వివరాలన్నీ రాశారో అర్థం చేసుకోగలను.
ReplyDeleteనేను ఇకపై వెళ్ళబోయే ప్రాంతాల గురించి మీ బ్లాగ్‌లో రాసారేమో చూసుకుని వెళతాను. బ్లాగ్ నచ్చినా, మీరు రాసిన వివరాలు ఉపయోగపడినా, కామెంట్ రాయమని ఉంది. ఆ లెక్కన మీ ప్రతి పోస్ట్‌కీ అభినందన వ్రాయవలసి ఉంటుంది.
Thank you so much for all your efforts!
Really great site sir..!
ReplyDeleteCHAALA BAGA UNNADI. MEMU IKKADE VUNDI ANNI OORLU YATRA CHESAAMU. E PUNYAM MOTTAM MEEKE VASTUNDI RAJA CHANDRA GARU.
ReplyDelete