KOTIPALLI TEMPLE INFORMATION

SRI SOMESWARA TEMPLE, KOTIPALLI, 
EASTGODAVARI.ANDHRAPRADESH 
ఈ రోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ( దాక్షారామం ) సమీపం లో గల కోటిఫలి ( కోటిపల్లి ) వెళ్లి , అక్కడ కోలువై ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ( శివుడు ) ని దర్శించుకుని తరిద్దాం . నల్లనయ్య ఇక్కడ సిద్ది జనార్ధనిడిగా పూజలందుకుంటున్నాడు .  ఈ ప్రదేశం లో ఏపని చేసిన కోటి ఫలితాల్ని ఇస్తుందని చేబుతారు. ఎప్పుడు పట్నాల్లో ఉంటూ పచ్చటి పొలాలకు దూరంగా ఉంటూన్నవారికి కోటిపల్లి యాత్ర చిరకాలం గుర్తుండి పోతుంది . కాకినాడ నుంచి సుమారు 40 కిలోమీటర్లు దూరం కోటిపల్లి కి .
40 కిలోమీటర్లు దూరం ఐనప్పటికిని ప్రయాణం సాగుతున్న కొద్ది ,రోడ్డు కి ఇరువైపులా కోబ్బరి చెట్లు , కనబడినంత దూరం లో పచ్చటి పోలాలు , అక్కడక్కడ రొయ్యల చెరువులు   బస్సు వేగానికి చల్లటి గాలి వీస్తుంటే మన ప్రయాణం సాపీగా సాగుతుంది . మద్యలో కనబడే పల్లెటూర్లు , ఊరి పొలిమేర్లలో గ్రామా దేవతలు  .. గొల్లపాలెం దగ్గరకు రాగానే బస్సు స్లో చేస్తారు గ్రామా దేవత పేరు ధనమ్మ తల్లి ఒకసారి దర్శనం చేస్తే నేను మధ్యలో ఎందుకు ప్రస్తావించానో  తెలుస్తుంది.

కోటిఫలి గౌతమీ నది ( గోదావరి ) ఒడ్డున ఉంది . పుష్కరాలకు స్నానపుఘాట్ల నిర్మాణం పుర్తిగావోస్తుంది .
ఇచట  గౌతమీ పుణ్య నదీలో విష్ణుతీర్ధ, రుద్రతీర్ధ,బ్రహ్మతీర్ధ,మహేశ్వర తీర్ధ,రామతీర్ధాది అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో అంతర్వహినులుగా ప్రవహించుచున్న కారణముగా " కోటి తీర్ధ క్షేత్రము "గా ఖ్యాతి వహించినది .


స్వామి వారి  ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరును సోమగుండం అని పిలుస్తారు .వ్యాస భగవానుడు రచించిన బ్రహ్మాండ పురాణములోని గౌతమీ మహాత్యములో ఈ కోటిపల్లి క్షేత్ర మహత్యముంది .
ఈ క్షేత్రము పూర్వకాలమున "కోటి తీర్ధము గాను" సోమ ప్రభాపురము " గాను పిలువబడి నేడు "కోటిఫలి" మహాక్షేత్రముగా ఖ్యాతిపొంది విలసిల్లుచున్నది .

SIDDHI JANARDHANA SWAMY TEMPLE
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సిద్ది జనార్ధనాలయముశివకేశవ భేదం లేదని ఈ క్షేత్రం మనకు పున: పున: చెబుతుంది. కోటీశ్వర లింగం యోగ లింగం అని, సోమేశ్వర లింగం భోగ లింగం అని, రాజరాజేశ్వరమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లి అని భక్తుల నమ్మిక.

శ్రీదేవి,భూదేవి సమేతుడైన సిద్ధి జనార్థన స్వామి వారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించారు , సిద్ధి జనార్థన స్వామి వారే క్షేత్రపాలకుడిగా ఉన్నారు . 

KOTESWARA SWAMY TEMPLE
ఉమా సమేత కోటిశ్వరాలయము

ఇంద్రుడు కోటిశ్వర స్వామి వార్ని ప్రతిష్ఠించగా , సోమేశ్వర స్వామి వార్ని చంద్రుడు  ప్రతిష్ఠించడు .  కోటేశ్వరుడు ఎప్పుడు నీటిలోనే ఉంటాడు . 


SOMESWARA SWAMY TEMPLE
శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి
చంద్రుడు కోటి తీర్ధమునకు వచ్చి , గౌతమీ పుణ్యనదిలో భక్తీ శ్రద్ధలతో శ్రీ సిద్దిజనార్దుని , కోటీశ్వరుని దర్శించి సేవించి సోమేశ్వర నామంతో శివలింగమును ప్రతిష్ఠించి పూజించి ప్రార్ధించి పాప విముక్తుడాయేనని , తాను కోల్పోయిన ఛాయను తిరిగి పొందుటచే ఈ లింగమునకు " ఛాయా సోమేశ్వర లింగము పేరు వచ్చినది అని స్థలపూరణం .

 


ఈ లింగమును భోగలింగము .


SRI RAJARASWARI TEMPLE
3. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు 

అమ్మవారికి ప్రత్యేక ఆలయము కలదు . అమ్మవారు దివ్యమైన తేజస్సుతో నిరంతరమూ ప్రశాంత వదనముతో చిదానందముతో కూడిన వాత్సల్య పూరితమైన చూపులతో భక్తులకు దర్శన మోసంగుచూ వేంచేసియున్నారు .KALABHARAVA TEMPLE
4. కాలభైరవాలయము


ఆదిశంకరచార్య

ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు.


ఆలయం లో నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉన్నాయి. ఉత్తర మడపం లో కాలభైరవ స్వామి మందిరం ఉంది. ఈ దేవాలయం లోనే చంద్రమౌళిశ్వర స్వామి శంకరాచార్యుల మందిరం, ఉమా సమేత మృత్యంజయ లింగం , నవగ్రహాల గుడి ఉన్నాయి.

KOTIPALLI TEMPLE POOJA TIMINGS : 
ఆలయ పూజా సమయాలు : గోదావరి పుష్కరాలకు ఆలయం ముస్తబౌతుంది . . 
గోదావరి నది ఒడ్డున ఆ రావి చెట్టు నీడలో కూర్చుంటే  . ఆ చల్లటి గోదారిగాలి వీస్తుంటే అబ్బ ఏమి గాలి .. గోదావరిని చూస్తూ మనస్సు పులకరిస్తుంది .  రేవు దాటడానికి వస్తున్నా జనం , పుష్కర ఘాట్లు ఎటు చూసినా గోదావరే . ఏముంది అటువైపుగోదావరి రేవు  అవతల ముక్తేశ్వరం .. అయినవిల్లి క్షేత్రాలు ఉన్నాయి . 
శివరాత్రి రోజు రాత్రి ఈ దేవాలయ ప్రాంగణం లో కోటి దీపాలు వెలిగిస్తారు.
ద్రాక్షారామం చుట్టూ వున్న అష్ట సోమేశ్వరాలలో కోటిపల్లి ఒకటి.
__
పచ్చటి పోలాలు .. మధ్య మధ్యలో చేపల చెరువులు .. కొబ్బరిచెట్లు . ఓ పెద్ద రేవు . చల్లటి గాలి . తెలియకుండానే మన మనసు లగ్నమయ్యే ఆధ్యాత్మిక ప్రదేశాలు అవి . 
యాత్ర ఈ విధంగా ప్లాన్ చేయండి . 
కాకినాడ (RTC Bus Complex) --> Bhimeswara Swamy templ e  ద్రాక్షారామం ( దాక్షారామం ) 30 KM
 ద్రాక్షారామం ---> కోటిఫలి (Kotipalli ) Someswara Swamy Temple (10 km )
కోటిఫల్లి--> ముక్తేశ్వరం ( రేవుదాటాలి ) Mukteswarudu 
ముక్తేశ్వరం -->  అయినవిల్లి 1.5 కిమీ  వినాయకుడు 


అయినవిల్లి  --> మురుమళ్ళ  Veereswara Swamy 20 km 

మురుమళ్ళ  --> కాకినాడ

Comments

Post a Comment