Kurumurthy Temple Information ( Venkateswara )

కురుమూర్తి దేవస్థానం ( వేంకటేశ్వరస్వామి) : (మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట )
ఆత్మకూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన ఏడు కొండలపై ఉన్న కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం క్రీ.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు.
అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య వెలసిన స్వయంబువంపై లక్ష్మి సమేతంగా వెలిసిన స్వామివారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు.
తిరుమలకు కురుమూర్తికి పోలికలు:
*తిరుపతి లోలాగే ఇక్కడా విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు.
*తిరుపతిలో వలె ఇక్కడ కూడా ఏడు కొండల మద్య వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు.
*తిరుపతిలో వలె ఇక్కడా స్వామి నిలుచున్న భంగిమలో ఉన్నాడు.
*తిరుమల కు మెట్లపై వెళ్ళేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి
*కురుమూర్తి దర్శనానికి వెళ్ళ్తున్నప్పుడు మోకాళ్ళ గుండు ఉంది.
*శేషశైలంలో స్వామి వారికి అలిపిరి మండపం లాగే ఇక్కడ ఉద్దాల మండపం ఉంది.


కురుమూర్తి దేవాలయానికి చేరు విధానం :
*జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. *మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు *కురుమూర్తి రైల్వేస్టేషన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
*7 వ నెంబర్ జాతీయ రహదారి పై ఉన్న కొత్తకోట నుంచి కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Post a Comment

Previous Post Next Post