face book status templeinformation

అప్పుడప్పుడు పేస్ బుక్ లో రాసినవి .. ఇక్కడ పోస్ట్ చేశాను  . 
సంబందలాన్ని సంపాదనకోసమే అనుకోకు .. ఒంటరైనప్పుడే తేల్సుంది వాటి విలువ
 • మానవత్వం మీంచిన మతం ఏది లేదు ..
  ఏ మతం ఉన్న అది మానవత్వమును పేంపొందిచడానికే
 • ఇచ్చి పుచ్చుకోవడం లో ఏది ఎక్కువైనా సంబంధాలు దూరం అవ్వబోతున్నాయని గమనించాలి  
 • కనబడ్డ ప్రతీవాళ్ళతో నీ బలహీనతలు చెప్పుకోకు ..
  అవే అవతలివాళ్ళ బలం అవుతుంది నీయందు .
 • Mohamatam... jaali.. daya gunam.. unnavaru cheyakudani pani appulu ivvadam...
  Dabbuto patu sambandalni kuda pogottukuntaru..
 • నీలా ఆలోచించే వారందరూ ... నీలా ఉండరు .
  నీలా ఉండేది .... ఉండగలిగేది నువ్వు మాత్రమే .
 • చావు అందరిది ఒక్కటే .. చూసే చూపులోనే వ్యత్యాసం కనిపిస్తుంది
 • చేసిన ప్రతితప్పుకి ఏదో ఒక కారణం చెప్పుకుని తప్పించుకోకు నీ నుంచి నువ్వు
 • మీ జీవితాలు మీ ఇష్టమే .. కాని మీకు ముందు వెనుక చాలామంది ఉంటారు .
  అది గుర్తుపెట్టుకోవడం 'నా ఇష్టం అనుకుని పనిచేసేటప్పుడు ' చాలావసరం
 • Pampakalu premalu unnappudu cheyyali... kotlatalu modalayyaka kadu
 • మనకు చాలా ఆవేశం ఎక్కువ .. ఆడవాళ్ళకు ఏదైనా జరిగిన .. వార్కి ఇబ్బంది కలిగించే పని ఏదైనా చేసిన ..
  ఈ ఆవేశం మరోసటి రోజు ఆఫీసు వెళ్ళేవరకు .. మన బాధ్యతను గుర్తుచేయడానికి మళ్ళి మరోసంఘటన జరగాలి .
 • మీరు పెళ్లిలకి బర్త్డే ఫంక్షన్ లకి ఇతర శుభకార్యాలకి వెళ్ళినప్పుడు మీరు కానుకలు ఇచ్చిన ఇవ్వకపోయినా .. ఎవరైనా మరణించినప్పుడు మాత్రం తప్పకుండ వెళ్లి వార్ని ఓదార్చడం తో పాటు ఆర్ధికంగా వార్కి సహాయం చేయండి . మీరిచ్చి 100/- కూడా వార్కి చాల అవసరం. ఎప్పడికి ఈ విషియన్ని మరవకండి .
 • ఆకాలితో ఉన్నవాడికి నీతులు చెప్పకు ... కుదిరితే వాడి ఆకలి తీర్చు ..
 • కోన్ని అందనప్పుడే వాటివిలువ తేలుస్తుంది ..
 • మనం రామాయణం మహాభారతలాన్ని సినిమాలో మాత్రమే చూసి జీర్ణించుకోవడం వల్ల ఎవరైనా గ్రంధాలు చదివినవాళ్ళు ఏమన్నా చెబితే ముందు వినడం తరువాత సంగతి .. ఆయనతో పోట్లాడి మన డిరెక్టర్ మూవీ లో ఎం చూపించారో అదే నిజం అని ఒప్పించేవరకు పోరాడుతూనే ఉంటాం .
 • ఎప్పుడు కూడా సగం తెలిస్తేనే ఎక్కువ మాట్లాడగలం ..
  పూర్తిగా తెలియనప్పుడు మౌనం వస్తుంది ..
  పూర్తిగా తెల్సుకుంటే .. తెలియంది చాల ఉన్నది అనిపిస్తుంది ..
 • ఒక వ్యక్తీ మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు .. ఆ పెట్టుకున్న నమ్మకం నిజం అయినప్పుడు .. చెప్పడానికి మాటలు రావు .
 • మాకు 1/- కి 2/- కి బియ్యాలు అవసరం లేదు ..
  30/- పట్టుకుని మార్కెట్ కి వెళ్తే కూరగాయలు వచ్చేయాల చేయండి ..
  అందరు పని చేస్కునేలే పనికల్పించండి ..
  రుణమాపి లు అవసరం లేదు ..
  రుణం ఇవ్వడానికి బ్యాంకుల చుట్టూ తిరగకుండానే వచ్చేయాల చేయండి .
  ఉచిత కరెంటు దేవుడేరుగు పండిన పంటకి మద్దత్తు ధర ఇప్పించండి .
 • వేదభూమి అని చెప్పుకోవడమే కాదు . వేదాధ్యాయన్ని ప్రోత్సహించి . వేదాధ్యాయం చేసిన పండితుల జీవనోపాధి చూసే భాద్యత కూడా ప్రభుత్వమే తీస్కోవాలి . వేదాల లోంచి మన దేశానికి ఉపయోగపడే విషియలపై పరిశోదనలు చేసి వాటిని వెలుగు లోకి తీస్కునిరావాలి . ఎంతకాలం విదేశాల వాళ్ళు మన వేదాల కోసం చెప్పే గోప్పలు వింటాం .
 • గవర్నమెంట్ ఖర్చు తో చదివి .. గవర్నమెంట్ జాబు తెచ్చుకున్నవారి నుంచి అప్పడివరకు వారిపై కర్చుపెట్టిన ఖర్చుని తిరిగి చెల్లించేలా చట్టాలు తీస్కునిరావాలి . అప్పుడు చదువు కుంటున్నవార్కి ఒక భాద్యత ఏర్పడుతుంది .
 • వృధ్యాప్యంలో రోడ్ మీద పడ్డ వృద్ధుల భాద్యత ప్రభుత్వాలే తీస్కోవాలి .
  అలా కన్నవార్ని రోడ్ మీద వదిలేసిన వార్కి ప్రభుత్వ పధకాలు అందకుండా చెయ్యాలి .
 • ఒక అసమర్ధుడి పదవి వ్యామోహం వల్ల ....
  ఆదేశ అభివృద్ధి కోన్ని వందల సంవత్సరాలు పాటు వెనకపడిపోతుంది .
 • మత సహనం పాటించడం అంటే ...
  నీ మతాన్ని నోట్లకట్టలతో , అర్ధంపర్ధం లేని వాదనలతో పాతిపెడుతున్నప్పుడు .
  నీకు నిలబడ్డానికి కూడా చోటులేకుండా చేస్తున్నాప్పుడు కూడా చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు .
 • ఎవరికివారు అనుభవిస్తేకాని .. కోన్ని విషయాలు ఎవరేన్ని చెప్పిన తలకేక్కవ్
 • పార్టీ ల జెండాలు మోస్తూ .. ఆవేశం లో మీ స్నేహితులని కూడా చూడకుండా నోరుపారేస్కోకండి . రేపు ఆ రెండు పార్టీలు పొత్తులతో కలిసినంత త్వరగా మీరు కలవలేరు .
 • ఇంటికి బాగా తెల్సినవాళ్ళు వచ్చిన సరే ... ముందుగా కుర్చోమనడం .. మంచినీళ్ళు ఇవ్వడం వంటి విషియాల్లో నిర్లక్ష్యం ఉండకోడదు . ఒక్కోసారి మనవాడేగా అనే భావన కలిగి పెద్దగ పట్టించుకోం . గుర్తుపెట్టుకోండి మన ఇంటికి వచ్చినవాడు ఎలాంటి పరిస్థితిలో వచ్చాడో మనకు తేలియదు .
 • డబ్బులు ఇవ్వడం లోను .. తీస్కోవడం లోను ఏప్పుడూ అప్రమత్తంగానే ఉండు .
  మనుసులు మధ్య ఉన్న సంబందాలు ఎంత బలమైనవో పరీక్షిస్తూ ఉంటుంది ..
 • ఎప్పుడైతే చదువు ధనం సంపాదించడానికి అని మనం నిర్ధారించుకున్నామో ... మనం నేర్చుకోవడానికి ఏమిలేకుండా పోయింది                         
---------------------
లోకంతీరే అంత ..
బ్రతికుండగా బ్రతకనివ్వరు ..
చేయడానికి చేయూతనివ్వారు ..
పలకరించడానికి తీరికుండాదు ..
కష్టాల్లో కరుణించే నాదుడుండడు ..
నువ్వు పొతే .. జాలి వర్షం కురిపిస్తారు


పూజలు మనస్సుకు సంబంధించినవి ... మనీకి సంబంధిచినవి కావు .
 
---- 
మరణం నీ చేతుల్లో లేకపోయినప్పటికీ ....
నువ్వు వెళ్ళిన తరువాత కూడా ..
నీజాడలు చెరగకుండా ఉండేలా ..
నువ్వే నాలుగు మంచి పనులు చేసివేల్లాలి ..
ఆయన పిలిచాక తిరిగి చూడ్డానికి ఏమి ఉండదు ..

------ 
కార్లలో తిరగడమే కాదు .. కాలం కలిసిరాకపోతే .. కాళ్ళ నడకనికుడా వెళ్ళగలిగే మానసిక పరివర్తన ఉండాలి 
 ------
 • అవసరానికి ఉపయోగపడని డబ్బు ... ఆపదలో ఆదుకొని మీత్రుడు .. అవసరానికే పలకరించే బందువులు .. ఉన్న లేనట్టే ..

 •  మనుషులను విడదీసే బలమైన ఆయుధం డబ్బు ఒక్కటే ..
 •  ఎప్పుడైతే చదువు ధనం సంపాదించడానికి అని మనం నిర్ధారించుకున్నామో ... మనం నేర్చుకోవడానికి ఏమిలేకుండా పోయింది
 • ఎవరి దగ్గరైతే నువ్వు నీలా ఉండగలవో .. వాళ్లతో ఎప్పుడు ఉండగలావ్ .
  ఎప్పుడైతే నటించడం స్టార్ట్ చేసావో .. అది ముగియగానే అన్నిమరిచినట్లే
 •  
 • మనుషులతో మాట్లాడిన మాటలుకంటే .. మనసులతో మాట్లాడిన మాటలు ఎప్పడికి గుర్తుంటాయ్ .
 •  
 • ఒక్కోక్కసారి ఎదుటవారు మనపై చూపిస్తున్న ప్రేమని స్వీకరించడం తప్ప వార్కి మనం చేయగలిగింది ఏమి ఉండదు .
 • "డబ్బు సంపాదించడమే కళ అనుకుంటారు .. డబ్బుని ఖర్చు పెట్టడము కూడా కళే"
  70% మందికి డబ్బుని ఖర్చు పెట్టడము తెలియదు .. ఆ కారణంగా కర్చుపెట్టేవాల్లో .. అసలు తనకోసం కూడా కర్చుపెట్టుకోలేని వాళ్ళు మనకు ఎక్కువగా కనిపిస్తారు .
 • -----------------
 • నీకు ఏది అవసరమో అది కొనుక్కో
  నీకు ఏది కావాలో అది కాదు .
  - ఇంటర్ లో విన్నాను .. ఇప్పడికి ఏం కొనబోతున్న ఇది గుర్తుకువస్తుంది నాకు
 •  
 • మనకి అప్పుడప్పుడు అవసరమే గురువౌతుంది .
 • ఏదైనా ఒక విషయం లో మనకి కలిగిన భాద కంటే .. ఆ విషియాన్ని ఎవరికీ చెప్పలేని పరిస్థితి ఇంకా ఆ భాదను రెట్టింపు చేస్తుంది .
 •  
 • ఇతర మత గ్రంధాలను పంచిపెట్టడం మనం చూస్తుంటాం . ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది ఇంటిదగ్గర మన మతగ్రంధాలు ఉన్నాయ్ . రామాయణం , మహాభారతం , భగవద్గీత వంటివి మన ఇళ్ళలో ఉండవల్సిన పుస్తకాలు . సరే ఇంటిదగ్గర లేకపోతే పోనివ్వండి ఇకనుంచైనా కనీసం దేవాలయాల్లోనైన మన మత గ్రంధాలను ఉంచితే ఏదో ఒక పండగ రోజైన ఆ పుస్తకాలను చదివే అవకాసం ఉంటుంది .
 •  
 • గురువు అంటే ప్రతిసారి క్లాస్ రూం లో కూర్చోపెట్టి పాఠాలు చెప్పినవారే కాదు . అసలైన గురువు కాలం . మనం ఎన్నో చదువుకుని మరెన్నో విన్నకాని , కాలం చెప్పే పాఠం మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకునేల చేస్తుంది .
 • స్వేచగా బ్రతకడం అంటే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు .. నీ బాధ్యతలు గుర్తేరిగి బ్రతకడం . నీవల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడుతూ బ్రతకడం .
 • మీరు ఇప్పడివరకూ క్షేత్రదర్శనానికి ఎలా వెళ్ళినా .. ఇకనుంచి ఎ క్షేత్రానికైన వెళ్లేముందు ఆ క్షేత్ర స్థలపురాణం ఏమిటి ? అక్కడ స్వామి దర్శనం ఎలా చెయ్యాలి ? ఏమేమి చూడాలి .. అని తెల్సుని ( తెల్సుకోవడానికి ప్రయత్నించి ) వెళ్ళడం ప్రారంభించండి .

 • పేరు కోసం చేసిన మంచి పని మంచిపనే . ఆ పేరు కోసం తనకు తెలియకుండానే మంచి పనులు చేస్తూ నలుగురికి ఉపయోగపడతాడు .
 • ఎప్పుడూ ఏదో ఒకటి అడగలాని అడగకూడదు ..తెల్సుకోవలనో / అవసరం ఉంటేనే అడగాలి ..
  రెండు లేకుండా అడిగితే ..నువ్వు .. అడిగినవాల్లముందు .. నీ కంటే చిన్నవాడివి అవుతాయ్
  .
 • గురువులు నీకు అర్ధమైయేటట్లు చెప్తారు కాని .. నీకు నచ్చినట్లు చెప్పరు . గురువుల దగ్గరకు వెళ్లేముందు ఈ విషయం తెల్సుకుని వెళ్ళడం ఉత్తమం .
  • ఆలోచన ఏమిటంటే .. మన దేవాలయాల్లో మరీ చిన్నవాటి కోసం కాదు , ఎక్కువ స్థలం ఉన్నవాటికోసం మాట్లాడుతున్నాను . ప్రధాన దేవాయలం ఎలాగో మూసి ఉంచుతారు .. మీగిలిన కాలి ప్రదేశం లో రాత్రి పూట తాళాలు వేయకుండా పేదవాళ్ళను లోపలకి వెళ్లేవిధంగా చేస్తే పాపం వారు మరీ రోడ్లపై , రైల్వే స్టేషన్ , బస్సు స్టాప్ లలో కాకుండా కనీసం రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోగలరు . ఆవిధంగా చేస్తే మనవ సేవ - మాధవ సేవ కూడా చేసినట్టు అవుతుంది . ఫ్యాన్ లు వేస్కుని దోమ చక్రాలు వేలుగించుకుని నిద్రపోదామన్న సరిగ్గా నిద్ర పట్టడం లేదే మనకు .. పాపం ఎం పాపం చేసారని వాళ్ళకి అంత కష్టం . అధికారులు తలుచుకుంటే నేను చెప్పినది అంత కష్టం కాకపోవచ్చు . మీ సలహా ఏమిటి ?
 •     
 • ప్రతీదాన్ని డబ్బుతో ముడిపెట్టి నేనేం చెయ్యలేను అంటూ .. నీకున్న అప్పులు , భాద్యతలు కోసం చెప్పనక్కర్లేదు . పక్కవాడికి సహాయం చేయడానికి ప్రతిసారి డబ్బే అవసరం లేదు . రాముడి కి ఉడత సహాయం చేసినట్లు .. నువ్వు సహాయపడాలి అనుకుంటే ఏదో విధంగా నలుగురికి ఉపయోగపడవచ్చు
 •  మీరు దేశానికి ఎటువంటి సేవా చేయనవసరం లేదు .. మీ జీవితాల్ని ఫలంగా పెట్టి ఎవర్ని ఉద్దరించనాక్కర్లేదు .. మీ సానుభూతి తో ఎవరి బ్రతుకులు బాగుపడావ్ .. మీరు చేయాల్సింది పక్కవార్కి సేవా కాదు .. కనీసం లో కనీసం .. మీరు నడుపుతున్న బైక్ / కార్ని సిగ్నల్ పడినప్పుడు ఆపుతూ .. పక్కవాళ్ళ ప్రాణాలు తీయకుండా . మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి చాలు . ఎన్నో సానుభూతి కబుర్లు పేస్ బుక్ నిండా .. ఈ ఒక్కరోజు గమనించండి మనలో ఎంతమంది ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నమో .. ఒక్కరోజైన ఈ ఒక్కరోజైన మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించి .. చనిపోయిన వార్కి అంకితం ఇవ్వండి . 
 • ఒక దురదృష్టమైన సంఘటన జరిగిన తరువాత .. విచారం తెలపడం కంటే . భవిష్యత్ లో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీస్కోవడం ఉత్తమం .
 •  స్కూల్ లో కూడా ధ్యానం చేయడం చిన్న క్లాసు నుంచి నేర్పిస్తే అది వార్కి మనం ఇచ్చే ఆస్తి .

 • మనం ఎవరితో ఐతే బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేద్దామనుకుంటామో .. .. అనుకోకుండా వల్లే మనకి జీవితాంతం గుర్తుండిపోయే శత్రువులైతే .. జీవితం అంటే ఇదే అనిపిస్తుంది .
 • నవ్వు నమ్మినవాళ్ళు నీదగ్గర దాచిపెట్టిన నిజాలు తెల్సుకోవాలని అనుకునే ముందే ..
  వాటిని నువ్వు తట్టుకోగలవో లేదో తెల్సుకో .. అందర్కి నిజాలను తట్టుకోగలిగే శక్తి ఉండదు .


 • చాలసార్లు టీవీ (న్యూస్ ) చూస్తున్నప్పుడు ... అనుకుంటూ ఉంటాను ఒక్కరైన సరే ఆ మైక్ వదిలి పరిగెట్టి కు వెళ్లి ఒక్కరినైన రక్షిస్తారేమోని .
 • ఎంతకాలం పిల్లలకి .. అమెరికాలో చెప్పులు కుట్టుకునేవాడు ప్రెసిడెంట్ అయ్యాడు అని చెప్తారు . కూలిపని చేస్కునేవాడిని కనీసం పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ కూడా అవసరం లేదు మెంబెర్ చేయండి . 

 • మెరుగైన సమాజం కోసం పాటుపడే చానల్స్ కి హీరోయిన్ బొడ్డుపై అరగంట ప్రోగ్రాం చేసి ఏ సమాజాన్ని మేరుగుపరుస్తారు ?


 • ఎక్కువ మందితో ఆర్ధిక సంబంధం పెట్టుకోకు .. మాట్లాడ్డానికి మనుషులను ఎతుక్కోవాల్సి వస్తుంది . 
 • నీకంటూ ఒక రోజు వస్తుంది ...అంటే ఆరోజు కోసం ఏమిచేయకుండా ఎదురు చూడమని కాదు .. అప్పడివరకు నీపని నువ్వు చేయమని  • నిజానికి డబ్బు చదువు పలుకుబడి ... ఇవ్వగలిగే స్థోమత ఉండటం ఒక ఎత్తు . సేవ చేద్దామనే మనసు ఉండటం ఒక ఎత్తు . అసలు కొంతమంది ఎందుకు పుడతారో కూడా తెలియదు .. వాళ్ళకి సేవ తలంపుకి రాగానే వెంటనే ఏదో ఒక బాధ్యత/పని గుర్తుకువస్తుంది . ఏ మనిషి కూడా ఏ బాధ్యత లేకుండా జీవితంలో ఎప్పుడు ఉండడు .
 •  దీపాలు ఆర్పే సంస్కృతి కాదు మనది .. దీపాలు వెలిగించే సంస్కృతి
  మనం పిల్లలికి ఏం చేబుతామో వాళ్ళు అవే చేస్తారు
మీరు తిరుపతి వెళ్ళినప్పుడు హుండీ లేని చోట డబ్బులను బంతులు విసిరినట్టు విసరకండి . ముఖ్యంగా వకులమాత దర్శనానికి వెళ్ళినప్పుడు .. వకులమాత చుట్టూ ఉన్న అద్దాలు పగిలిపోయేటట్టుగా అద్దం లోంచి మరీ మీరు డబ్బులు వేయనావసరం లేదు 

 • అమ్మ ప్రేమ మనకు చిన్నతనంలోనే అర్ధం అవుతుంది .. తండ్రి ప్రేమ మాత్రం ఆయన స్థానం లోకి వెళ్తేగాని మనకు అర్ధం కాదు
 • మూనంగా ఉండటం వాళ్ళ ప్రశాంతతే కాదే .. ఒక్కొక్కసారి ఎదుటవార్ని దహించగలదు  .
 • ఎవర్ని ఎలా చూసి ఇష్ట పడ్డవో అలానే ఇష్టపడు .. వాళ్ళ జీవితాల్లోకి తొంగిచుడ్డానికి తొందరపడకు .
 • ప్రతిసారి చనిపోవడం అంటే .. ఉపిరి ఆగిపోవడమే కాదు . అన్ని చావులాకన్న భయంకరమైనది మానసికంగా చావడం .
 •  
 • మనం ఎంతకాలం బ్రతకబోతున్నమో తెలిసినప్పుడు .. మొదట్లో భయం వేసిన .. తరువాత మనం చేయవల్సిన చివరిపనులు తొందర చేస్తుంటాయ్..

 • ఏ మనిషి ని గుడ్డిగా నమ్మకు ఎందుకంటే అవతలివాడు కూడా మనిషే
 • మనకు బాగా నచ్చినవాళ్ళను వదలడం కష్టమే ... పైగా వాళ్ళు మనతో ఎప్పడివరకు ఉంటారో తేల్సి ..
  ఆ తరువాత వాళ్ళను మనం కలవడానికి చాల సమయం పడుతుంది అని తెల్సినప్పుడు .. గుండెకి ఎంత నచ్చచేప్పుకున్న .. దిగులు చెందకుండా ఉండలేదు .
 •  
 • మనం బాగా నమ్మిన వాళ్ళ చేతిలో మనం మోసపోతున్నాం అని ఎవరో మనకు చెప్పినప్పుడు కలిగిన భాద కంటే ... మనకు మనమే మోసపోతున్నాం అని తెల్సుకున్నప్పుడు కలిగిన భాదే ఎక్కువ
-------------------------------  
 • మా ఆఫీసు నుంచి బయటకు వచ్చి .. రోడ్ క్రాస్ చేయడానికి వెళ్ళగానే ఎక్కడలేని కోపం వస్తుంది... ఒక్కడు కూడా సిగ్నల్ పడినంతనే ఆగడు .. ఒకవేళ ఆగినా .. అరే నడిచేవాళ్ళు కూడా వెళ్ళాలి కదా అని ఆగకుండా .. బైక్ ని రోడ్ మధ్యలో తీస్కునివచ్చి ఆపుతారు .. నడిచేవాళ్ళు వీళ్ళని దాటుకుంటూ .. అటువాచ్చేవాల్లని చూస్కుంటూ .. రోడ్ అవతలిప్రక్కకు వెళ్ళాలంటే .. వామ్మో .. చాల కష్టం . వీల్లందరికి మైక్ లు ఇస్తే మాత్రం ... దేశం పై పడి నాయకులు దోచుకుంటున్నారు .. రోడ్ లు సరిగా లేవు .. అవి ఇవి అన్ని మాట్లాడతారు . 2 ని || సరిగ్గా ట్రాఫిక్ రూల్స్ పాటించలేని వీళ్ళంతా
 • నిజానికి మనది హిందూ మతం అంటే పెద్దలు ఒప్పుకోరు .. సనాతన ధర్మం అని అనాలి అంటారు . సనాతన అంటే ఎప్పడినుంచో ఉంది అని . మతం అనేది చాల చిన్న స్థాయి లోనిది . ఒక వ్యక్తి మతి నుంచి వచ్చింది అని అర్ధం . ఆ వ్యక్తి జన్మించక ముందు ఆ మతం ఉండదు . మన దౌర్భగ్యం ఏమిటంటే మిగిలిన మతం వారు వారి గ్రంధాలను చదువుకుని వారి మతం కోసం తెల్సుకుంటే మనం మాత్రం సినిమా ల ద్వారానే మన ధర్మం కోసం తెల్సుకోవల్సివస్తుంది. ఎప్పుడైనా గమనించార మన దేవులన్ను మనమే అవమానించుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం .. ఏదేశం లోనైనా వాళ్ళ దేవుల్లాను అవమానిస్తున్నాటు మీరు ఎప్పుడైనా చూసారా ? మన గణపతి దేవుణ్ణి మన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉంటాం .. మనకి మనమే ప్రశ్న వేస్కుంటే సమాదనాలు అవే వస్తాయ్ ..


 •  
 •  మనదేశం పైన జరిగిన దండయాత్రల్లో .. బంగారం , వజ్రాలు ఇవి దోచుకున్నారు అంటే అర్ధం ఉంది . వచ్చిన ప్రతి వాడు .. అసలు ఎందుకు గుళ్ళను ద్వంసం చేసారో అర్ధం కాదు .. పైగా వాళ్ళను గోప్ప చక్రవర్తులుగా 10 మార్కుల ప్రశ్నలు ఒక్కటి .
 • నువ్వు పలకరించిన పలకనివారు .. ఉన్నపళంగా నిన్ను తరచూ పలకరిస్తుంటే ..నువ్వు సంబర పడిపోకు .. వారితో కాస్త అప్రమత్తంగా ఉండు
 
 • మన ధర్మం / ఆచారం లో మనం అగ్నిని ఆరాధిస్తాం . మన ఇళ్ళలో దీపం ఆరిపోయింది అని పదప్రయోగం కూడా చేయకుండా దీపం కొండేక్కింది అంటాం . అసలు దీపాన్ని నోటితో ఆర్పే సాహసం కూడా చేయం .. ఇతర దేశాల నుంచి తెచ్చుకుని మనం పచ్చబొట్టుల మరీ పోడిపించుకున్న ఆచారం పుట్టినరోజు వేడుక .. ఈ రోజుల్లో కేకు కోయనిదే , దీపాలు ఆర్పనిదే పుట్టినరోజు కాదు . ఉదయాన్నే లేచి దేవుడికి నమస్కరించి , తల్లిదండ్రుల , పెద్దల ఆశ్సీలు తీస్కోవడం ఎప్పుడో మరీచం మనం . దగ్గర ఉండి మొదటి పుట్టనరోజు నుంచే దీపాలు ఆర్పే కార్యక్రమం అలవాటు చేసి .. ఫ్రెండ్స్ కి పార్టీ పేరు చెప్పి డబ్బులు వాడి జేబులో పెట్టి , కొత్త బైక్ తో బయటకి పంపితే .. పుట్టినరోజే నే వాడు శుభ్రంగా తాగి బైక్ తో రైడింగ్ లు చేస్తూ ఇంటికి వస్తున్నారు . మన పిల్లలు చెడిపోతున్నారు అంటూ అనడమే కాని ఎవరు భాద్యులో మనం ఆలోచించాలి .
 • మనిషి అయినతరువాత సాటి మనిషి అవసరం ఏదో ఒక టైం లో వస్తుంది .. ఆ టైం లో ఎవరైతే తనావసరం తీర్చగాలడో ఆ మనిషి సాయం ఆశిస్తాడు . ఈ మధ్య మరీ ఎవడు మాట్లాడిన నాతొ పని ఉంది కాబట్టే మాట్లాడుతున్నాడు అనుకున్నవాళ్ళే సంఖ్యా ఎక్కువైపోతుంది . ఎవరికీ మాట సహాయం కూడా చేయకుండా ఎంతకాలం బ్రతికితే ఏం ఉపయోగం . అడిగాన వాడు మన తమ్ముడో అన్నో ఐతే సహాయం చేయకుండా ఉండగలమా ? 
 •  ఒక్కటి గుర్తుపెట్టుకుంటే .. నీ నోటివెంట ఎప్పుడు పక్కవాళ్ళు బాగోలేదు అని అనలేవ్ . చూడు ఏ ఒక్కరు అందంగా ఉండకోడదు అని అనుకోరు .వాళ్ళకి పుట్టుకతో వచ్చిన కలర్ , ఎత్తు , జుట్టు , లావు , ఎలా వాళ్ళు నచ్చి ఉంచుకున్నవి కాదు .నువ్వు ఎంతకాలం రంగు చూసి మురిసిపోతవో అంతకాలం నువ్వు ఆ స్థాయిలోనే ఉంటావ్ .
 •  ఈ మధ్యకాలం లో ఇవి బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయ్ ..
  పెళ్ళి అయిన తరువాత నేను మరోక్కరిని ని ఇష్టపడ్డాను .. ఇంటి దగ్గర ఇష్టం లేకుండా నాకు ఈ పెళ్ళి చేసారు .
  ఇది పేస్ బుక్ లో ఫ్రెండ్ షిప్ కాదు .. ఇష్టం లేకపోతె అన్ ఫ్రెండ్ చేయడానికి .. ఇది జీవితం .
  ఇష్టం లేకపోతే ఆ ఏడుపు ముందే ఏడవండి .. అంతే కాని వేరోకరి జీవితం తో ఆడుకునే హక్కు మీకు లేదు .
  * ఇది అమ్మాయలకు అబ్బాయ్ లకు ఇద్దరికీ .
 •  కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పుడు .. వారి గతన్ని తవ్వి లోపాలు ఉంటె దూరం చేస్కునేకంటే .. ఇప్పుడు నీతో ఎలా ఉన్నారో గమనిస్తూ దగ్గరకు తీస్కోవడం ఉత్తమం . 
 • ఒక వ్యక్తి చాల మంచి కార్యక్రమాలు చేస్తూ .. ఒక చెడ్డ పని చేస్తే వీడు ఎలాంటి వాడో తెల్సింది అంటాం .
  ఒక చెడ్డవాడు మంచి పనులు చేస్తుంటే వీడి పనులు కవర్ చేయడానికి ఇదో నాటకం అంటాం .
  ఏ చెడ్డపని చేయకుండా మంచిపనులే చేస్తుంటే .. ఏ కారణం లేకుండా ఎందుకు చేస్తాడు అంటాం .
  మన ఎందుకు ఇలా ఆలోచిస్తాం .. గత అనుభవాలే కారణమా . .
 •  తిరుమల తిరుపతి లో దర్శనానికి అందర్నీ ఒకేలైన్ లో ( స్వామివారి దర్శనం ) పంపినట్టు . అన్ని దేవాలయాల్లోనూ ఉంటే బాగుంటుంది . డబ్బులు ఎక్కువుగా చేల్లెంచే వాళ్ళకి దర్శనం త్వరగా ఐతే పర్వలేదు కాని టికెట్ తీస్కొనివాళ్ళకి మాత్రం స్వామివారి / అమ్మవారి దర్శనం దూరం నుంచి చేయించడం ఎంతవరకు మంచిదో అధికారులు ఆలోచించాలి .
 •  ఒక్కోసారి మనం కోపం / భాద లో మాట్లాడుతున్నప్పుడు .. అదుపు తప్పి మాట్లాడని మాటలు మనం మాట్లాడుతున్నది కాదని గుర్తుంచేవార్ని .. మనం ఎప్పడికి వదులుకోకూడదు ..
 • మనల ఆలోచించే వాళ్లతో మాట్లాడితే .. మనకు మనమే మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది . తెలియని ఆనందం కూడా తోడుతుంది .  
 •  అర్ధం చేస్కోవడం రావాలి గాని .. మౌనంగా మాట్లాడుకోవడం మధురంగా ఉంటుంది .  
 • నువ్వు ఎప్పుడు కొందర్ని మిస్ చేస్కోకు .. వాళ్ళు నిదగ్గర ఉంటే నువ్వు ఎంత అసమర్ధుడివైన నీలో ఉన్న ప్రతిభను గుర్తుంచి నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు .. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిన సరే .. ఎలా ఉన్నావ్ నాన్న అని ఎప్పుడు నీతో మాట్లాడుతూనే ఉంటారు . 

 • నేను దేవాలయానికి ఏం చేయగలను ?
  మారుమూల గ్రామ్మల్లో శిధిలమైన దేవాలయాలను పునః నిర్మించాగలవా ? అంత శక్తి లేదా సరే అలాంటి దేవాలయాలకు విరాళాలు ఇవ్వగలవా ? సరే ఇవ్వలేవా పోనీ నీకు దగ్గరగా ఉన్న దేవాలయం లో సంపూర్ణ రామాయణం / భాగవతం / మహా భారతం గ్రంధాలను ఇవ్వగలవా ?
  సరే అవి కూడా ఇవ్వలేవా మీ వీధిలో ఉన్న దేవాలయం లో దేవుడి కి దీపారాదన చేయడానికి నీ శక్తి కొద్ది నూనే ఇవ్వగలవా ? సరే అవి కూడా ఇవ్వలేవా మీ వీధిలో ఉన్న ఆలయాన్ని తుడవడానికి రెండు చిపిరికట్టలు కొని ఇవ్వగలవా ? అవి కూడా కష్టమా పోనీ వారం లో ఒకసారి గుడికి వెళ్లి చిపిరికట్టతో గుడి లో ఉన్న ఒక అరుగుని శుభ్రం చేయగలవా ?

   
 •  మనిషి సుఖం కంటే ముందుభద్రత చుస్కుంటాడు . 
 • చేసేవాళ్ళకే అన్ని పనులు చెబుతారు ఎందుకంటే .. వాళ్ళు చేస్తారు కాబట్టి .
 • మన పెద్దలు ఎలా జీవించాలని చెప్పారో అది వదిలేయడమే .. నాగరికంగా జీవించడం ఈ రోజుల్లో .. ( ఎవరి జీవితాలు వాళ్ళవి )
 •  
 • తిరుమలలో స్వామి వారి పుష్కరిణిలో స్నానం పరమ పవిత్రం . ఆలాంటి పుష్కరిణిలో దిగి ఈతలు కొట్టడం .. ఒకరిపైకి ఒకరు తోచుకుంటూ ఆడుకుంటూ స్నానాలు చేస్తే .. అక్కడకు వెళ్లి మనం ముటాకట్టుకునేది ఏమిటి ?
 •  
 • దీపావళి కి ఊర్లు వెళ్ళే వాళ్ళు .. ముఖ్యంగా ట్రైన్స్ / బస్సు లో వెళ్ళేవాళ్ళు మీతో పాటుగా దీపావళి సామాన్లు తీస్కుని వెళ్ళకండి . ఒకవేళ ఎవరైనా ట్రైన్స్ లో దీపావళి సామగ్రితో కనిపిస్తే మీరు చొరవ తీస్కుని వార్కి చెప్పడమో .. మాట వినకపోతే TC కి కంప్లేంట్ చేయడమో చేయండి . నాకు ఎందుకులే అని మాత్రం నిద్రపోకండి 
 •  
 • "అభయ" నాకు ఈ పేరు విన్నప్పుడల్లా ఎక్కడలేని కోపం భాద .. ఛి మనం మనుషలమేనా అనిపిస్తుంది .
  ఎవర్ని ఏమనాలి ? చట్టాలు బాగోలేదు అని వాటిని తిట్టాల ? పోలీసు వ్యవస్థ బాగులేదని పోలీసు వాళ్ళని తిట్టాలా ? 100 కోట్ల పైన జనం ఉన్న మనకి ఎంతమంది పోలీసులను పెడతారు వాళ్ళు మాత్రం . మనలో మార్పు రానంతకాలం ఎన్ని కఠిన చట్టాలు వచ్చిన ఫలితం శూన్యం . చట్టాలు వాళ్ళ బెదిరించాగాలమేమో కాని మార్పు తీస్కునిరాలెం .


 • చెప్పడం ఎవరైనా ఈజీ గా చెప్తారు .. అని చాల సార్లు వింటూ ఉంటాం ..
  కాని చెప్పేవాడికే తేల్సుంది .. చెప్పడం అంత ఈజీ కాదు అని
  -- నేను కూడా ఒకటి చెప్పా 
 • చనిపోవడానికి సిద్దపడి మరో రెండు నిమిషాల్లో అతను చనిపోబోతున్నాడు విషయం తెల్సిన వ్యక్తీ ఏమి ఆలోచిస్తాడు .. ఆ టైం లో ఎవరు గుర్తుకు వస్తారు ? ఎవరైనా తనని చావకుండా ఉండేలా చూస్తే బాగున్ను అనుకుంటాడా ?
 • ఇంతక ముందు రోజుల్లో ఏం జరిగిందో తెల్సుకోవడానికి న్యూస్ పేపర్స్ చదివేవారు .
  ఇప్పుడు ఏ న్యూస్ పేపర్ రాసింది నిజమో తెల్సుకోవడం .. ఎంతకష్టమో
 
 • మనం ఆ స్థాయి కి చేరుకోవాలి దానం చేయడం లో :
  పైన హెడ్డింగ్ చూడగానే కర్ణుడు గుర్తుకువచ్చడా ? ఇప్పుడు నేను మాట్లాడబోతున్నది ఆ నలుగురు మూవీ కోసం . ఆ మూవీ లో మీకు రాజేంద్ర ప్రసాద్ కూతురు పుట్టినరోజు జరుపుకునే సన్నివేశం గుర్తు ఉందా ? ఆ అవును కూతురు పుట్టినరోజుకి ఖర్చుపెట్టుకుందాం అని ఉంచిన డబ్బులను చంకలో పిల్లని ఎత్తుకు వచ్చి డాక్టర్ సర్టిఫికెట్స్ చూపిస్తూ డబ్బులు అడుగుతున్నా ఆడావిడకు డబ్బులు ఇవ్వబోతుంటే కోట శ్రీనివాసరావు వచ్చి ఇది మోసం ఈ లాంటి నమ్మకు అంటూ ఎంత చెప్పినా .. నువ్వు ఉండు కోటయ్య అంటూ తన కూతురు చేతులమీదుగా డబ్బులు ఇప్పిస్తాడు .
  అదే ప్లేస్ లో మనం ఉంటే ?
  ఇక్కడ అందరం మాట్లాడతాం కాబట్టి మనం కూడా 100/- ఇస్తాం . ఇంకా బాగా స్వందిచినవారు సగం డబ్బులు ఇస్తారు . ఇంకా ఆదర్శపురుషుడు అనబడేవాడు ఒక పూట మనభోజనం ఆ పాపా జీవితాన్ని నిలబెడుతుంది అంటూ ఇస్తాడు . ఇక్కడ వరకు బాగానే ఉంది .
  కోటయ్య రాజేంద్ర ప్రసాద్ ని రా రా రావయ్యా రఘురాం నేను చెప్పానా ఇది అంత డ్రామా అని ఆ రోజు చూడు పేపర్ లో కూడా వేసారు .. ఆ పిల్లోడికి కేన్సర్ లేదంటా అంటూ పేపర్ చూపిస్తాడు . రాజేంద్ర ప్రసాద్ పేపర్ చూస్తూ ఆనంద పడుతూ నిజమే కోటయ్య .. కేన్సర్ లేదంటూ ఆనందంగా వెళ్ళిపోతాడు . ఆ స్థాయి కి చేరుకోవాడానికి ఎంత టైం పడుతుంది .
  ఆదే ప్లేస్ లో మనం ఉంటే ..
  డబ్బులు ఇస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు అంటూ పక్కనున్నవాళ్ళను కుడా .. అందర్నీ కలిపి ఎవరి స్థాయిలో వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేస్తాం . ఈలాంటి వాళ్ళు బాగా ఎక్కువైపోయారు అంటూ దేశ పరిస్థితి లను ఒకసారి తలుచుకుని దేశానాయకులను కూడా తిట్టడం స్టార్ట్ చేస్తాం .. అసలు మనం డబ్బులు ఎందుకు ఇచ్చామో మరిచిపోతాం :)
 •  
 • ------------------------
 • నాకు ఈ పేస్ బుక్ ఫ్రెండ్షిప్ పెద్దగ ఇష్టం ఉండదు .. ఇవి మనం ఆన్లైన్ ( online ) లో ఉన్నంత కాలమే ఉంటాయ్ ..
 • ------------------------------
 • స్నేహం అంటే ఎలా ఉండాలో .. మనకు విదేశీయులు చేప్పాల ?
  మనమే చెబుదాం స్నేహానికి మనం ఇచ్చే విలువ .. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ( స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు )
 • ---------------------------------------------------------
 • నిన్న నేను మా ఊరిలో చిన్నపిల్లలు వినాయక విగ్రహం పూజచేస్తున్నారు అని చాల సంబరపడ్డాను కదా !
  అసలు విషయం ఏమిటంటే నేను భవిష్యత్ లో పిల్లలకి సన్ డే స్కూల్ లాంటిది పెట్టి . అక్కడ చిన్నపిల్లాలకి మన సనాతన ధర్మం గురించి వివరించాలని . అసలు మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం ? నమస్కారం ఎందుకు చేయాలి ?ఈ లాంటి విషయాలను వాళ్ళకి తెలియచేస్తూ పిల్లలో మనం హిందూ ధర్మం గొప్పదనాన్ని తెలియచేయాలని నా కోరిక . పూర్వం రోజుల్లో పెద్దలు పిల్లలకు చెప్పేవాళ్ళు .. అమ్మామ్మ తాతయ్య ద్వారా పిల్లాలకు ఈ విజ్ఞానం చేరేది . కాని ఇప్పుడు మనకి తెల్సిందే తక్కువ .. ఈ బిజీ లైఫ్ లో మూవీ చూడ్డానికి టైం ఉంటుంది కాని . పిల్లాలను కూర్చోబెట్టి చెప్పే ఓపిక మనకు లేకుండా పోయింది . ఇకనుంచి మా ఉరు వెళ్ళినప్పుడు ఈ పిల్లలకి వివరిస్తూ నెమ్మదిగా ప్రతి ఒక్కరికీ తెలిసేలా చెయ్యాలని నా కోరిక .
  • ------------------------------------------------------------------- 
   భక్తే ముఖ్యం :
   
  ఒక్కోసారి మనకు అర్ధం పర్దం లేని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయ్ . పూజానియమాలు తెల్సుకోవడం మంచిదే , పూజలో దోర్లుతున్న తప్పులను సవరించుకోవడం మంచిదే కాని వాటికోసం పూజనే మానివేయడం తప్పు .
  దేవుడు ఎంత కారుణ్య ముర్తో చూడండి ..
  1. భక్తకన్నప్ప పెట్టిన నైవేద్యం ఏమిటి ? జింక మాంసం .. అయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు . కాని దేవుడు ఛి నీచుడా . . నీకు ఏమి నైవేద్యంగా పెట్టాలో తెలియదు . నువ్వు స్నానం చేసావా ముందు . విభూది పెట్టుకోలేదు దూరం జరుగు అనలేదు . పరమ సంతోషం తో స్వీకరించాడు . ఇక్కడ అర్ధం చేస్కోవాల్సింది అందర్నీ జింక మాంసం పెట్టమని కాదు శివుడికి జింక మాంసం ఇష్టం అని కాదు . నువ్వు భక్తితో ఏది పెట్టిన భగవంతుడు స్వీకరిస్తాడు .
  2. గజేంద్ర మోక్షం లో గజ రాజు ప్రాణం పోతున్నా సమయం లో స్వామి వార్ని పిలిస్తే స్వర్గం లోంచి పరుగెత్తుకుని మరీ వచ్చాడు .. పైగా శంకు చక్రం కూడా తిస్కోనిరాకుండా . లక్ష్మి దేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు అంతే కాని నీ చిన్నాప్పటి నుంచి ఒకసారి కూడా పూజ చేయలేదు . ఈ టైం లో నీకు గుర్తుకు వచ్చానా .. నీ చావు నువ్వు చావు అనలేదు . ఆపదలో ఉన్నవాణ్ణి కాపాడటానికి ఏ రూపం లో ఐన వచ్చికపాడతాడు ఆయన .
  3. ద్రౌపతి అన్న శ్రీ కృష్ణా అంటే వెంటనే వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించాలేదా ? నిన్ను ముట్టుకోకూడదు మూడు రోజులు తరువాత పిలు వస్తాను . అప్పడివరకు నన్ను తలచకు అని చెప్పలేదే . భక్తీ తో స్వామి నీవే తప్ప నన్ను రక్షించేది ఎవరు అని శరణు వేడితే తప్పకుండ ఏదో ఒక రూపం లో స్వామి పలుకుతాడు .
  పూజ చేసేటప్పుడు ఎన్ని వత్తులు వెయ్యాలి .. అవి ఎ దిక్కుకు తిప్పాలి . ఎ నూనేతో వెలిగించాలి అంటూ పూజ ప్రారంభం లోనే సవాలక్ష ప్రశ్నలతో మొదటిలోనే అడిగిపోతే ఎప్పుడు పైకి వస్తావ్ నువ్వు . ఎప్పుడైనా ఒక్కటే గుర్తు పెట్టుకో .. స్వామి కి కావాల్సింది భక్తి తప్ప అంగులూ ఆర్భాటాలు కావు . ఏదైనా పూజలోనో వేరే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తప్పులు దొర్లితే స్వామి ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి అంటే అయన చిరునవ్వుతో మన్నిస్తాడు . తెలిసి కూడా తప్పుచేసి కవర్ చేసే పనులు మాత్రం చేయకూడదు .
  ----------------------------------------------------------------------------------------------
  మీరు గోవులకి పూజలు , గోశాలలు కట్టించకపోయినా పర్వలేదు . కనీసం రోడ్ పై డొక్కలు లోపలికి పోయి .. ప్లాస్టిక్ సంచులలో ఎమన్నా ఉన్నాయేమో అని తన మూతిని పెట్టి వెతుకుతున్న గోవులకి దొరికితే అరటిపళ్ళు 10/- పెట్టి కొనుక్కుని తిని .. అరటితోక్కలనైన ఆ గోవులకి వేయండి .

 • హలో రాజాచంద్ర మాట్లాడేది
  ఆ అవునండి మీరు ఎవరు ?
  దేవాదాయ ధర్మదాయ శాఖ ఆఫీసు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం .. మీరు పేస్ బుక్ లో టెంపుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానారు కదా ! చాలాబాగుంది మీకు ఎ . పి లో ఉన్న టెంపుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాం .. మీరు షేర్ చేయండి
  సార్ నేను చెన్నై జాబు లో చేస్తున్నాను .. ఏదో నా ఫ్రీ టైం లో ఉన్నప్పుడు అక్కడాక్కడ ఇన్ఫర్మేషన్ సేకరించి షేర్ చేస్తున్నాను .
  రాజాచంద్ర గారు మీకు మా ఆఫీసు లో వర్క్ చేయడం ఇష్టమేనా ?
  సార్ అంటే govt . job నా ?
  అవునండి .. టెంపుల్స్ ని అందర్కి తెలియచేయడమే మీ పని .. ఎప్పుడు జాయిన్ అవుతారు . మీలాంటి వాళ్ళు ఈ డిపార్టుమెంటు కి చాల అవసరం .
  సార్ .. చాల థాంక్స్ అండి . నాకు చాల ఇష్టం మీతో వర్క్ చేయడం . నేను ఆఫీసు వాళ్ళకి వన్ మొంత్ నోటీసు పీరియడ్ ఇవ్వాలి . వచ్చే నెల జాయిన్ అవుతాను . థాంక్స్ అండి చాల ఆనందం గా ఉంది .
  ఒకే .. రాజాచంద్ర గారు నేను మా సార్ కి చెప్తాను అయితే . ఉంటాను
  అలాగే అండి ..మరో సారి థాంక్స్ మీకు .. బాయ్ అండి .

  -- రాజా ఆఫీసు కి లేట్ అవుతుంది లేవరా ? వంటచేయవా ? రైస్ పెట్టుకో వెళ్లి 
 • Joined Facebook 19 March                                                                    

Comments