Annavaram Temple Information

శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం 
( అన్నవరం ) - Annavaram Temple Information
 

తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలో అన్నవరం  ఉంది . అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో వస్తుంది.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కొలువైన త్రిమూర్తి నిలయం అన్నవరం. ఈ ఆలయం రెండు అంతస్థులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది. అలా త్రిమూర్తులు వెలసిన ఈ అరుదైన ఆలయానికి యుగాల చరిత్ర ఉందంటారు భక్తులు. శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఈ క్రింది విధంగా స్తుతిస్తారు.

మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమఃస్థలపురాణం:

పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. వారు రత్నాకరుడు, భద్రుడు. వీరు పరమ విష్ణు భక్తులు. వారు హరిని తమ శిరస్సున దాల్చాలన్న కోరికతో తపస్సు చేసారు. వారి కోరిక మేరకు నారాయణుడు భద్రుని శిరస్సుపై (భద్రాచలం) వైకుంఠ రాముడిగానూ, రత్నాకరుడి (రత్న గిరి)పై సత్యనారాయణుడి గానూ అవతరించారు.
 దేవాలయ ప్రాశస్తి:

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణం బహద్దరు రాజా ఐ.వి.రామనారాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీన (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.

ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి.

పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.

పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి.

ప్రతీ ఏటా పదిలక్షల మంది భక్తులు అన్నవరంలో వ్రతమాచరిస్తారని అంచనా.వీరత్వానికీ, సత్యానికీ ప్రతీకగా భావించే మీసాలరాముడి కల్యాణోత్సవాలను ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకూ అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తులు.

ఇక్కడి ఇంకో విశేషం ప్రసాదం. గోధుమరవ్వతో ఆలయ ప్రసాదశాలలో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బయటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ రుచి మాత్రం రాదు.


Contact Information
For any information related to Annavaram devasthanam, please contact:
Phone Numbers of Different Sections
Sl. No.Name of the SectionPhone Number
1.Main Temple239104
2.Nitya Pooja239108
3.Varthams Section239111
4.Information Centre(PRO)239119
5.E Os Peshi 239130
6.Engineering Section Office 239136
7.Annadanam 239137
8.Central Reservation Office 239173
9.E.O.s Office239214
10.Executive Engineer Office 239260
11.AEO (Temple) 239311
12.Reception 239335
13.Free Dispensary (Down Hills) 239338
14.Toll Gate 239339
15.Assistant Executive Officer
Temples
239318
16.Assistant Executive Officer
Vrathams
239111
17.Assistant Executive Officer
Accommodations
239173
18.Assistant Executive Officer
Annadanam
239137
19.Executive Engineer
For Cottage Donation Scheme
238395
20.Superintendent
For V.I.P Reception (Guest Houses)
238163
21.Superintendent
For Central Reservation Office (Accommodation )
The Executive Officer
Sri.V.V.S.S. Devasthanam
Annavaram - 533406.
East Godavari District
Andhra Pradesh.
Phone : 08868-238121,238125,238163
Fax :08868-238124
E-mail :E-mail :eoannavaram@yahoo.co.in

How To Teach
By Road
 • There are frequent Express buses from Visakhapatnam ,Rajahmundry and Kakinada.

 • Devasthanam is running buses from Down hill to Up Hill

 • APSRTC BusesA.P.S.R.T.C runs Buses for every Half An Hour Via Annavaram from Rajahmundry to Visakhapatnam and vice versa.

  For Every 15 mintus buses are available from Tuni to Kakinada via Annavaram and surrounding Villages and vice versa.
Sri Satyanarayana swamivari Devasthanam is maintaining two different types of Darshan methods for the convenance of the piligrams to witness the deity.

 •   Sarva Darshanam                
 •   Seegradarshanam

Sarvadarshanam means 'Darshan for all'. Sarva darshanam is free and allowed between 6:00AM to 12:30PM and 1:00PM to 9:00PM.

Seegradarshanam means 'Darshan with less waiting time'. Piligrams who want to avail seegradarhan, have to purchase a ticket costing Rs. 25/- per head. One packet (100Gms) of bhogam prasadam will be provided for Seegradarshanam ticket. Timings for the seegradarshan is same as sarvadarshanam but allowed through a different queue.Sri Swamivari / Ammavari Sevas
S.No Name of Seva Cost in Rs. Seva Time
1.Sri Swamy Suprabatha SevaRs.116/-03:30 AM
2.Sri Swamivari VrathamRs.125/-6:00 AM to 6:00 PM
3.Sri Swamivari Special VrathamRs.200/-6:00 AM to 6:00 PM
4.Sri Swamivari Vratham at DwajasthambhamRs.500/-6:00 AM to 6:00 PM
5.Sri Swamivari Visishta VrathamRs.1,116/-6:00 AM to 6:00 PM
6.Sri Swamivari Nitya KalyanamRs.750/-9:30 AM
7.Sri Swamivari Vratham After 'Pooja' prasadam send by postRs.150/-
8.Sri Sitaramula (Kshethra Palakulu) Pattabhishekam on the lunar star day of Punarvasu in Sri Swamivari TempleRs.116/-On Full Moon Day
9.Sri Swamivari Pavalimpu sevaRs.50/-02:00PM
10.Sri Swamivari Laksha Patri PoojaRs.2,500/-08:00AM
11.Sri Ammavari Laksha KunkumarchanaRs.2,500/-08:00AM
12.Sri Swamivari Abhishekam on the lunar star day of MakhaRs.1,116/-One Day Only
Sri Swami Vari Nitya Kalyanam
Seva Description Persons Allowed Prasadam / Gifts Ticket Cost
Kalyanam 2 Prasadam 1kg, Bangi Prasadam 300gms,Pulihora 400gms, Dovathy,Khanduva,Saree,Blouse Rs.750.00
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Comments

 1. నమస్కారం రాజాచంద్ర గారు, మంచి విషయాలు తెలియచేసారు ముఖ్యంగా సేవా వివరములు.. ఇవి దూరంనుండి వచ్చేవారికి చాలా ఉపయోగకరం. చాలా చాలా ధన్యవాదములు....

  ReplyDelete
 2. very good info.. thanks for your efforts.. great job

  ReplyDelete
 3. Very Good Info.. Appreciate your patience in collecting all this information for us ..

  ReplyDelete
 4. శ్రీ రాజాచంద్రగారికి నమస్కారములు. మీరు దేవాలయముల వివరములు ఎంతో బాగా తెలియజేస్తున్నందులకు మీ నా ధన్యవాదములు తెలుపుతున్నాను.

  ReplyDelete

Post a Comment