TIRUMALA - ALIPIRI


శ్రీనివాస గోవిందా | శ్రీ వెంకటేశా గోవిందా | భక్త వత్సల గోవిందా | భాగవతా ప్రియ గోవిందా | నిత్య నిర్మల గోవిందా | నీలమేఘ శ్యామ గోవిందా | గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

 అలిపిరి నుంచి తిరులమల నడక మార్గం  ( 20-10-12)



ఈ పోస్ట్  తిరుమల మొట్టమొదటి సారిగా అలిపిరి నుంచి మెట్లమర్గమున నడిచి వెళ్ళే వాళ్ళకోసం .
అలిపిరి చేరుకోవడం :
తిరుపతి రైల్వే స్టేషన్ / బస్  స్టాండ్  నుండి అలిపిరి కి బస్సు లు ఉన్నాయ్ . లోకల్ సిటీ బస్సు లు కూడా నడుపుతున్నారు ( టికెట్ 8/- )


మీతో పాటు తీస్కుని వచ్చిన లాగేజ్  ని అలిపిరి వద్ద ఉన్న  లగ్గేజ్ రూమ్ వద్ద  మీరు ఇచ్చినట్లైతే  మీరు కొండపైకి చేరుకున్న తరువాత మీ లగేజ్ ని కొండపైన ఉన్న లగ్గేజ్ రూమ్ వద్ద మీరు తిస్కోవచ్చును .
మీరు మీ బాగ్ లకు తాళాలు వేయకపోతే వాళ్ళు తిస్కోరు . తాళాలు బయటే అమ్ముతారు ( 15/- ) .
చాల తక్కువ బరువున్న సామాన్లు మాత్రమే మీతో తీస్కుని వెళ్ళండి . 

తిరుమల నడకదారి ప్రారంభం .. అందరు ఒక్కసారి గోవిందా .. గోవిందా అని ప్రారంభించండి 
 


శ్రీ వారి పాదాల మండపం
నారాయణాద్రి  , తిరుమల
మీరు కొండపైకి ఎక్కుతున్నప్పుడు  స్వామి యొక్క అవతారాలు   మీరు చూడవచ్చు 

 మత్స్యావతారము 

  • నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు, పరుగెత్తితే తొందరగా అలసిపోతారు.
  • సాధ్యమైనంతవరకూ మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు, కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డులాంటి దారికి వెళ్తారు, ఇక అక్కడి నుండి మోకాళ్ళ మంటపము వరకూ మెట్లు ఉండవు, ఉన్నా ఒకటీ అరా ఉంటాయి.
  • మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్లలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి. సాధ్యమైనంతవరకు గ్లూకోసు, నీళ్లు - వీటిపై ఆధారపడండి, ముఖ్యంగా కూల్ డ్రింకులు(కోక్,పెప్సీ మొ.) ఏ విధంగానూ మన నడకకు సహకరించవు.
  • నామాల కొండ వద్ద తొందరగా దైవదర్శనం అయ్యేందుకు ఇస్తున్న రశీదు తీసుకోవడం మరచిపోవద్దు. ఆ తరువాత కొంత దూరం నడిచినాక మళ్ళీ ఆ రశీదు మీద ముద్ర వేయించుకోవడం మరచిపోవద్దు.
  • లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి, లగేజిని కింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఉచిత రవాణా సేవలో పైకి పంపించండి.


గాలి గోపురం వద్ద బయోమెట్రిక్ ద్వారా వెలి ముద్రలు ఇచ్చి టోకెన్ తీస్కోండి
ఆ టోకెన్ ద్వారా మాధవ నిలయం వసతి సముదయలల్లో  ఉచిత వసతి , భోజనం అందుకోండి .
తలనీలాల సమర్పణ కూడా ఉచితం . 


తలయేరుగుండు

 కొండ ఎక్కేవారు తలయేరు గుండుకు తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు వుండవని భక్తుల నమ్మకం. శతాబ్దాల తరబడి భక్తులు ఈ గుండుకి భక్తితో తమ తలను, మోకాళ్లను తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. చిత్రంలో వాటిని చాల స్పష్టంగా చూడవచ్చు. 


తిరుమల మెట్ల మార్గం 


కూర్మావతారం 





వరాహావతారం



శ్రీ నరసింహావతారం


కొండపైనుంచి తిరుపతి 

 శ్రీ వామనావతారం

గాలిగోపురం


దివ్య దర్శన్ టోకెన్ కౌంటర్ కు దారి
 ఇక్కడే టోకెన్ తీస్కోవాలి



ఈవిధంగా ఉంటుంది  . జాగ్రత్తగా ఉంచండి. దారి మధ్యలో  ఒక చోట స్టాంప్ వేస్తారు 


కొండ క్రిందనుంచి .. కొండపైకి వెళ్ళే దారిలో చాల చోట్ల ఉచిత మరుగుదొడ్లు కలవు .




 ఇప్పడివరకూ నడివచ్చరుగా కొద్దిసేపు విశ్రాంతి తీస్కోండి  :) 


 ఇక్కడ నుంచి మెట్లు తక్కువగ  ఉంటాయి .. చూస్తున్నారుగా ఎలాఉందో దారి .




శ్రీ పరశురామావతారం



అంజనాద్రి 

 ఈ విధంగానే ఉంటుంది మార్గం ..
 నేను చెప్పింది మొత్తం మెట్లు ఉండవ్ అని కాదు .... :)
 గోవిందా ... 2300 మెట్ల వరకు వచ్చాం 
శ్రీ రామావతారం


 శ్రీ బలరామావతారం 
జింకలపార్క్ 










శ్రీ కృష్ణావతారం 



ఎవరు పెట్టారో ఇలా


 నడక మార్గం ( 6 కి.మీ.)
 బస్సు రూట్
మన యూత్  :)

శ్రీ కల్కి అవతారం 



జై హనుమాన్
 శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి




అమ్మ, నాన్న , అవ్వ 





గోవిందనామలు 



నేను చెప్పానుగా .. స్టాంప్ వేస్తారు అని .. అది ఇక్కడే .. లైన్ లైన్.. లైన్ లో వెళ్ళండి :)
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం 







ఎప్పుడన్నా వర్షం ( తూపాన్ ) పడే సమయం లో కొండ ఎక్కడానికి ప్రయత్నించండి ... 






 మంచి కెమెరా  ఐతే ఫోటోలు వేరేల వచ్చిఉండేవి 



మోకాల  పర్వతం దగ్గరలోనే  ఉంది నడవండి 





 అదిగో వచ్చేసాం .... మళ్ళి  అందరు ఒకసారి గట్టిగ గోవిందా.. గోవిందా .. అనండి 






 ఇక్కడ చాల మంది మోకాళ్లమీద నడవడానికి ప్రయత్నిస్తారు .. అల ఎందుకు నడుస్తారు నాకైతే తెలియదు
విజయమోహన్ గారు ఇలా చెప్పారు  
 "మోకాళ్ళతో ఎందుకు ఎక్కుతారంటే"
అక్కడంతా సాలగ్రామశిలామయమని భగవద్రామానుజులు మోకాళ్ళతో ఎక్కారంట అందుకని భక్తులు కొంతమంది అలా ఎక్కుతూ ఉంటారు.




గోవిందా .. గోవిందా






నారాయణాద్రి - శేషాద్రి


పోగయ్  అళ్ళారు




చెప్పానుగా నడవడం ఇంకా సులభంగా ఉంటుంది అని






గోవిందా .. గోవిందా
తిరుమంగై అళ్ళారు


ఇదే చివరి మెట్టు
 నెంబర్ ఎంత ?
పెరియ అళ్ళారు




మీరు క్రింద ఇచ్చిన లగేజి ని ఇక్కడ తిస్కోవచ్చు


సమాచార కేంద్రం






మాధవ నిలయం 



తిరుమల తిరుపతి దేవస్థానం :
1. కేవలం ఒక వ్యక్తికీ గది కేటాయించబడదు
2. గదుల కేటాయింపు 24 గంటల మాత్రమే
3. గది లోపల పర్నిచర్ ఉండదు
4. నీరు గదుల వెలుపల ఉన్న కామన్ టాప్  ద్వారా పట్టుకొనవలెను

స్వామి వారి దర్శనం కోసం వేసి ఉన్న భక్తులు .


స్వామి పుష్కరిణి లో స్నానం చేసి .. వరాహ స్వామిని దర్శించుకుని .. గోవిందుడిని దర్శించండి .


శ్రీవారి మెట్టు:

తిరుమల కొండపైకి రెండు మార్గాలున్నాయి .. 1. అలిపిరి 2. శ్రీవారి మెట్టు.
అలిపిరి కాలిబాటకు శ్రీవారి మెట్టు కు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే శ్రీవారి మెట్టు కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.
శ్రీవారి మెట్టు దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు కాలం అగస్త్యాశ్రమం లో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. నడిరేయి ఏ జామునో అలమేలు మంగను చేరడానికి దిగి వచ్చే స్వామి ఒక అడుగు ఈ "శ్రీవారి మెట్టు"పై వేసి రెండవ డుగు అలమేలు మంగాపురంలో వేస్తాడని ప్రతీతి. చంద్రగిరిని వేసవి విడిదిగా చేసుకొన్న విజయనగర చక్రవర్తులు శ్రీవారి మెట్టునుండ ఉన్న మెట్లదారిలో తిరుమలేశుని దర్శనం చేసుకొనేవారు. తన దేవేరులతో కలిసి కృష్ణ దేవరాయలు ఈ మార్గంలో అనేక పర్యాయాలు నడచి స్వామిని దర్శించుకొన్నాడు.
శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది.
కపిల తీర్థం:



తిరుమల కొండల్లోని ఔషధ వృక్షాల నడుమ ప్రవహిస్తూ వచ్చి కపిల తీర్థం దగ్గర కొండ మీద నుంచి పుష్కరిణిలోకి జాలువారుతుంది నీరు. ఈ నీటిలో స్నానాలు చేస్తే సర్వరోగాలు నశిస్తాయని నమ్మకం .
స్థలపురాణం:

వెంకటాచలం క్షేత్రంలో సుమారు 15 పుణ్యక్షేత్రాలున్నాయి. ఇందులో ప్రధానమైనది కపిల తీర్థం. ఇక్కడ శివలింగం పాతాళం నుంచి పెరుగుతూ భూమిని చీల్చుకుని పైకి వచ్చింది. దీనిని గుర్తించిన మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేశారు. మహావిష్ణువు దానిని పెరగకుండా నిరోధించాడు. కపిల మహర్షి ఈ శివలింగాన్ని తొలిగా పూజించాడు. మహాలింగంతోపాటు పాతాళలోకంలోని భోగవతి గంగ కూడా భూమి మీదకు ఉబికింది. పుష్కరిణిగా మారింది. అదే కపిల తీర్థం.

ఎలా వెళ్ళాలి ?

తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది. బస్టాండ్ నుంచి మూడున్నర కిలోమీటర్లు. అన్ని రోజుల్లోనూ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు అనుమతిస్తారు. కార్తీకమాసం, ముఖ్యంగా పౌర్ణమి రోజు భక్తులు ఎక్కువగా వస్తారు.
దేవస్ఠానం  వారి ఉచిత బస్ శ్రీనివాసం, కపిల తీర్థం, అలిపిరి మరియు శ్రీనివాస మంగాపురం మీదగ శ్రీవారి మెట్టు వెళ్తుంది.    కపిల తీర్థం    మరియు శ్రీనివాస మంగాపురం వెళ్ళి దర్సనం చేసుకొందాం అనుకొంటే బస్ దిగి దర్సనం చేసుకొని తర్వాత వచ్చే బస్ లో    శ్రీవారి మెట్టు వెళ్ళవచ్చు. 

మీ సలహాలను కూడా పోస్ట్ చేయగలరు 
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

80 Comments

  1. Super, Nakuda kalinadaka dwara aa DevaDevudini Chudalanipistondi.

    ReplyDelete
    Replies
    1. baaboy raja garu chaala thanksandi intha vivaramga evvaru cheppaleranukunta. asalu idi chaduvuthunte meme swayamga yatra chesi vachchinattundi anta vivramga undi. chala chala thanksandi.

      Delete
  2. హాయి రాజాచంద్ర గారు,
    మీ బ్లాగు ద్వారా చాలా మంచి విషయాలను మరియు ఉపయోగకరమైన వివరాలను అందిస్తున్నారు. మీ నుంచి ఇంకా మరిన్ని దేవాలయాల గురించిన వివరాలను కోరుకుంటూ..

    ReplyDelete
  3. మంచి పని చేస్తున్నారండి, ఇంకొన్ని వివరాలు రాస్తే బాగుండేదేమో....

    ReplyDelete
    Replies
    1. asale nadustu vastunnaru kada... chadavadaniki opika undademonandi :)
      Thank You

      Delete
  4. very well presented
    krishna rao

    ReplyDelete
  5. "కాలినడక దారి ప్రారంభం.. గోవిందా అంటూ ప్రారంభించండి" భలే వ్రాసావు రాజా తమ్ముడూ. నేను చిన్నప్పుడు ఎవరైనా తిరుపతి వెళుతుంటే ఆ విషయం ఆ వూరివారందరికి చెప్పకనే తెలిసేది. గోవిందా,గోవిందా అంటూ భక్తి పారవశ్యంలో తమని తాము మరచి గోవింద నామములు పారాయణం చేస్తూ వీధి వీధి తిరిగేవారు.ఈ రోజు పరిస్థితి 'అదేదో' తప్పైనట్లు 'గోవిందా' అని పలకడానికి బిడియ పడుతున్నారు.వద్దులే .. ఎక్కువగా ప్రస్తావించడం కూడా పద్దతి కాదేమోలే..

    ReplyDelete
  6. chaalaa mamchi post

    mee blog lo vihaara ane padam toligiste baagumtumdemo aalochimchamdi

    ReplyDelete
    Replies
    1. durgeswarao garu .. nenu vihara pradeshalanu kuda post chestunnanu . anduvalla vihara ani title pettanu.. thank you andi

      Delete
  7. raja chandra, nee blog choodagane nallodu gurtochaadu, nov 25 snehitudi pelli kooda undadam to mee blog choosi tkts book chesukunna....nijanga tirupathi alipiri lo nadichinatundi....thanks

    ReplyDelete
  8. Govinda Govinda Govinda

    Venkat

    ReplyDelete
  9. Excellent Rajachandra. Keep it up.

    ReplyDelete
  10. "మోకాళ్ళతో ఎందుకు ఎక్కుతారంటే"
    అక్కడంతా సాలగ్రామశిలామయమని భగవద్రామానుజులు మోకాళ్ళతో ఎక్కారంట అందుకని భక్తులు కొంతమంది అలా ఎక్కుతూ ఉంటారు.

    ReplyDelete
  11. Raja chala thanks ra chala manchi vishayalu post chesinanduku

    ReplyDelete
  12. Dear Mr Raja Chandra

    Really superb. This is truly Guide to the Piligrims, who is going to go first time to Tirupathi by walk. Really, it is a coincedence , that I want to go first time by walk along with my wife. Yesterday nite only I have booked my tickets and today morning first hour I am seeing this. God is Great. Thanks once again. Keep on posting.

    Rgds

    Prasad

    ReplyDelete
  13. చాలాబాగుంది రాజాచంద్రగారూ. నేను ఇంతమటుకూ నడవలేదుగానీ, మీ బ్లాగు ద్వారా నడిచిన అనుభూతి పొందాను.
    psmlakshmi

    ReplyDelete
  14. Raja Chandra garu,

    Chala vivaramga raasarandi. Mokali parvatham daggara salagrama silala gurinchi naaku theliyadu kaani, maa chinnappudu cheppina daanni batti, aa Mokali parvathanni atleast konni metlaina mokalla meeda ekkithe, manaku bhavishattulo ante vayasu meerekoddi vacche mokali noppulu raavu ani. Already unnavallakaithe upasamanam / nivarana kaluguthundi ani oka nammakam ata.

    Inko vishayam emitante, kaalinadakana vellevallu actual procedure ayithe munduga Tiruchaanuru or Alamelumangapuram loni ammavarini darsinchukovali. tharuvatha edukondala modatilo koluvai unna Sri Kapileswaraswami varini kuda darsinchukuni taruvatha Alipiri, padalamandapam nundi nadaka modalu pedatharu. paiki cherina tharuvatha Swamivarikanna mundu Sri Varaha Swamini darsinchukovali.

    ReplyDelete
  15. Nice maayyaa.....i felt real experience...ee sari vellinapudu i'll definetly follow this route thanks..:)

    ReplyDelete
  16. బాగుందండి. నేను వెళ్ళినప్పుడు (రెండు నెలలక్రితం) సరిగ్గా దర్శనం టోకెన్ ఇచ్చే చోటకి వచ్చేసరికి బ్రహ్మాండమైన వర్షం వచ్చింది. మీలాగే నేనూ మీగతా అన్నీ ఫొటోలు తీసాను కాని వర్షం ఫొటోతీయలేదు. మీ ప్రయత్నం, అలాగే బ్లాగులో పెట్టడం చాలా బాగుంది. బద్ధకం వల్ల నేను పెట్టలేదు.

    ReplyDelete
  17. I feel like i am in walking on the way to Lord Venkatesa !Thanks for the Post !

    ReplyDelete
  18. కాలినడకన తిరుమలకి చేరినట్టే ఉంది. చాలా వివరంగా వ్రాసారు.

    ReplyDelete
  19. chala baagundhi Raja Chandra gaaru,nenu twaralo veldamanukuntunnanu,mi suggistions naku chala useful avutayani Aashistunanu,,,

    ReplyDelete
  20. ఏడుకొండల వాడా వేంకట రమణా !!!
    గోవిందా గోవిందా !!!!
    అద్బుతం అత్యద్బుతమ్ ...
    ఎన్ని మార్లు చూచినా తనివి తీరనిది తిరుమల తిరుపతి దేవస్థానం ....

    ధన్యవాదములు ....

    ReplyDelete
  21. రాజ చంద్ర కాలినడకన వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది

    ReplyDelete
    Replies
    1. murali garu.. nadiche vallani batti untundi..
      2-3hr lo nadagalige vallu nadechevacchu.. koddiga rest tiskuni.. peddavasu vallaite maro 2hr ekkuvaga padutundi..

      Delete
  22. Govindaaaaaaaaa.......govinda...
    chala sarlu vellam kani inni temples marga madya lo vunnay ani telidu sir...
    isari malli velthunam... aa venkateswarudi daya valla ani chudali ani anukuntunam... aapina aa srinivasudi anugraham... :) chala santhosham ga vundi mi blog chusina tarvatha... :)

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. adi lakshmi gaaru.. ee sari vellinappudu miss avakunda.. darsanam chesi randi..

      Delete
  23. Namaste ,

    Its really pleasure having found this blog through mu friend Dinesh.
    I could feel that i am walking along the Edu kondalu. And i am feeling the same Happiness even reading these blog and watching the pictures. They are amaging.

    Thank you for sharing.
    Gowrisankar

    ReplyDelete
  24. No wonder, says Marc makes it so annihilating when he ignores you.
    The game of ways to get ex back is total of rules and regulations,which exclusively one how Italy shouldn't even want to link the Euro, if it was prepared to receive Italy as a extremity. It's like invading
    their attending a f number ways to get ex back case.
    Calvin Klein'sformer flame Snick Gruberis speech production out for the number 1 prison term just about minus mark and you have to do something more or less it other than you risk losing him for upright.

    Look into my website ... sorry poems for ex boyfriends

    ReplyDelete
  25. చాలా సంపాదిస్తున్నారండి ఈ బ్లాగు ద్వారా.... అదే లెండి పుణ్యం....

    ReplyDelete
  26. THANKS A LOT .ADEQUATE INFORMATION IS GIVEN .MATTER IS USEFUL.

    ReplyDelete
  27. MTR SEVA (THOMALA SEVA, ARCHNASEVA SUPRABATHAM SEVA) U WANT PLS CONTACT 9392630494 ,tyagmaddi@gmail.com ) BEFORE 3MONTHS ADVANCE BOOKING (required items are photo, mobile number, pan card number ,age )

    watch you tube videos

    thomala seva part 1 http://www.youtube.com/watch?v=GFFQ_7fnEyM

    thomala seva part 2 http://www.youtube.com/watch?v=_Jwq7709NpI

    ReplyDelete
  28. chala chala adbhutamga chepparandi swayamga meme nadachi tirumala yatra chesinattuga undi. thank you very much. mee blog valla nalaanti valla sandehaalu mottam nivritti chesukogaluguthunnaru. meeru maaku ilaanti places enno choopinchalani aasistunnanu.

    ReplyDelete
  29. thanks raju garu nenu chala sarlu tirupathi kali nadaka veylanu kani thalayeru gundu yapudu chudaledhu so, mee blog valaa adi thylisindi andi esari tirupathi velinapudu kachi thanga adi chusthau.

    ReplyDelete
  30. thanks raju garu nenu chala sarlu tirupathi kali nadaka veylanu kani thalayeru gundu yapudu chudaledhu so, mee blog valaa adi thylisindi andi esari tirupathi velinapudu kachi thanga adi chusthau.

    ReplyDelete
  31. sir raja chandra garu chala useful information icharu thank you.........

    ReplyDelete
  32. chala chakka vivarincharu...mee power point representation bagundi.

    ReplyDelete
  33. 15 days back nenu alipiri metla dvara srivari darshanam chesukunnnanu, kani intha vivaramuga thelusukoledandi. kani aaroju naku swami vari dharshanam chala super ga jarigingi.
    govinda .......

    ReplyDelete
  34. srinivasa namo namaha,
    govinda govinda.......

    ReplyDelete
  35. subrahmanyeswara rao kolluriJanuary 11, 2014 at 8:37 PM

    thank u very much for such an informative post .god bless u. .............. om namo vekatesaya.namah.

    ReplyDelete
  36. Govinda, Govinda. Tirumal vellivachina anubhuti kaligindi, Dhanyavaadamulu

    ReplyDelete
  37. భక్తిపూర్వక సమాచార ప్రదాన కృషికి చాలా...చాలా కృతజ్ణతలు.. ప్రశంసలు...
    నమో వేంకటేశాయా!....
    *యర్రాప్రగడ ప్రసాద్, రాజమండ్రి.

    ReplyDelete
  38. తిరుపతి గురించి పువ్వులు స్వామి వెనుక వేయడం దగ్గరలో ఒక పల్లి గురించి రాసిన పోస్ట్ లింక్ తెలియ చేయండి

    ReplyDelete
  39. కాలినడకన తిరుమలకి చేరినట్టే ఉంది. చాలా వివరంగా వ్రాసారు.

    ఏడుకొండల వాడా వేంకట రమణా !!!
    గోవిందా గోవిందా !!!!
    అద్బుతం అత్యద్బుతమ్ ...
    ఎన్ని మార్లు చూచినా తనివి తీరనిది తిరుమల తిరుపతి దేవస్థానం ....

    ధన్యవాదములు ....

    ReplyDelete
  40. రాజ గారు,
    ఎవరు పెట్టారో ఇలా అనే ఫోటో గురించి నాకు తెలిసిన సమాచారం.
    అలా 3 రాళ్లు నిలబెడితే వాళ్ళకు స్వగృహయోగం కలుగుతుందని ఒక నమ్మకం.
    ఇక నాకు తెలిసినంత వరకు తిరుమల మొత్తం సాలగ్రమమయం. ప్రతి అణువు, ప్రతి రాయి, చెట్టు,చేమ, గాలి...అన్నీ అన్నీ ఆ ఏడుకొండలవాడిని జపిస్తూనే ఉంటాయి.. మీ పోస్టింగ్ వల్ల మళ్ళీ అక్కడికి వెళ్ళినంత అనుభవం అయ్యింది. చాల థాంక్స్ అండి.

    ReplyDelete
  41. ఎన్నో జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం శ్రీ‌నివాసుడి ద‌ర్శ‌నభాగ్యం

    ReplyDelete
  42. నెత్ లొ రూం బూక్ చెసము. ధానీ కొసం ఎవరినీ కనుక్కొవాలి,ఎక్కదికి వెల్లలి

    ReplyDelete
  43. Your Site is Excellent about this Information...Visit
    TTD Online
    TirumalaHistory

    ReplyDelete
Previous Post Next Post