Brihadeeswarar Temple ( Big Temple )
బృహదీశ్వరాలయము భారతీయుల ప్రతిభకు నిలువేత్తు నిదర్శనం . 1000 సంవత్సరములు పూర్తిచేస్కుని చెక్కు చెదరకుండా సింహం ల కనిపిస్తుంది . మన వాళ్ళ ప్రతిభకు ముందు చూపుకు బృహదీశ్వరాలయము నిదర్శనం . ఎటువంటి ఆధునిక పరిజ్ఞానం లేని 1000 సంవత్సరాల క్రితం కేవలం 5 సంవత్సరాల వేవదిలోనే అంత పెద్ద ఆలయం ఎలా నిర్మించారో! ? .
సునామి వచ్చినప్పుడు కూడా ఎటువంటి కధలిక లేక .. స్థిరంగా నిలబడలే మనవాళ్ళు చేసిన నిర్మాణం అద్బుతం . ఈ ఆలయం లో ఆశ్చర్య పరిచే ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి . ఎవరికీ అంతుపట్టని ఊహకు అందనివి .
The Peruvudaiyar Kovil, also known as Periya Kovil, Brihadeeswara
Temple, RajaRajeswara Temple and Rajarajeswaram, at Thanjavur in the
Indian state of Tamil Nadu, is a Hindu temple dedicated to Shiva.
1.ఈ ఆలయాన్ని క్రీ.శ 1004లో ప్రారంభించి 1009 లో పూర్తి చేసారు. కేవలం ఐదు సంవత్సరాలలో ఇంతపెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణకౌశల్యతకు నిదర్శనం. అవును ఈ ఆలయాన్ని నిర్మించి వేయి సంవత్సరాలయింది. బహు పురాతన ఆలయమిది.. అందుకే ప్రపంచ వారసత్వ సంపద వారు దీనిని రక్షిత ప్రదేశంగా పరిగణించారు...
2.బృహదీశ్వర లింగం మన భారతదేశములో ఉన్న అతి పెద్ద లింగములలో ఒకటి.
ఇది నిజం గానే 8.7 మీటర్ల ఎట్టు అయిదు మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం .
అంత పెద్ద శివ లింగానికి నందీశ్వరుడు కూడా భారీగా ఉండాలనుకున్నారో ఏమో అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.
3.ఒకప్పుడు ఈ మహాలింగం కేవలం రాజు గారు మాత్రమే దర్శించుకునే వారు... సామాన్య జనులకు ప్రవేశం ఉండేది కాదు..
4.తర్వాత్తరాత దీనిని సామాన్య జనం కూడా దర్శించుకునేందుకు అనుమతించారు...
5. అతి పెద్దదైన ఈ లింగమునకు చేసే పూజలు కూడా ఘనంగా ఉంటుంది. మీరే చూడండి.
6. ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి... ఇవేవీ ఉపయోగించలేదు.నిర్మాణంపై ఎలాంటి పూతా పూయలేదు. పునాదుల దగ్గర నుంచి పీఠాలు, గోపురం, శిఖరం... ఇలా అన్నీ రాళ్లతోనే తయారయ్యాయి. వాటి బరువుని బట్టి ఒక రాయి మీద మరో రాయిని పేర్చి నిర్మించారు. ఈ ఆలయ గోపురం 13 అంతస్తులు వుంది.
7. కేవలం ఈ ఆలయ నిర్మాణం కోసమే చాలా దూరము నుండి గ్రానైట్ రాయిని తెప్పించి రాజా రాజా చోళుడు 6 సం. కాలములో కట్టించినట్లు చరిత్ర చెబుతుంది.
8. ఈ దేవాలయ ప్రాకారం ఎంత పొడవంటే దాదాపు 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. అంటే నాలుగు ప్రదక్షిణాలు చేస్తే ఒక కిలోమీటరు దూరం నడిచినట్లు... ఔరా ఎంత పెద్దగా ఉండి ఉంటుంది గుడి... ఎంత సువిశాలంగా ఉన్న ఇక్కడ ప్రతిధ్వని ఉండదు.. అదే మన ప్రాచీన భారతీయ ఇంజనీర్ల ప్రతిభ. ప్రధాన దేవాలయ గోపురకలశం మొత్తం ఒకే శిలతో రూపుదిద్దుకుని 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినది.
9. అంత ఎత్తుకు ఇంత పెద్ద గోపుర కలశాన్ని వేయి ఏళ్ళ క్రితం ఎలా తీసుకెళ్ళారో చాలా అద్భుతంగా ఉంటుంది...
ఈ
రాయిని గోపురంపైకి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. గోపురం నుండి
ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామం దగ్గర్నుంచి ఏటవాలుగా ఉండే ప్రత్యేక
వంతెనను నిర్మించారు. శిఖరం రెండు తలాలుగా ఉంటుంది. తంజావూరు చుట్టుపక్కల
ఎక్కడా కొండలు, గుట్టలు కనిపించవు. ఈ రాళ్లను దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో
ఉన్న పుదుకొవై ప్రాంతంలోని రెండు కొండల్ని పూర్తిగా తొలిచి తీసుకొచ్చి
ఆలయం నిర్మించి ఉంటారని ఒక అంచనా.
తంజావూరు పట్టణంలో అత్యధికంగా సందర్శింపబడే బృహదీశ్వరాలయము ఉంది.ఈ ఆలయంను
రాజ రాజ చోళ-I, మధ్యయుగ చోళ రాజు 11 వ శతాబ్దం AD లో నిర్మించారు. 1987 వ
సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
తమిళనాట
కావేరీ నదీ తీరాన కళలకు కాణాచిగా వెలుగొందిన తంజావూరు నగరంలోని
బృహదీశ్వరాలయం శిల్పసౌందర్యానికి పెట్టిందిపేరు. పునాదులే లేకుండా 11వ
శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించిన ఈ శివాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ
ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. 216 అడుగుల ఎత్తయిన గోపురం, దానిపై 80 టన్నుల
కలశం, గర్భగుడిలో 13 అడుగుల ఎత్తయిన ఏకశిలా లింగం, బయట ఏకశిలా నంది ఇలా
ఎన్నెన్నో శిల్పకళా మహాద్భుతాలు ఇక్కడ కొలువై ఉన్నాయి..
Rajarajeeswaram, the Big Temple in Thanjavur
10. ఈ ఆలయ గోపురాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు(ఎందుకంటే దాదాపు పదమూడు అంతస్థుల భవనమంత ఉంటుంది మరి)
11. ఈ ఆలయ నిర్మాణమంతా కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పి చే చేయబడినది.
12. ఇప్పటికీ దేశంలో అతి పెద్ద ఆలయంగా దీన్నే చెబుతారు. జీవితకాలంలో ఒక్కసారైనా తప్పని సరిగా చూడవలసిన ఆలయం....
తంజావూరు బృహదీశ్వరాలయము గోపురం 216 అడుగుల ఎత్తు ..
ఈ ఆలయం పై వర్షం పడినప్పుడు శిఖరం నుంచి క్రిందవరకు నీటిని ఒకచోటకు
వచ్చేలా చేసి అక్కడనుంచి ఒక గొట్టం ద్వారా కోనేరు / భూమిలోపలకి పంపేల
ఏర్పాటు చేసారు . 1000 సంవత్సరాల క్రితమే మనవాళ్ళు ఎంత గోప్పగా ఆలోచించారో
చూడండి ..
తంజావూరు బృహదీశ్వరాలయం గుడిలోపల "ప్రతిధ్వని " ఉండదు . మనం మాట్లాడిన మాటలు మనకు తిరిగి వినబడవు .. 1000 క్రింతం మనవాళ్ళు సాధించారు .. పైగా గుడి అంతా రాయిచే నిర్మించబడింది . సౌండ్ తిరిగి రాకుండా ఎలా చేయగలిగారో .
Nice
ReplyDeleteNice
ReplyDeleteGood post about the Brihadeeswarar Temple.I had a great time reading your post and got a lot of information about the temple.Book your in SRS Travels
ReplyDelete