విష్ణు సహస్ర నామ స్తోత్ర పోటీలు ఈ నిర్వహించాను , ఈ రోజు పోటీలలో హేమ ( 9వ తరగతి) యజ్ఞశ్రీ (5వ తరగతి ) అజయలక్ష్మి (8వ తరగతి) నరసింహ (9వ తరగతి ) వీరు పోటీలలో 108 శ్లోకాలు చూడకుండా అప్పచెప్పారు , విశేషం ఏమిటంటే వీరందరి కంటే ముందే సాయి (3వ తరగతి) అప్పగించి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు . ఈ రోజు సాయి లేకపోవడం తో చాక్లెట్ మిస్ అయ్యాడు . ఈ రోజు 108 శ్లోకాలు అప్పగించలేని వారి కోసం మరో అవకాశం ఇవ్వడం జరిగింది వారికి బుధవారం పోటీ పెట్టాను మా లక్ష్యం అందరూ 108 శ్లోకాలు అప్పగించాలి, పెద్దాపురం లో నిర్వహించే విష్ణు సహస్రం పోటీలలో విజయం సాధించాలని. మొత్తం ఇప్పటికి 10 మందికి 108 శ్లోకాలు చూడకుండా వచ్చాయి .
తొలి తిరుపతి దేవస్థానం లో పిల్లలకు విష్ణు సహస్రం పాడేలా ఆలయ ఈఓ కాట్నం రామ్మోహన్ గారు అవకాశం ఇచ్చారు , మేమందరు వెళ్లి పారాయణ చేయడం జరిగింది ఆ రోజు పిల్లల పారాయణ చూసిన చిల్లంగి ఆలయ పూజారిగారు మే 13వ తేదీన వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం లో విష్ణు సహస్రం పారాయణ చేయవలసిందిగా ఫోన్ చేసి అడిగారు , ఆ కార్యక్రమం కోసం పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు .
పిల్లలకు చాకోలెట్స్ అమెరికాలో ఉంటున్న వెంకట్ గారు స్పాన్సర్ చేసారు .
The most popular Indian Astrologer Pandit Sairam Ji in California serves his followers across the globe.
ReplyDeletebest astrologer in new york