గుహ్యెశ్వరీ శక్తిపీఠం - Guhyeshwari Temple
మీకు తెలుసా ..?
51 శక్తి పీఠాలలో ఒకటైన “గుహ్యెశ్వరీ” శక్తిపీఠం గురించి ..? ఎక్కడుందో.. ఆ దేవి రూపం ఎలావుంటుందో..? ఇదిగో .. ఇక్కడ.. చదవి ..చూడండి ..!!
శ్రీ “గుహ్యెశ్వరీ/గుఃజేశ్వరి/గురేశ్వరి/మాహామాయ” దేవి మొదలైన పేర్లుగల ఈ శక్తిపీఠం నేపాల్ దేశంలో, కాట్మాండ్ పట్టణంలోని “బాగమతి” నది వడ్డున, “పశుపతినాథ్ దేవాలయం” దగ్గర వున్నది !!
“గుహ్యెశ్వరి” అనగా-(గుహ్య – రహస్య/రహస్యాంగ) – “ఈశ్వరి” అనగా ”దేవత”–“రహస్యాంగ దేవత” అని పూర్తి అర్దం..!
సతీదేవి “రహస్యాంగమ్”(Private Part) -“రెండు” ప్రదేశాలలో పడిందని, “మొదటి” భాగం(Outer Parts), అస్సాం రాష్ట్రంలోని, “గువా”హాతి (గౌహతి) లోని “కామాఖ్యదేవి ఆలయం” వద్ద, “రెండో” భాగం(Inner Parts) ఈ ప్రదేశంలో పడిందని ఇతిహాస కధనం..!
ఈ ఆలయం పూర్తిగా “తాంత్రిక విద్యోపాసన”కు సంబందించినది. “తాంత్రికులకు” అతి ముఖ్యమైన “ఉపాసన” స్థలంగా చెపుతారు!!
ఈఆలయం విశేషం ఏమిటంటే, ఆలయ ప్రాంగణం లోనికి “హిందూ ఏతరులకు” (అన్య మతస్తులకు) ప్రవేశం లేదు.!
పూర్వం ఈ ఆలయం ఒక చిన్న “ఖాళీ ప్రదేశంలో” వుండేది. అక్కడే నివాసముండే కొంతమంది గ్రామస్తులు మొదటసారిగా ఈ దేవిని ఆరాధించటం ప్రారంభించారు. ఆ పరిణామ క్రమంలో భాగంగా, “రాజా ప్రతాప్ మల్ల” 17 వ శతాబ్దం ప్రారంభంలో(1653) ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయం “భూటాన్ దేశ సంస్కృతికి అనుగుణంగా వారి “పగోడ” ఆకారంలో నిర్మించబడి, చూపరులకు ఆకర్షించేదిగా “వుండకపోవటం” ఆశ్చర్యంగా వుంటుంది.!
ఐతే, ఈ ఆలయ “ప్రధాన మందిరం” పుష్పమాలలతో అందంగా అలంకరించి వుండి, చూడటానికి చాలా మనోహరంగా వుంటుంది..!
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , ఇక్కడ ఆలయంలో వివాహం జరుపుకున్న జంటలు, మరో “ 6 జన్మలు పాటు” అదే “సహచర-జంట”(same couple) లుగా “పునర్జన్మలు” ఎత్తుతారని ఇక్కడి ప్రజల ప్రఘాడ నమ్మకం !
ఈ ఆలయంలో జరిగే “నవరాత్రి పండుగ”ల సందర్భంగా నేపాల్ రాజు , అతని కుటుంబ సభ్యులు కలిసి “భాగమతి” నదిలో పవిత్ర స్నానం చేసి పూజించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది !!
పెళ్ళైన వారు, తమ భర్తల ఆరోగ్యం కోసం ఇక్కడి దేవిని పూజిస్తూవుంటారు !! అలాగే “శత్రు-విజయం” కోసం కూడా ప్రార్ధనలను చేస్తువుంటారు.!!
Nice Posting of Mine.. Thanks .. for this.. Phani Prasad Yellajosyula
ReplyDelete