చాలా ఆనందంగా మీతో ఈ విషయం పంచుకుంటున్నాను
మా గ్రామం లో 6 సంవత్సరాలుగా పిల్లలకు భగవగత పద్యాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రం నేర్పించడం జరుగుతుంది.
పిల్లలతో పాటు పెద్దవారికి కూడా గత 5 నెలలుగా నేర్పించడం మొదలు పెట్టాము.. వారు చాలా శ్రద్ధ గా నేర్చుకున్నారు మొత్తం 25 మంది ఉన్నారు.. వీరందరికీ ఒకే రకమైన చీరలు ఇద్దామని అనిపించి గ్రామం లో తెలిసిన వారందరికీ చెప్పడం ఒక్కొక్కరిని ఒక్కో చీర మాత్రమే ఇమ్మని అడిగాను అడిగినవరందారు కాదనకుండా ఇచ్చారు. త్వరలోనే టీమ్ అందరికీ ఇవ్వబోతున్నాను
అక్కిరెడ్డి నూకమణి గారి ఇంటి దగ్గర లలితా సహస్రం పారాయణ : (2-2-2023)
ఇంటింటా లలితా సహస్రనామ స్తోత్రము పారాయణ
నేను మా టీమ్ కి చెప్పాను.. మన గ్రామం లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి మీరు పారాయణ చెయ్యాలని. ముందుగా వీరిని మూడు టీమ్ లుగా చేసి, ముందుగా ఎవరి టీమ్ వాళ్ళు వారివారి ఇళ్ళల్లో పారాయణ చేయండి ఆ తరువాత గ్రామం మొత్తం చెయ్యండి అని. వారంతా ఉత్సాహంతో సరే అన్నారు.. గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.
ఇన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేయడానికి నాకు ఏ సంస్థ నుంచి డబ్బులు రాలేదు.. మన టెంపుల్స్ గైడ్ ను ఫాలో అవుతున్న వారు నేను చేస్తున్న కార్యక్రమం మంచిదని పిల్లలను ప్రోత్సహించడానికి పెన్స్ , బుక్స్, చాక్లెట్స్ పంపించారు వారందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు..మీరు మమ్మల్ని ప్రోత్సహించక పోయి ఉంటే ఇంతలా చేసేవాణ్ణి కాదేమో 🙏

వసంత గారి ఇంటి దగ్గర లలితా సహస్రం పారాయణ ( 2-2-2023)
అక్కిరెడ్డి రమాదేవి వెంకటలక్ష్మి గార్ల ఇంటి దగ్గర పారాయణ : 3-2-2023
అక్కిరెడ్డి పద్మగారి ఇంటిదగ్గర పారాయణ 3-2-23