AMARAVATHI,ANDHRAPRADESH

అమరారామం - Amaravathi Templeinformation

పంచారామాల్లో అమరారామం ఒకటి. పాలకొల్లు క్షీర రామలింగేశ్వరస్వామి దేవాలయం, అమరావతి అమరలింగేశ్వర ఆలయం, ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, భీమవరం సోమేశ్వర స్వామి దేవాలయం - ఈ ఐదింటినీ పంచారామాలు అంటారు.


కుమారస్వామిచే ఖండితమైన తారకాసురుని మెడలోని అమృతలింగపు ప్రథమ దివ్యశకలం (అమరేశ్వర లింగం) పడినట్టి దివ్వ పుణ్యధామం, పంచారామాలలో సుప్రసిద్ధమైనట్టి దివ్యక్షేత్రం ‘అమరారామం’. దేవేంద్రునిచే ప్రతిష్టించబడిన ‘అమరలింగేశ్వరుడు’ బాలచాముండికాదేవి సమేతంగా కొలువై వున్న పుణ్యధామమే అమరారామం. ఈ అమరలింగేశ్వరుడు పరమేశ్వరుని అఘోర ముఖరూపమై ప్రకాశించుచున్నాడు. దేవేంద్రునిచే ప్రతిష్టించబడిన ఈ శివలింగం పేరు అమ రేశ్వరుడు. ఈ శివలిం గం సుమారు 15 అడుగుల ఎత్తు కలిగి ఉండి తెల్లని కాంతులతతో ప్ర కాశించుచు న్నది. ఆ స్వామికి రెండవ అంతస్తు పై నుండి అభిషేకాలు జరుపట విశేషము. ఈ స్వామి కొలువైన మండపములో పశ్చిమంగా బాలచాముండేశ్వరీ అమ్మవారు కొలువై ఉన్నది. 

అమరావతి కోసం శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు చేసిన ప్రవచనం  ( 7min Audio)

 

 


 



 




 



 

3 Comments

  1. అమరారామం గురించి చదవడం చాలా సంతోషంగా ఉంది. తొంభైల ప్రాంతంలో అమరావతి గుడిని చూడడం జరిగింది.మీ పోస్టు ఆ జ్ఞాపకాలన్నిటినీ తిరిగి తీసుకొచ్చింది. నా బ్లాగులో రాసిన "సామర్లకోటశివాలయం - కుమారారామం" http://manakakinadalo.blogspot.in/2012/07/kumararama-temple-in-samarlakot.html మీకు నచ్చవచ్చు. ఒకసారి చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.

    ReplyDelete
  2. In my last trip to India, I was able to visit 4 out of 5 pancharaamaas (including this one). Thanks for posting such valuable info. Jai Gurudev.

    ReplyDelete
  3. Lovely pictures, though I couldnot understand the blog. Amaravati, the new capital of Andhra Pradesh, is named after its historic site. There are many places to visit in Amaravathi and the town is a center of pilgrimage to both Hindus and Buddhists. Its a famous pligrim destination.

    ReplyDelete
Previous Post Next Post