Kollur Mookambika

మూకాంబిక క్షేత్రం - కొల్లూర్ - | Kollur Mookambika Temple Information
 శ్రీ మోహన్ గార్కి కృతజ్ఞతలు తెలియచేస్తూ .. ఆయన రాసిన పోస్ట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ..


రెండవ రోజు ఉడిపిలో ప్రాతఃకాల నిర్మాల్య పూజ చూసిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం బయలుదేరి కొల్లూర్ మూకాంబికా క్షేత్రానికి వెళ్ళాము. కొల్లూరు చేరేసరికి సాయంత్రం నాలుగు అయ్యింది. అయితే అక్కడికి వెళ్ళాక మాకు దేవస్థానం వారి కాటేజీలలో కానీ, ప్రైవేట్ హోటళ్ళలలో కానీ ఎక్కడా బస దొరకలేదు, కారణం అప్పటికే పది రోజుల క్రితం నుంచీ అక్కడ వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి, మాకు ఈ విషయం ముందుగా తెలియదు. మేము ఆ ఊరు చేరుకునేసరికే చాలా మంది వందలలో కాదు వేలలో ఉన్నారేమో జనాలు ఉన్నారు. అదృష్టవశాత్తు మేము ఇన్నోవాలో వెళ్ళాము, కాబట్టి ఇంక బస దొరకకపోయినా పర్వాలేదులే, ముందు అమ్మవారి దర్శనం చేసుకుని బయలుదేరదాము అనుకుని దర్శనానికి వెళ్ళిపోయాము.
Inline image 1

ఇక కొల్లూరు మూకాంబికా అమ్మవారి క్షేత్రం చాలా చాలా శక్తివంతమైనది. ఇక్కడ అమ్మవారు శివలింగ రూపములో దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న అమ్మ ముగురమ్మ మూలపుటమ్మకి ప్రతీక. ఈ మూకాంబికా అమ్మవారిని ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్టించారు. మేము వెళ్ళిన రోజున ఆలయం ఎదురుగా చాలా పెద్ద రథోత్సవం ప్రారంభం కానుంది. అంత పెద్ద రథం లాగడం నేను ఎప్పుడూ చూడలేదు. కాకపోతే, ఓ ప్రక్క మాకు కొల్లూరు లో ఉండడానికి బస దొరకకపోవడం, మరో ప్రక్క, అక్కడ చాలా మంది భక్తులు ఉండడంతో, మా చి.శ్రీవల్లి (మూడో నెల జరుగుతోంది..) మరీ చంటి తల్లి కదా.... ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని చాలా త్వరగా దర్శనం చేసుకుని వచ్చేశాము. తీరికగా కాస్సేపు కూర్చుని ఓ స్తోత్రం చదవడమో లేక ధ్యానం చేయడమో కూడా వీలుపడలేదు. ఆ విధంగా అమ్మవారి దర్శనం చేసుకుని, వెంటనే అదే కారులో మేము శృంగేరీ వెళ్ళాము. ఇలా జరగడం వల్ల, మేము శృంగేరీలో మూడు రోజులు ఉందామనుకున్నది, మొత్తం నాలుగు రోజులు ఉండే అవకాశం లభించింది. పోనీలే.. ఈ విధంగా కొల్లూరులో ఉన్న మూకాంబికయే, శృంగేరీలో ఉన్న శారదా అమ్మ దగ్గర, జగద్గురువుల సన్నిధాల దగ్గర ఎక్కువ సేపు గడపమని హడావిడిగా పంపించేసింది అనుకున్నాము.

కొల్లూరు మూకాంబికా క్షేత్రం యొక్క వైభవం - అంతర్జాలంలో సేకరించినదిః

కొల్లూరు కర్నాటకలోని కుందాపూర్ తాలూకాలో ఒక చిన్న కుగ్రామం. యాత్రికులకు ఈ స్ధలం ఎంతో ప్రత్యేకమైనది.  నిరంతరం గల గల పారే సౌపర్నికా నది  ఒడ్డున పడమటి కనుమల నేపధ్యంలో చక్కటి ప్రకృతి అందాలతో అలరించే ప్రదేశం కొల్లూరు. అక్కడి దేవాలయం ఆ ప్రదేశానికి మరింత పవిత్రతను, ప్రాముఖ్యతను సంతరించి పెట్టింది. మహర్షి పరశురాముడు ప్రఖ్యాత మూకాంబిక దేవాలయాన్ని సృష్టించాడని పౌరాణిక గాధలు చెపుతాయి.

మూకాంబికా దేవాలయం, దేశంలో పేరొందిన మత పర కేంద్రాలలో  ఒకటిగా విలసిల్లుతోంది. శక్తి దేవస్ధానంగా పూజించబడుతోంది. మాత పార్వతీ దేవి మూకాసురుడనే రాక్షసుడిని ఇక్కడ వధించిందని, అందుకుగాను ఈ ప్రదేశానికి మూకాంబిక అనే పేరు వచ్చిందని చెపుతారు. దేవాలయంలో  జ్యోతిర్లింగం ప్రధానంగా ఉంటుంది. ఈ జ్యోతిర్లింగానికి బంగారు గీత అంటే స్వర్ణ రేఖ మధ్యగా ఉంటుంది. లింగానని రెండు  భాగాలుగా చేస్తుంది. చిన్న భాగం బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తుల శక్తిగాను, పెద్ద భాగం  శక్తి దేవతలైన సరస్వతి, పార్వతి, లక్ష్మీ లను చిహ్నంగా చూపుతుంది.
అందమైన దేవి మూకాంబిక లోహ విగ్ర హం జ్యోతిర్లింగ వెనుక భాగంలో శ్రీ ఆది శంకరులవారు ప్రతిష్టించారు. ఆ దేవి ఆయనకు సాక్షాత్కరించిందని, ఆయనతో కలసి కేరళ రాష్ట్రానికి వెళ్లేటందుకు సిద్ధపడిందని అయితే ఆ దేవత తాను ఆయనను అనుసరించేముందు ఆయన వెనక్కు తిరిగి చూడరాదని షరతు పెట్టిందని, చెపుతారు.
దేవి మూకాంబిక శంకరాచార్యుల వారితో కలసి ప్రయాణించి ఆ స్ధలం వరకు చేరే సరికి శంకరాచార్యుల వారు ఆమె వస్తోందా లేదా అని వెనక్కు తిరిగి చూసే సరికి  ఆమె కాలి గజ్జెల శబ్దం ఆగిపోయిందని, షరతు మేరకు ఆమె   రావటానికి తిరస్కరించి అక్కడే ఉండిపోయిందని చెపుతారు. ఇక ఆపై శంకరాచార్యుల వారు కొల్లూరు దేవాలయంలో దేవి లోహ విగ్రహాన్ని జ్యోతిర్లింగం వెనుక భాగంలో  ప్రతిష్ట చేశారు.  
ఈ ప్రాంత సందర్శనలో మహిమాన్విత కొల్లూరు దేవాలయమే కాక, అడవిలోగల అరిశన గుండి జలపాతాలను కూడా చూడవచ్చు. జలపాత ధారలపై పడే సూర్య రశ్మి బంగారు వన్నె రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది.  కన్నడ భాషలో అరిశెన అంటే పసుపు పొడి   అని చెపుతారు.
కొడచాద్రి పర్వత శ్రేణులుదీని సమీపంలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు తపస్సు చేసి దేవి సాక్షాత్కారాన్ని పొందిన కొడచాద్రి కొండ శ్రేణులు కూడా కలవు. ట్రెక్కింగ్ అభిలాషులు తరచుగా దర్శిస్తారు. ఈ పట్టణాన్ని సాధారణంగా నవరాత్రి లేదా దసరాలలో భక్తులు అధిక సంఖ్యలో సందర్శిస్తారు.  కొల్లూరు ప్రాంతం, వైల్డ్ లైఫ్ రిజర్వులో ఒక భాగం. మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చువరి సహజ రక్షిత అడవులలో ఒకటి. దీనికి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ కూడా సహాయం చేస్తుంది. ఈ ప్రాంతంలో అబ్బురపరచే ఎన్నో లోయలు, కొండలు, జలపాతాలు ఉంటాయి.సశేషం .....


సర్వం శ్రీసుబ్రహ్మణ్యార్పణమస్తు.

How to reach Mookambika Temple - Kollur

By Road 3 hrs Approx
Mangalore city is only 50 km away from Udupi. Express buses ply between Mangalore to Udupi at regular intervals.From udupi we can reach Mookambika Temple - Kollur by bus from Udupi.
By Train
The railway station at Udupi falls on the Konkan Railway network and there are trains to most major cities of the state.From Udupi we can reach mookambika temple by bus or by taxi easily.
By Air
The nearest airport is the Mangalore airport located at Bajpe, 60 km away from Udupi. There are 2 flights daily from Mumbai,Bangalore and from other parts of India.From their we can reach Kollur Mookambika Temple by car.

Sri Mookambika Temple
Kollur - 5762200
Udupi District
Karnataka State
India
(08254) 258488, 258328, 258521, 258221

Comments

  1. Very nicely written about Kollur mookambika.Thanks for sharing the information about the Kollur mookambika.Book your bus tickets in KPN Travels

    ReplyDelete

Post a Comment