Sri Kalahasti Templeinformation

శ్రీ కాళహస్తి   - | Srikalahasti ( Vayulingam) - Andrapradesh
శ్రీ కాళహస్తి

కాకినాడ నుంచి తిరుమల వెళ్ళే భక్తులకు నా సలహా ఏమిటంటే .. తిరుమల వెళ్ళే శేషాద్రి exp . శ్రీ కాళహస్తి లో 4.30 -5. 00 ఆ టైం లో ఆగుతుంది మీరు అక్కడే దిగండి . రైల్వే స్టేషన్ లో స్నానం చేయడానికి ఏర్పాట్లు బాగానే ఉన్నాయ్ .. అక్కడ నుంచి టెంపుల్ కూడా దగ్గరే బయట ఆలయం వాళ్ళు ఏర్పాటుచేసిన ఉచిత బస్సు  మరియు షేర్ ఆటో లో కూడా ఉన్నాయి  .. శ్రీ కాళహస్తి లో ఉన్న  శివలింగం పంచభూతలింగాల్లో  ఒకటైన వాయు లింగం . మీరు దర్శనం చేస్కునేప్పుడు గమనిస్తే లింగానికి ఎదురుగ ఉన్న దీపం స్వామి వారి నుంచి వస్తున్నా గాలికి దీపం ఊగుతూ కనిపిస్తుంది . అక్కడ ఉన్న పూజారులు మీకు చెబుతారు .. మరో విషయం ఏమిటంటే మనం అక్కడ ఇతర కోరికలు ఏమి కోరకూడదు అని పెద్దలు చెబుతారు .. ఈ ఆలయం లో స్వామి వారి కంటే ముందే అమ్మవార్కి  ఉదయాన్నే పూజలు ప్రారంభిస్తారు .. భక్తుడైన కనప్ప కొండపైన దేవుడు కొండ క్రింద ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తి . ముందుగా భక్త కన్నప్పను దర్శించుకుని తరువాత స్వామి వారని దర్శనం చేస్కోవాలి అని స్థలపురాణం .. స్వామి వారి ఆలయం నుంచి బయటకి వచ్చేటప్పుడు కుడివైపుకి వైపు కి మీరు వెళ్తే అక్కడ చోట నుంచి చూస్తే  .. భక్తకన్నప్ప గుడి , అమ్మవారి గుడి , ఆలయ ద్వజస్థంబం కనిపిస్తాయి . అక్కడ ఉన్నవాళ్ళని అడగండి వాళ్ళు చూపిస్తారు . ఇక్కడ నుంచి తిరుపతికి రెగ్యులర్ గ బస్సు లు ఉంటాయి . ఆలయం బయట నిలబడితే అక్కడికే వచ్చి ఆగుతాయి సుమారు 1గం ॥ సమయం పడుతుంది . 
 


 
చారిత్మాక ప్రాశస్త్యం
క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయన్మారులను శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ చక్ర ప్రతిస్థాపన గావించియున్నారు.వారె స్పటికలింగము నొకటి నెలకోల్పినారు.పల్లవ,చోళ ,విజయనగర రాజుల కాలపు శిల్ప కళ వైపుణ్యం ఈ క్షేత్రమును వెలసినవి.క్రి.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు పెద్ద గాలిగోపురమును , నూరు కాళ్ళ మండపమును (రాయల మండపము) నిర్మించినారు

శ్రీకాళహస్తిశ్వరస్వామి మహత్యం

శ్రీకాళహస్తిశ్వరస్వామి స్వయంభువు,శ్రీ అనగా సాలె పురుగు,కళా అనగా పాము,హస్తి అనగా ఏనుగు,ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యం పొంది శివునిలో గలసిపోయినవి.అందువలన ఇచ్చట స్వామి వారికీ శ్రీ కాళహస్తిశ్వరుడు అని ఈ పురముకు శ్రీ కాళహస్తి అనియు పేరు వచ్చెను

సాలె పురుగు- శివ సాయుజ్యం
కృతయుగంలో చెలది పురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండఫైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివుని పూజించుచుండెను.ఒకనాడు శివుడు పరిక్షింపదలచి అక్కడ మండుచున్న దేపములో తగిలి సాలీడు రచించిన గుడి గోపురములను తగులబడిపొవుచున్నట్లు చేసిను. ఇది చుసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రతక్ష్యమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను.అపుడు సాలీడును మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకొనెను.అందుకు శివుడు సమ్మతించి సాలిడుని తనలో ఐఖ్యమైనపోవునట్లు చేసిను.ఈ విధముగా సాలీడు శివసాయుజ్జ్యము పొంది తరించింది

నాగు పాము-ఏనుగు-శివారాధన చేసి తరించుట
ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది.ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినము శివలింగమునకు పూజ చేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి,ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమునకు పూజచేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమును సేవింపజొచ్చెను.అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు,పుష్పములు,బిల్వదళములు తెచ్చి,పాము సమర్పించిన మణులను త్రోసివేసి,తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెడలి పోవుచుండెను.మరునాడు ఉదయం పాము వచ్చి చూచి తాను పెట్టి వెళ్ళిన మణులను గానక వానికి బదులు బిల్వములు,పుష్పములు పెట్టియుండుట గాంచెను.అప్పడు పాము మనస్సున చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి వెళ్ళిన పువ్వులను త్రోసివేసి,తాను ఇట్లు కొంత కాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు ,ఏనుగు ఉంచిన పుష్పదులను పాము శుబ్రపరచి తమ తమ ఇష్టనుసరముగా పూజచేసి ఈశ్వరుని సేవించుచు వచ్చినవి..ఒక రోజు పాము విసుగెత్తి తన మణుల త్రోయబడి ఉండుటకు కోపం చెంది.ఈ విషయమునకు కారణము తెలుసుకొన గోరి ప్రక్కనే యున్నా పొదలో దాగి పొంచి యుండెను.అది గమనించిన పాము కోపముతో తన శత్రువుఅయిన ఏనుగు తొండములో దూరి కుంభస్టలమున నిలిచి డానికి ఉపిరి ఆడకుండా చేసిను.ఈ భాధకు ఏనుగు తాళ్ళజాలక ఈశ్వర ధ్యానంతోతొండముతో శివలింగము తాకి శిరస్సును గట్టిగా రాతికిమోది తుదకు మరణించెను.ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్టలమున నుండిన పాము గూడా చచ్చి బయటబడినది.ఇట్లు ఇద్దరు తమ తమ నిజ స్వరూపంతో రుద్ర గణములుగా మరి స్వామి ఐఖ్యమొందిరి.

ఈ స్మృతి చిహ్నంగా కాళము పంచ ముఖ ఫణాకారముగా శిరోపరిభాగమునకు ఏనుగు సూచకముగా రెండు దంతములను,సాలె పురుగు అడుగు భాగంలోనూ,తన లింగాకృతిలో నైక్యమొనరించుకొని శివుడు శ్రీ కాళహస్తిశ్వరుడుగా ఇచ్చట దర్సనం ఇచ్చుచున్నాడు.ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రంకు `శ్రీ -కళా-హస్తి అని పేరు వచ్చింది
 శ్రీ కాళహస్తి లోని గాలి గోపురం. శ్రీకాళహస్తికే మారుపేరుగా వుండిన ఈ రాయల గోపురము కూలి పోయింది.

సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమున కెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు. శ్రీ కాళ హస్తి తిరుపతికి సుమరు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది. అన్ని విదాల రవాణ సౌకర్యాలున్నవి.

ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ , అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్టుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కధలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి వారికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడ నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకము లయిన చిత్రములు వున్నాయి. " మణికుండేశ్వరాఖ్య " అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారక మంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము కలదు. దేవాలయమునకు సమీపములో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాస మనియు, సత్య మహా భాస్కరక్షేత్ర మనియు , సద్యోముక్తి క్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్థంభాలు కలిగిన మంటపం మరియు అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం మే 26, 2010 న కూలిపోయింది.

క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపు కొన్నాడు. 1912లో దేవకోట్టై కి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుది రూపునిచ్చారు. ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు బయట వున్న కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి.
శ్రీ కాళహస్తి ఆలయ ప్రాంగణము

* నాలుగు దిక్కుల దేవుళ్ళు

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖుని గాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు)గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.
శ్రీకాళహస్తి ఆలయ రథము. దీనిపై స్వామివారిని ఉత్సవ సమయంలో ఊరేగిస్తారు

* గోపురాలు
ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, మరియు 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.

* రాహు కేతు క్షేత్రము
ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.

* దక్షిణామూర్తి
దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందు కొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.

ఆలయంలో జరిగే కొన్ని సేవలు - కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము

* తీర్ధాలు
ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయట. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.

* ఇతర విశేషాలు
ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి.
Share on Google Plus

About Raja Chandra

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

10 comments:

Lord Shiva Temples

Have You Visited These Temples

Contact:

కోత్తగా వెబ్సైటు స్టార్ట్ చేశాను .. చూసి మీ సలహాలను ఇవ్వగలరు . www.hindutemplesguide.com

Sponsor

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu