Tamilandu Temple Information Part-3

నమస్కారం

 తమిళ ఆలయాల దర్శనం మొదటి భాగం : http://rajachandraphotos.blogspot.in/2014/09/tamilnadu-tour-part-1.html


తమిళ ఆలయాల దర్శనం రెండవ  భాగం : 
http://rajachandraphotos.blogspot.in/2014/10/tamilandu-temple-information-part-2.html

తమిళ ఆలయాల దర్శనం మూడవ భాగం లోకి చేరుకున్నాం . ఇక్కడ ఆలయాలను చూస్తూ , వాటి స్థల పురాణాలను తెల్సుకుంటుంటే మరీంత ఏకాగ్రత , భక్తీ భావం పెరుగుతుంది . నిజానికి మనకి ఏమి తెలియకపోయినా ఇక్కడున్నా ఆలయాలు వాటి శక్తి చేత మనల్ని దగ్గరకు లాక్కుంటాయి . మనకు తెలియకుండానే భక్తీ భావం , ఆధ్యాత్మిక చింతన కలుగక మానదు .
ఎన్ని దేవాలయాలను ఎన్ని రోజుల్లో చూసివచ్చాం అనే దానికంటే కూడా మనస్పూర్తిగా ఒక్కో దేవాలయాన్ని దర్శించుకుంటూ వాటి విశిష్టిత లను తెల్సుకుంటు , దేవాలయాలను దర్శించడం మంచిది.
ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నా టెంపుల్ ఇన్ఫర్మేషన్ లో కొన్ని దేవాలయాల ఇన్ఫర్మేషన్ మిస్ అయిన తదుపరి పోస్ట్ లలో ఒక్కో దేవాలయం కోసం వివరంగా రాస్తానని ముందే చెప్పి ఉన్నాను .
కుంబకోణం లోని నవగ్రహ టెంపుల్స్ దర్శించి , మీమ్మల్ని కుంబకోణం లోనే ఉండమని చేప్పాను కదా . మనం ఇక్కడ నుంచి బయలు దేరుదాం .

మనం ఇప్పుడు కుంబకోణం నుంచి  స్వామిమలై   ( సోమేశ్వర టెంపుల్ ) 5కిమీ . వేల్లబోతున్నాం . 
ఏమిటి ఆ దేవాలయలం విశేషమని అడగబోతున్నారు కదా . చెప్తాను 
తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు  (అఱుపడై వీడుగళ్) ఉన్నాయి.  సుబ్రమన్యుడి నివాస స్థావరములు .

The Arupadaiveedu (six abodes) are the most important shrines for the devotees of Murugan in Tamil Nadu 

మీగత  ఆరు టెంపుల్స్ ఎక్కడ  ఉన్నాయి అనేగా ..

1. తిరుచెందూర్ : Thiruchendur
2. తిరుప్పరంకుండ్రం : Tirupparankundram
3. పళముదిర్చొళై :
Pazhamudircholai
4. పళని :  Palani
5. స్వామిమలై : SwamiMalai
6. తిరుత్తణి : Tiruttani

 
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో ఐదవది స్వామిమలై. ఈ క్షేత్రం తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో కుంభకోణం సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. 

స్వామిమలై అపారమైన జ్ఞానం. ఇక్కడ ప్రణవ రహస్యాన్ని పరమిశివుడికి చెప్పాడు సుబ్రహ్మణ్యుడు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని స్వామినాథ స్వామి అని కొలుస్తారు. స్వామినాథ అంటే గురు స్వరూపం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడినది. తరువాత స్వామి అనే పేరు వేరే స్వరూపాలు కూడా తీసుకున్నా, అన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే అని అనుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలిచినా, కేవలం స్వామీ అని పిలిచినా అది సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది అని చెప్పింది అమరకోశం. అటువంటి మహానుభావుడు స్వామిమలైలో వెలిసి ఉన్నాడు.


బస్సు  టెంపుల్ దగ్గరే ఆగుతుంది . మనకి కొండలాగా కనిపించదు ఈ గుడి . మనం ఇక్కడ నుంచి తిరువైయార్ బయలు దేరుతాం . తిరువైయర్ లో త్యాగరాజ స్వామి వారి సమాధి ఉంది . 
ఎక్కువమంది ఈ రెండు పేర్లకు కాస్త తికమక పడుతుంటారు . అవి ఏమిటంటే తిరువైయార్ , తిరువరూర్ . ఇందులో తిరువైయార్ త్యాగరాజ స్వామి సమాధి కలది . ప్రతీ సంవత్సరం ఇక్కడ త్యాగరాజ స్వామి ఉత్సవాలు చేస్తుంటారు . దేశం లో ఉన్న గొప్ప గొప్ప గాయకుల దగ్గర నుంచి అందరు వచ్చి ఇక్కడ కీర్తనలు పడతుంటారు . తిరువైయార్నుంచి తంజావూర్ దగ్గరే  13 కిమీ . 


 త్యాగరాజ స్వామి వారి ఇల్లు కూడా మీరు చూడవచ్చును ఇక్కడ






త్యాగరాజ

త్యాగరాజ సమాధి

రామదాస కీర్తనలు

Tyagaraja Swamy


తిరువరూర్ త్యాగరాజ స్వామి వారి జన్మ స్థలం . ఇక్కడ త్యాగరాజ స్వామి వారి ఆలయం కూడా ఉంది . ఇక్కడ ఉన్న సోమస్కందా స్వామి వారి ఆలయం చాల పెద్దది . మరో విశేషం ఏమిటంటే ఆలయం 20 ఎకరాలు ఉంటే కోనేరు 33 ఎకరాలు . తంజావూర్ నుంచి 66 కిమీ దూరం లో ఉంది


Thiruvarur


 ఇక్కడ నుంచి మనం తంజావూర్ వెళ్తాం .. తంజావూర్ అనగానే  బృహదీశ్వరాలయము గుర్తోకొస్తుంది . అవును మీరు బృహదీశ్వరాలయము అంటే వార్కి తెలియదు . మీరు బిగ్ టెంపుల్ అని అడిగితేనే వారు చెప్తారు . నిజంగా బిగ్ టెంపుల్ నే అది . ఇంతక ముందే ఈ బ్లాగ్ లో బిగ్ టెంపుల్ కోసం రాసాను . 
http://rajachandraphotos.blogspot.in/2014/03/thanjavur-brihadeeswarar-temple.html


మీరు చూస్తున్నది ఎంట్రన్స్ మాత్రమే .. లోపాలకి వెళ్తే 100 కళ్ళు సరిపోవు చూడ్డానికి ..  ఈ ఆలయం ప్రవేశం లో నంది ఉంటుంది . వామ్మో ఇంత పెద్ద నందా ! అనిపిస్తుంది . 

పైగా అంతా ఏకశిలా నంది . మీరే చూస్తారుగా . 

 చూస్తున్నార ? చేతులు రెండు మనకి తెలియకుండానే నమస్కరిస్తాయ్ ...



ఈ ఫోటో చూస్తున్నార ? మీకు ఈపాటికే అర్ధం అయింది అనుకుంటున్నా !
ధ్వజ స్థంబం ఎప్పుడు నంది వెనకాల ఉంటుంది కదా ..

పైగా ఈ ఆలయం లో రెండు ధ్వజ స్థంబాలు ఉంటాయ్ ..


చూసారా .. ఆలయ శిఖరం ఆకాశం లోకి దూస్కుని పోతున్నట్టు లేదు ..





మీరు చూస్తున్నది ఆలయ శిఖరం .. అక్కడ నుంచి చూసిన ఇంత క్లియర్ గ చూడలేమేమో కదా !
ఇంతకీ విశేషం ఏమిటంటే .. మరో సారి టెంపుల్ ఫోటో చూడండి .
The Brahadeewarar temple, called the Big Temple, is dedicated to Lord Siva. It was built by the great Chola King Raja Raja 1 (985 -1012 A.D). it is an outstanding exmple of Chola architecture. Recognizing its unique architectural excellence, UNESCO has declared it a World Heritage Monument.

The 64. 8 Mt. tall vimanam (tower over the sanctum sanctorum) is testimony to the engineering skill of the Cholas. In keeping with the size of the temple, it has gigantic “Mahalingam” in the shrine, measuring 4 meters in height. A monolithic Nandhi chiseled out of a single rock, measures 5. 94 meters in length, 2.51 metres in breadth and 3.66 meters in height. it is the second largest Nandhi in India. 


The Nandhi or bull is the vehicle of Lord Siva. Beautiful Chola fresco paintings adorn the inner walls of the Temple. One of the outstanding temples in South India, the Brahadeeshwarar temple is the  Chola dynast’s finest contribution to Dravidian temple architecture. What makes the construction so unique is the variation from the usual temple building style of having a tall gopuram and smaller vimanam. At the Big Temple the vimanam asoars high while the gopuram is smaller. The 64. 8m tall, 14 tier pyramid shaped vimanam raised from a square base is topped by a huge monolithic cupola carved from an 81.3 tonne block of granite. It was raised with the aid of a 6 km long inclined plane. 

తరువాతి పోస్ట్ లో శ్రీరంగం , జంబుకేశ్వరం కోసం తెల్సుకుందాం ..  
ఓం నమః శివాయ  

6 Comments

  1. Very informative and nice post, thank for share with us in Telugu language. find South India Tour Packages by Travel Hot.

    ReplyDelete
  2. Wonderful blog & good post........Vivekvedic leading Temple architect in tamilnadu and Construction Company using traditional Indian architecture.

    Temple Architect In Tamilnadu

    ReplyDelete
  3. Wonderful blog & .Very informative and nice post, thank for share with us in Telugu language.online book Ticket through Redbus

    ReplyDelete
  4. Cap-tech India launches Eforce, an online platform that connects general contractors with labour contractors and special vendors. Learn more!”

    ReplyDelete
  5. Astrologer Master Rudra Ji is the best astrologer in New York who was practicing Vedic Astrologer for the past many years.
    best astrologer in florida

    ReplyDelete
Previous Post Next Post