కపిల తీర్థం:
7-4-2013
తిరుమల కొండల్లోని ఔషధ
వృక్షాల నడుమ ప్రవహిస్తూ వచ్చి కపిల తీర్థం దగ్గర కొండ మీద నుంచి
పుష్కరిణిలోకి జాలువారుతుంది నీరు. ఈ నీటిలో స్నానాలు చేస్తే సర్వరోగాలు
నశిస్తాయని నమ్మకం .
స్థలపురాణం:
వెంకటాచలం క్షేత్రంలో
సుమారు 15 పుణ్యక్షేత్రాలున్నాయి. ఇందులో ప్రధానమైనది కపిల తీర్థం. ఇక్కడ
శివలింగం పాతాళం నుంచి పెరుగుతూ భూమిని చీల్చుకుని పైకి వచ్చింది. దీనిని
గుర్తించిన మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేశారు. మహావిష్ణువు దానిని పెరగకుండా
నిరోధించాడు. కపిల మహర్షి ఈ శివలింగాన్ని తొలిగా పూజించాడు.
మహాలింగంతోపాటు పాతాళలోకంలోని భోగవతి గంగ కూడా భూమి మీదకు ఉబికింది.
పుష్కరిణిగా మారింది. అదే కపిల తీర్థం.
ఎలా వెళ్ళాలి ?
తిరుపతి రైల్వే
స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది. బస్టాండ్ నుంచి మూడున్నర
కిలోమీటర్లు. అన్ని రోజుల్లోనూ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు
అనుమతిస్తారు. కార్తీకమాసం, ముఖ్యంగా పౌర్ణమి రోజు భక్తులు ఎక్కువగా
వస్తారు.
దేవస్ఠానం వారి ఉచిత బస్ శ్రీనివాసం, కపిల తీర్థం, అలిపిరి మరియు
శ్రీనివాస మంగాపురం మీదగ శ్రీవారి మెట్టు వెళ్తుంది. కపిల తీర్థం
మరియు శ్రీనివాస మంగాపురం వెళ్ళి దర్సనం చేసుకొందాం అనుకొంటే బస్ దిగి
దర్సనం చేసుకొని తర్వాత వచ్చే బస్ లో శ్రీవారి మెట్టు వెళ్ళవచ్చు.
www.templeinformation.in
తిరుమల లో అంగప్రదిక్షణ :
వేంకటేశ్వరునికి సుప్రబాత సేవ అయిన తరువాత భక్తులను అంగప్రదిక్షణకు
అనుమతినిస్తారు .స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా ..
అనుభూతిని ఎలా వర్ణిస్తాం .
1. తిరుమల కొండపైన (తిరుమల అంటేనే స్వామి
వారి కొండ .. తిరుపతి అంటే క్రింద ఉన్న ఉరు ) ఉన్న C.R.O ఆఫీసు కు ఎదురుగా
ఉన్న బిల్డింగ్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అంగప్రదిక్షణ టికెట్స్ ఇస్తారు .
2. అంగప్రదిక్షణ టికెట్స్ ముందుగ వచ్చిన 700 మందికి మాత్రమే ఇస్తారు .
అంగప్రదిక్షణ స్త్రీలు , పురుషులు ఇద్దరు చేయవచ్చు . మరీ చిన్నపిల్లలకి
టికెట్స్ ఇవ్వరనుకుంట .
3. 1.30 లోపు సుఫదం దగ్గరకు మీరు రవాలని మీకు ఇచ్చిన టికెట్ మీద ఉంటుంది . మీరు 1am లోపే అక్కడ ఉండండి .
4. స్వామి వారి పుష్కరిణి లో స్నానం చేసి తడిబట్టలతోనే సుపధం దగ్గరకు
వెళ్ళాలి ( సుపధం అంటే స్వామి వారి గుడి కుడివైపు న ఉంటుంది . అక్కడ ఎవరైనా
చెబుతారు .
5. అంగప్రదిక్షణ టికెట్స్ ఉచితంగానే ఇస్తారు . మీరు టికట్ కి మధ్యాహ్నం 12 గంటలకు నిలబడితే మీకు టికెట్ దొరికే ఛాన్స్ ఉంది .
6. అంగప్రదిక్షణ చేసినవాళ్ళకి ఒక లడ్డు ఇస్తారు ( 10/-) . మీరు డబ్బులు కూడా తీస్కుని వెళ్ళండి .
7. దర్శనం చాల త్వరగా అవుతుంది . అంగప్రదిక్షణ అయినతరువాత మీకు స్వామి వారి దర్శనం కూడా ఉంటుంది .
8. అంగప్రదిక్షణ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ఉంటే మంచిది . మామోలు
ప్యాంట్ కూడా అనుమతినిస్తున్నారు . బనియన్ ఉంచుకోకూడదు . ముందుగా స్త్రీలను
తరువాత పురుషులను అంగప్రదిక్షణ చేయిస్తారు .
9.స్వామి వారి దర్శనం అయ్యాక మనం బంగారు బావి దగ్గరకు వస్తాం కదా అక్కడనుంచి స్వామి వారి హుండీ వరకు అంగప్రదిక్షణ చేస్తాం .