పిల్లలా బొజ్జ గణపతి
అన్నయ్య నీకో విషయం చెప్పాలి అని మొహమాటం పడుతూ నన్ను పక్కకు తీస్కుని వెళ్ళాడు 1st క్లాసు చదువుతున్న "చందు"గాడు . హా చెప్పరా ఏమిటి అన్నను . మరేమో మేము వినాయకుడి బొమ్మను తీస్కుని వచ్చి 9 రోజులు పూజ చేద్దాం అనుకుంటున్నాం .
మేమందారం డబ్బులు కూడా వేస్కున్నాం నువ్వు కూడా ఇస్తావా అన్నయ్య ప్లీజ్ ఇవ్వవా అని అమాయకంగా అడుగుతుంటే . నేను షాక్ అయ్యాను చోకాలేట్స్ కొనుక్కోవడానికి డబ్బులు అడుగుతాడు అనుకుంటే విడేమిటి అనుకున్నాను . లోలోపల పొంగిపోయాను . ఎంత ఉన్నాయ్ మీ దగ్గర ఎంతకావాలి అన్నాను . మేమందరం కలిసి 10/- వేస్కున్నాం ఇంకో 10/- ఉంటే 20/- రూపీస్ కి బొమ్మవస్తుంది అన్నాడు సరే ఐతే . అయిన ఇప్పుడు వద్దులేరా నెక్స్ట్ ఇయర్ చేస్కుందురు గాని అన్నాను . వాడిమోహం వాడిపోయింది సరేరా 10/- ఒకే నా అన్నాను సరే అని ఇచ్చాను . వాడు వాడి గ్యాంగ్ తో మంతనాలు చేస్తున్నాడు ..మా చిన్ననాతో మరో 10/- ఇప్పించి నేను బయటకు వెళ్ళిపోయాను .
వావ్ ఏమిటి నిజామా అనుకున్నాను . ఈలోపు మా చెల్లి సత్య పుస్తకం పట్టుకుని వచ్చి చూడు చూడు అన్నయ్య మాకు వచ్చిన చందాలు అంటూ చూపిస్తుంది . తనే లీడర్ ఆ టీం కి 7th క్లాసు చదువుతుంది . అందరు 2/- , 5/- , 10/- ఇచ్చారు .
మొత్తానికి 250/- వచ్చాయ్ అన్నయ్య థాంక్ యు అన్నయ్య అన్నారు .
రోజు
స్కూల్ కి వెళ్ళే ముందు వచ్చి అందరు దండం పెట్టుకుంటాం . సాయంత్రం కూడా
వత్తు వెలిగింది దండం పెట్టుకుంటాం అన్నారు . అందర్కి చోకలేట్స్ తెప్పించి నోరు తీపిచేసాను .
Tags
Vinayaka
same ilanti feeling naku ma apartments lo pettina pillala ganapathi choosi kaligindhi.nenu post vedhdhamu anukunnanu.meeru vesesaaru.ayinaa vraasthaanu .aa
ReplyDeletepillalaku aasheessulu andali kadha.chinnaarulaku aasheessulu :)