15-12-2012
పళముదిర్చొళై : Palamudircholai Temple Information1. తిరుచెందూర్ : Thiruchendur
2. తిరుప్పరంకుండ్రం : Tirupparankundram
3. పళముదిర్చొళై : Pazhamudircholai
4. పళని : Palani
5. స్వామిమలై : SwamiMalai
6. తిరుత్తణి : Tiruttani
ఇప్పుడు మనం చూడబోయే క్షేత్రం పళముదిర్చొళై . ఈ క్షేత్రం మధురై నుంచి 24 కిలోమీటర్ల దూరం లో కొంపైన ఉంటుంది. ఆ కొండ క్రిందే ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రమైన “అళగర్ కోయిల్ " ఉంది. ఈ అళగర్ కోయిల్ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దివ్యదేశములు అని పిలువబడే 108 పవిత్ర క్షేత్రములలో ఒకటి.
అళగర్ కోయిల్ దర్శనం చేస్కున్నాక కొండపైన ఉన్న స్వామి వార్ని దర్శనం చేస్కోవడానికి బస్సు సౌకర్యం ఉంది . కార్లమీద కూడా భక్తులు వెళ్తుంటారు . ఆలయం వారే బస్సు సౌకర్యం కల్పించారు . బస్సు టికెట్ 10/- .
రండి బస్సు టికెట్ తీస్కుని బస్సు ఎక్కండి . ఈ కొండప్రాంతం అంతా కోతులతో నిండి ఉంటుంది . అవి ఆడుతూ పడుతూ ఉత్సాహంగా ఉంటాయి . భక్తుల దగ్గరనుంచి అడిగి .. ఇవ్వకుంటే లాక్కుని మరీ తింటాయి .
మీకు కనిపిస్తున్నాడి సుబ్రమణ్య స్వామి గుడి .. చాల ప్రశాంతంగా ఉంటుంది.
సుబ్రమణ్యుడు ఈ కొండపైనే అడుకునేవాడట .. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహా భక్తులలో ఒకరైన అవ్వయ్యార్ ని సుబ్రహ్మణ్యుడు పరీక్షించిన స్థలం ఈ క్షేత్రం.
సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహా భక్తులలో ఒకరైన అవ్వయ్యార్ ని సుబ్రహ్మణ్యుడు పరీక్షించిన స్థలం ఈ క్షేత్రం.
మనకి ఎన్ని ఐశ్వర్యములు, భోగాలు ఉన్నా, సరి అయిన ఆరోగ్యం లేక పోతే వ్యర్థం, ఈ క్షేత్రములో స్వామి వారిని దర్శించడం వల్ల, చక్కని ఆరోగ్యము మనకి కటాక్షించ బడుతుంది అని నమ్మకం .
మనం ఇంకా లోపాలకి వెళ్ళలేదు .. ఇక్కడ చూస్తున్నారా ? గుడిలోకి రాకుండా వీళ్ళు ఇంకా కొండపైకి వెళ్తున్నారు .. ఎక్కడకి వెళ్తున్నారు ? సరే మీరు గుడిలోకి రండి .. బయటకు వచ్చాకా మనం కూడా చూద్దాం .
మీకు కనిపించేదే స్వామి వారిగుడి .. మీకు ద్వజస్థంభం కనిపిస్తుందా ?
మరో విషయం మీరు టైం చూడండి .. 1.20pm అయింది . తమిళనాడు లో టెంపుల్స్ చాలావరకు 12.30కి మూసి 3. 45 కి ఓపెన్ చేస్తారు . మన అదృష్టం కొద్ది 1.20pm అయిన టెంపుల్ ఓపెన్ చేసారు ..
మీకు కనిపిస్తుంది కదా .. లోపల దర్శనం చేస్కుంటున్నా భక్తులు .
స్వామి వారి రధం ..
ఆ రండి .. మనం ఇందాక చెప్పుకున్నాం కదా కొండపైకి ఎక్కడికి వెళ్తున్నారు అని ..
ఈ ఆలయం కంటే ఇంకా పైన కొండ మీద, నూపుర గంగ ఉంది, ఈ గంగ శ్రీ మహా విష్ణువు యొక్క పాద నూపురముల నుంచి వచ్చిందని, అందుకే ఆ పేరు అని చెప్పారు. మనం ఇప్పుడు ఆ కొండపైకి వెళ్తున్నాం . ఈ ఫోటో చూడండి మీరు గమనిస్తే మీకు ఒక కోతి కనిపిస్తుంది ..
ఏమిటి ఈ డబ్బాలు అనుకుంటున్నారా ? పైన చెప్పగా లోపల నూపుర గంగ ఉంది. ఎప్పుడూ చిన్న కొండ గుహ లోనుంచి గంగా జలము వస్తూనే ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు ఆ జలము మా మీద కూడా ప్రోక్షించారు. రానివాళ్ళ కోసం ఇలా డబ్బాలో వేస్కుని తీస్కుని వెళ్ళడమే .. మీకోసం ఆ డబ్బాలాన్న మాట :)
చూసారా లైన్ ఎలాఉందో .. ఆ పైపు పట్టుకున్నాయన మనం నీళ్ళ జల్లుతరన్నమాట .. కొందరు స్నానాలు కూడా చేస్తుంటారు .
చెప్పలేదు కదా .. క్రింద స్వామి వారి విగ్రహానికి ఇక్కడ నీళ్ళ తోనే అభిషేకం చేస్తారంట .. వేరే నీళ్ళు వాడితే ఏదో అవుతుంది అని ఎక్కడో చదివానో .. విన్నానో గుర్తులేదు .
ఇక్కడ అమ్మ వారి (రక్కాయి అమ్మన్ అంటారు తమిళంలో) మూర్తి కూడా ఉంది. మనం క్రిందనుంచి అదే తీర్దం జల్లుకుని పైకి వస్తే అమ్మవార్ని దర్శనం చేస్కోవచ్చు .
ఈ బ్లాగ్ చూడండి .. చాల వివరంగా అఱుపడై వీడుగళ్ కోసం రాసారు ..
http://shaktiputram.blogspot.in/2011/09/blog-post_2380.html
manchi infermation echaru thank you
ReplyDeleteVERY GOOD INFORMATION
ReplyDelete